వైఎస్సార్‌సీపీ పాలనలో సంక్షేమంతో పాటు సామాజిక | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ పాలనలో సంక్షేమంతో పాటు సామాజిక

Published Tue, Dec 5 2023 5:20 AM

జయహో జగన్‌ : మిన్నంటిన జగన్నినాదం - Sakshi

కనగానపల్లి: ‘వైఎస్సార్‌సీపీ పాలనలో సంక్షేమంతో పాటు సామాజిక, రాజకీయ పరంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు తగిన గుర్తింపు లభించింది. స్థానిక సంస్థల మొదలు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరిగింది. నామినేటెడ్‌ పదవుల్లోనూ అగ్రతాంబూలమే దక్కింది. బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం జగనన్న పాలనలోనే సాధ్యమైంది’ అని వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, నేతలు స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి నేతృత్వంలో రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ అధ్యక్షతన సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తో పాటు శ్రీసత్యసాయి జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి గుమ్మనూరు జయరాం, బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌ హాజరయ్యారు. మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు. అనంతరం మంత్రి గుమ్మనూరు జయరాంమాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు నామినేటెడ్‌ పదవులు కల్పించిన ఘనత వైఎస్‌ జగన్‌దే అన్నారు. ఎంపీ నందిగం సురేశ్‌ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో 99.9 శాతం అమలు చేసి రాష్ట్రంలో పేదరికాన్ని తగ్గించారన్నారు. చంద్రబాబు పాలనలో తనలాంటి బలహీన వర్గాల వ్యక్తిని జైలులో కూర్చోబెడితే.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఎంపీని చేసి పార్లమెంటులో కూర్చోబెట్టారని గుర్తు చేశారు. పక్క రాష్ట్రంలో కాంగ్రెస్‌ గెలిసే టీడీపీ నేతలు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.

Advertisement
Advertisement