Sakshi News home page

రైతులకు ఈ–క్రాప్‌ రసీదులు

Published Wed, Nov 15 2023 12:20 AM

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా అధికారులు - Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌: ఖరీఫ్‌లో ఈ–క్రాప్‌, ఈ–కేవైసీ చేయించుకున్న రైతులందరికీ రసీదులు ఇవ్వాలని వ్యవసాయశాఖ కమిషనర్‌ సి.హరికిరణ్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన గుంటూరు నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఖరీఫ్‌లో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగుకు సంబంఽధించి ఈ–క్రాప్‌ చేయించుకున్నట్లు రైతుల దగ్గర అధారం ఉంటే భవిష్యత్తులో ఇన్‌పుట్‌, ఇన్సూరెన్స్‌, ఎంఎస్‌పీ అమ్మకాలు, పంట రుణాల సున్నావడ్డీ లాంటి వాటికి ఇబ్బంది ఉండదన్నారు. అలాగే రబీ స్థితిగతులు, వర్షాలు, పంటల సాగు, ఈ–క్రాప్‌ నమోదు, కిసాన్‌ డ్రోన్లు, పైలట్‌ శిక్షణ, కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్ల (సీహెచ్‌సీ) పనితీరు, పొలంబడి, ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం కింద చిరుధాన్యాల సాగు, ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు, రెయిన్‌ఫెడ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌, భూసార పరీక్షలు, ఇంటిగ్రేటెడ్‌ అగ్రికల్చర్‌ ల్యాబ్‌ల పనితీరు, విత్తనాలు, ఎరువుల పంపిణీ తదితర అంశాలపై తెలుసుకున్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో రైతుల్లో మనోధైర్యం నింపడానికి అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు కొనసాగించాలని ఆదేశించారు.

Advertisement
Advertisement