మెరుగైన వైద్యం అందించాలి | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్యం అందించాలి

Published Fri, Nov 17 2023 12:28 AM

- - Sakshi

గార్లదిన్నె: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ‘ఫ్యామిలీ డాక్టర్‌’ జిల్లా ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ నారాయణ స్వామి పేర్కొన్నారు. గురువారం కల్లూరులో నిర్వహించిన ‘ఫ్యామిలీ డాక్టర్‌’ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్న ఊరిలోనే వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తోందన్నారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. పిల్లలకు బుధవారం, శనివారం ఐరన్‌ సిరప్‌ వేయాలని, వైద్య పరీక్షలు చేయించాలని సిబ్బందికి సూచించారు. కల్లూరు ప్రాథమిక పాఠశాలను పరిశీలించి, ప్రతి గురువారం విద్యార్థులకు ఐరన్‌ మాత్రలు వేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ మనీషా, సూపర్‌వైజర్‌ సూర్యకళ, హెల్త్‌ అసిస్టెంట్‌ శివయ్య, ఎమ్‌ఎల్‌హెచ్‌పీ మధులత, ఏఎన్‌ఎం నాగేశ్వరి,ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులున్నారు.

విద్యారంగానికి పెద్దపీట

అనంతపురం ఎడ్యుకేషన్‌: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసిందని కేజీబీవీల జాయింట్‌ డైరెక్టర్‌ గీత, జిల్లా విద్యాశాఖ అధికారి నాగరాజు తెలిపారు. కేజీబీవీల్లో నూతనంగా ఎంపికై న సీఆర్టీలు, పీజీటీలకు ఆరు రోజుల రాష్ట్రస్థాయి శిక్షణ గురువారం ప్రారంభమైంది. అనంతపురం నగర శివారులోని వైవీ శివారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కేజీబీవీ జాయింట్‌ సెక్రెటరీ గీత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి నాగరాజు, సమగ్రశిక్ష అడిషనల్‌ ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ వరప్రసాద రావు మాట్లాడారు. అనాథ, పేద విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన కేజీబీవీల్లో నాణ్యమైన విద్య అందించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీ పడాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్‌ జగన్‌సమూల మార్పులు తీసుకొచ్చారన్నారు. నాడు–నేడు ద్వారా బడుల్లో మౌలిక వసతులు కల్పించారన్నారు. కార్పొరేట్‌ స్థాయికి మించి ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. కార్యక్రమంలో జీసీడీఓ మహేశ్వరి, పరిశీలకులు వెంకటరెడ్డి, తదితరులున్నారు.

‘కుల గణన’పై

నేడు సమావేశం

అనంతపురం రూరల్‌:ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘కుల గణన’ అంశంపై శుక్రవారం సమావేశం నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మధుసూదన్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టర్‌ కార్యాలయంలోని రెవెన్యూ భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్‌ గౌతమి ఆధ్వర్యంలో సమావేశం ప్రారంభమవుతుందన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు హాజరవుతారన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు, మేధావులు సలహాలు అందజేయవచ్చన్నారు.

Advertisement
Advertisement