‘నాడు–నేడు’తో కార్పొరేట్‌ స్థాయికి | Sakshi
Sakshi News home page

‘నాడు–నేడు’తో కార్పొరేట్‌ స్థాయికి

Published Thu, Nov 23 2023 12:50 AM

- - Sakshi

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన విద్యాసంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ చేకూరింది. ఏ ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్ర చరిత్రలో నాడు– నేడు పథకం ద్వారా ప్రభుత్వ బడుల రూపు రేఖలు మార్చి కార్పొరేట్‌ స్థాయికి ఎదిగేలా చేశారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందుతోంది. ఒకప్పుడు ప్రభుత్వ బడులంటే పిల్లలను చేర్చేందుకు వెనకడుగు వేసిన తల్లిదండ్రులు నేడు అవే బడుల్లో పిల్లలకు అడ్మిషన్ల కావాలంటూ వెంటపడుతున్నారు. విద్యాప్రమాణాలు మెరుగుపడడంతో అందరూ ప్రభుత్వ బడులవైపే మొగ్గు చూపుతున్నారు.

– ఎం.వెంకటేశులు, టీచర్‌,

ఎంపీపీ స్కూలు, శెట్టూరు

రూ.లక్షల విలువ చేసే ఇల్లు వచ్చింది

నా భర్త యక్కలూరు నారాయణస్వామి, నేను బీఏ వరకు చదువుకున్నాం. మాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరమూ ప్రైవేట్‌ ఉద్యోగాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. చాలీచాలని వేతనాలతో ఇబ్బంది పడుతున్న మాకు... సొంతిల్లు అనేది ఓ కలగానే ఉండిపోయింది. అయితే మేము ఊహించని విధంగా వలంటీర్‌ వచ్చి వివరాలు తీసుకెళ్లి ఒకటిన్నర సెంటు స్థలానికి పట్టా తెచ్చిచ్చాడు. గృహ నిర్మాణానికి జగన్‌ సర్కార్‌ అన్ని విధాలా సహకరించింది. ప్రస్తుతం సొంతింట్లో ఎంతో సంతోషంగా జీవిస్తున్నాం. ఇదంతా సీఎం వైఎస్‌ జగన్‌ చలువే. రూ.లక్షల విలువ చేసే ఇంటిని మాకిచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌కు రుణపడ్డాం.

– ఎస్‌ రమాదేవి, జగనన్నకాలనీ, పామిడి

విద్యాప్రమాణాలు మెరుగుపడ్డాయి

చదువుకు మించిన గొప్ప ఆస్తి ఈ ప్రపంచం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలను సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేశారు. తొలుత వీటిని అనుసరించడం కాస్త ఇబ్బందిగా ఉన్నా... ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థుల వైపు నుంచి ఆలోచిస్తే సంస్కరణల అమలు మంచిదనే గుర్తించాం. గుణాత్మక విద్యకు పెద్ద పీట వేస్తూనే కార్పొరేట్‌ దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయి. ప్రభుత్వ బడుల రూపురేఖలు సమూలంగా మారిపోయాయి. ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లిష్‌ మీడియం చదువులు అందుబాటులోకి వచ్చాయి. సీఎం జగన్‌ అమలు చేసిన సంస్కరణల వల్లనే ఇదంతా సాధ్యమైంది.

– ఎన్‌.రామ్మోహన్‌, టీచర్‌,

5వవార్డు జెడ్పీహెచ్‌ఎస్‌, పామిడి

లక్షాధికారినయ్యా..

రోజూ ఇంటిల్లిపాది కూలి పనికి పోతేనే కుటుంబం గడుస్తుంది. ఇంటి అద్దె కట్టడం చాలా భారంగా ఉండేది. సొంతిల్లు కోసం గత ప్రభుత్వంలో అర్జీల మీద అర్జీలు ఇచ్చినా ఫలితం దక్కలేదు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక వలంటీర్‌ మా ఇంటి వద్దకు వచ్చి వివరాలు తీసుకెళ్లి ఇంటి పట్టా తెచ్చిచ్చారు. గార్లదిన్నె రైల్వే స్టేషన్‌ పక్కనే ఉన్న జగనన్న లే అవుట్‌లో రూ. లక్షల విలువ చేసే స్థలం నా పేరుపై సీఎం జగన్‌ ఇచ్చారు. ఇంటి నిర్మాణం కూడా పూర్తి కావొచ్చింది. సొంతింటి కల సాకారం చేస్తూ నన్ను లక్షాధికారిని చేసిన సీఎం వైఎస్‌ జగన్‌కు రుణపడి ఉంటాం.

– రమణమ్మ, గార్లదిన్నె

1/4

2/4

3/4

4/4

Advertisement

తప్పక చదవండి

Advertisement