‘ఆడుదాం ఆంధ్రా’ పోస్టర్ల విడుదల | Sakshi
Sakshi News home page

‘ఆడుదాం ఆంధ్రా’ పోస్టర్ల విడుదల

Published Sat, Dec 9 2023 12:10 AM

పోస్టర్లు విడుదల చేస్తున్న మంత్రి ఉషశ్రీచరణ్‌  - Sakshi

కళ్యాణదుర్గం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆడుదాం ఆంధ్రా’ టోర్నమెంట్‌ పోస్టర్లను మంత్రి కేవీ ఉషశ్రీచరణ్‌ శుక్రవారం సాయంత్రం కళ్యాణదుర్గంలోని క్యాంప్‌ కార్యాలయంలో విడుదల చేశారు. క్రీడాకారులకు అవసరమైన అన్ని వసతులూ సమకూర్చుతున్నట్లు డీఎస్‌డీఓ నరసింహారెడ్డి, జిల్లా శాప్‌ రెజ్లింగ్‌ కోచ్‌ రాఘవేంద్ర, షటిల్‌ శాప్‌ కోచ్‌ నరేష్‌, ఆడుదాం ఆంధ్రా నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ చల్లా కిరణ్‌ చౌదరి మంత్రికి తెలియజేశారు. కార్యక్రమంలో స్టేడియం ఇన్‌చార్జ్‌ మద్దిలేటి, మండల కో ఆర్డినేటర్‌ రమేష్‌, రాజగోపాల్‌, మురళి తదితరులు పాల్గొన్నారు.

11న పెన్షన్‌ అదాలత్‌

అనంతపురం సిటీ: ఈ నెల 11న పెన్షన్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు కడప రీజనల్‌ పీఎఫ్‌ కమిషనర్‌–2 గౌరవ్‌ మహల్వాల్‌ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈపీఎస్‌–1995 పెన్షనర్లు/సభ్యులకు ఈపీఎస్‌ నిబంధనలు అర్థం చేసుకోవడానికి, తమ ఫిర్యాదులు పరిష్కరించుకోవడానికి ఈపీఎఫ్‌ఓ అధికారులతో సన్నిహితంగా వ్యవహరించాలన్న ఉద్దేశంతో వెబెక్స్‌ వేదికగా పెన్షన్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు అందులో పేర్కొన్నారు. పెన్షనర్లతో పాటు మరో మూడు నెలల్లో పెన్షనర్లు కానున్న ఈపీఎస్‌ సభ్యులు తమ సమస్యలను పెన్షన్‌ అదాలత్‌ దృష్టికి తీసుకురావచ్చన్నారు. ఆసక్తి గల వారు లింక్‌ ద్వారా

పాల్గొన వచ్చని సూచించారు.

https://meetingsapac. webex.com/meetingsapac19/i.php?MTID=m12aa29Oa15c003b2fc77f89648288c83

మీటింగ్‌ నంబర్‌ : 2642 982 5904

పాస్వర్డ్‌ : 12345

తేదీ : 11.12.2023

సమయం : ఉదయం 11.00 గంటలు

సాఫ్ట్‌బాల్‌ జట్టు ఎంపిక

అనంతపురం: అనంతలక్ష్మి ఇంజినీరింగ్‌ కళాశాలలో జేఎన్‌టీయూఏ ఇంటర్‌ యూనివర్సిటీ పురుషుల సాఫ్ట్‌ బాల్‌ జట్టు ఎంపిక కోసం శుక్రవారం సెలక్షన్‌ ట్రయల్స్‌ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ రామమూర్తి తెలిపారు. స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ సెక్రెటరీ జోజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనంతలక్ష్మి కళాశాలకు జేఎన్‌టీయూఏ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ నిర్ధారించిన విధంగా సాఫ్ట్‌బాల్‌ ట్రయల్స్‌ నిర్వహించే బాధ్యతను అప్పగించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్‌ అనంత రాముడు, వైస్‌ చైర్మన్‌ రమేష్‌ నాయుడు, ప్రిన్సిపాల్‌ రామమూర్తి, నైపుణ్యాభివృద్ధి సంచాలకులు సురేంద్ర నాయుడు, ఫిజికల్‌ డైరెక్టర్‌ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న జేఎన్‌టీయూఏ స్పోర్ట్స్‌ సెక్రటరీ జోజిరెడ్డి
1/1

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న జేఎన్‌టీయూఏ స్పోర్ట్స్‌ సెక్రటరీ జోజిరెడ్డి

Advertisement
Advertisement