ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే రూ.10 లక్షల విరాళం | Sakshi
Sakshi News home page

ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే రూ.10 లక్షల విరాళం

Published Mon, Nov 20 2023 12:40 AM

విరాళం అందజేస్తున్న తోపుదుర్తి రాజశేఖరరెడ్డి  - Sakshi

చెన్నేకొత్తపల్లి: మండల కేంద్రంలో గ్రామ దేవత కొల్లాపురమ్మ ఆలయ నిర్మాణానికి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి రూ.10లక్షల విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని ఆలయ కమిటీ సభ్యులకు రాప్తాడు వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు గోవిందరెడ్డి, సింగిల్‌ విండో అధ్యక్షుడు డోలా రామచంద్రారెడ్డి, వీఆర్వో మహేష్‌ రెడ్డి, నాయకులు సత్యనారాయణరెడ్డి, పసల నరసింహారెడ్డి, ఎస్‌టీడీ శ్రీనివాసరెడ్డి, ప్రకాష్‌రెడ్డి, మంజు, తాతిరెడ్డి, ఓబిరెడ్డి, లక్ష్మీరెడ్డి, గోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

యువకుడి ఆత్మహత్య

గుత్తి: జీవితంపై విరక్తితో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చెట్నేపల్లికి చెందిన గోవిందు, కనక మహాలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు నాలుగేళ్ల క్రితం మృతి చెందాడు. ఉద్యోగం రాకపోవడంతో పాటు రెండో కుమారుడు సునీల్‌కుమార్‌ (32) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చివరకు తనలో తానే మాట్లాడుకోవడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన సునీల్‌కుమార్‌... ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఒక్కసారిగా మంటలు ఎగిసి పడడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై అక్కడకు చేరుకుని సునీల్‌ కుమార్‌ను కాపాడారు. అప్పటికే తీవ్ర గాయాలతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందేలోపు మరణించాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

జాతీయ స్థాయి ఫెన్సింగ్‌

పోటీలకు అనంత క్రీడాకారులు

అనంతపురం: జరిగే జాతీయ స్థాయి ఫెన్సింగ్‌ పోటీలకు అనంత క్రీడాకారులు అర్హత సాధించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహించిన ఏడుగురు విద్యార్థులు ప్రతిభ చాటి బంగారు పతకాలు దక్కించుకుని, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికై న వారిలో పి. పుష్పలత, ఎం.చేతన, ఎన్‌.నాగవర్షిత, బి.సాయిగీత, ఎస్‌ఎన్‌ ప్రణవ్‌కుమార్‌, కె.చిన్మయి, బీవీ శివకుమార్‌, పి.నవనీత్‌ ఉన్నారు. అలాగే కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్‌–17 ఖోఖో పోటీల్లో ప్రతిభ చాటిన కె.సంధ్య జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిని డీఈఓ నాగరాజు, ఎస్‌జీఎఫ్‌ కోఆర్డినేటర్‌ ఎల్‌. నాగరాజు, ఉభయ జిల్లాల కార్యదర్శులు సుగుణమ్మ, అంజన్న అభినందించారు.

Advertisement
Advertisement