రాయదుర్గంలో 5న బస్సు యాత్ర | Sakshi
Sakshi News home page

రాయదుర్గంలో 5న బస్సు యాత్ర

Published Sun, Dec 3 2023 12:26 AM

-

రాప్తాడు: జగన్‌ పాలనలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సామాజిక న్యాయం జరుగుతోందని జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. ఈ నెల 4న రాప్తాడులో జరిగే సామాజిక సాధికార బస్సు యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసే బహిరంగ సభ స్థలాన్ని వారు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్‌మోహన్‌ రెడ్డితోనే అన్ని వర్గాల ప్రజలకూ సామాజిక, ఆర్థిక న్యాయం చేకూరిందన్నారు. రాబోవు ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లోనూ గెలిపించే బాధ్యత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరూ తీసుకోవాలన్నారు. చంద్రబాబు ప్రజాధనం లూటీ చేశారు కాబట్టే జైలు జీవితం అనుభవిస్తున్నారన్నారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదన్నారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాలకు అధికారం అందాలన్నదే సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యమన్నారు. అందువల్లే 25 మంది ఉన్న మంత్రి వర్గంలో 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చోటు కల్పించారన్నారు. ఎస్సీ మహిళను రాష్ట్ర హోం మంత్రిగా చేసిన ఏకై క ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనన్నారు. కార్యక్రమంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, అహుడా చైర్మన్‌ మహాలక్ష్మి శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు మాలగుండ్ల శంకర నారాయణ, సిద్దారెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ నదీమ్‌ అహమ్మద్‌, రజక కార్పొరేషన్‌ చైర్మన్‌ మీసాల రంగన్న, డీసీసీబీ మాజీ చైర్మన్‌ పామిడి వీరాంజనేయులు, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ బోయ రామాంజినేయులు, బీసీ సెల్‌ నాయకులు చిట్రా వెంకటేష్‌, పసుపుల ఆది, మండల ఎన్నికల ఇన్‌చార్జ్‌ చిట్రెడ్డి సత్యనారాయణరెడ్డి, వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ జూటూరు శేఖర్‌, వైఎస్సార్‌ హర్టికల్చర్‌ వర్సిటీ బోర్డు సభ్యుడు ఆగ్రోస్‌ కేశవరెడ్డి పాల్గొన్నారు.

రాయదుర్గంలో 5న బస్సు యాత్ర

రాయదుర్గం: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అగ్రపీఠం దక్కిందని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషశ్రీచరణ్‌, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. గడిచిన నాలుగున్నరేళ్లలో జరిగిన సామాజిక విప్లవం, గడప గడపకూ చేరిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు తెలియజేసేందుకు ఈ నెల ఐదో తేదీన రాయదుర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శనివారం వారు బస్సుయాత్ర రూట్‌మ్యాప్‌, తేరుబజారులో బహిరంగ సభ స్థలం వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ అంబేడ్కర్‌, జ్యోతిరావుపూలే వంటి మహనీయుల ఆశయ సాధన దిశగా సీఎం జగన్‌ పయనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల నుండి పదవుల వరకు సామాజిక విప్లవం కొనసాగిస్తూ అన్నింటా అగ్రతాంబూలం అందించారని గుర్తుచేశారు. ఆ వర్గాలన్నీ 2024లో వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తేవడంలో కీలక భాగస్వాములుగా నిలవాలని కోరారు. బస్సు యాత్రను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మంత్రుల వెంట ఎంపీ రంగయ్య, ఏపీఐఐసీ చైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పొరాళ్ల శిల్ప, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రారెడ్డి, అహుడా చైర్మన్‌ మహాలక్ష్మి శ్రీనివాస్‌, ఏడీసీసీబీ మాజీ చైర్మన్‌ పామిడి వీరాంజినేయులు, ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ శ్రీనివాసులు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు శ్రీనివాస్‌యాదవ్‌, వలి బాషా, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి బీటీపీ గోవిందు, జిల్లా ఉపాధ్యక్షులు రాళ్ల తిమ్మారెడ్డి, పట్టణ, మండల కన్వీనర్లు అరవ శివప్ప, ఎం.వన్నూర్‌స్వామి, గౌని కాంతారెడ్డి, మేకల శ్రీనివాసులు, క్లాస్‌–1 కాంట్రాక్టర్లు గౌని సత్య నారాయణరెడ్డి, ఆర్టీ కాంతారెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement