జనవరి 6న జేఎన్‌టీయూ స్నాతకోత్సవం | Sakshi
Sakshi News home page

జనవరి 6న జేఎన్‌టీయూ స్నాతకోత్సవం

Published Wed, Dec 13 2023 5:08 AM

- - Sakshi

అనంతపురం: జనవరి ఆరో తేదీన అనంతపురం జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ–ఏ) 13వ స్నాతకోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు యూనివర్సిటీల చాన్సలర్‌/ రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లు వీసీ ఆచార్య జింకా రంగజనార్దన మంగళవారం తెలిపారు. స్నాతకోత్సవ నిర్వహణకు వివిధ కమిటీలను నియమించినట్లు వెల్లడించారు. స్నాతకోత్సవ వేళ పీహెచ్‌డీ పట్టాలు, గోల్డ్‌మెడల్స్‌ అందజేస్తామని ప్రకటించారు. ఆ రోజు ఉదయం 9.30 గంటలకే విద్యార్థులు జేఎన్‌టీయూకు చేరుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

మణిపూర్‌ జానపదం అదరహో

ప్రశాంతి నిలయం: పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన మణిపూర్‌ సత్యసాయి భక్తులు మంగళవారం సంగీత విభావరి నిర్వహించారు. సాయికుల్వంత్‌ సభా మందిరంలో సుమారు గంట పాటు కార్యక్రమం జరిగింది. మణిపూర్‌ జానపద ‘నుపి పాల’ సంగీత రీతిలో విష్ణుమూర్తి దశావతారాలను వివరిస్తూ సాయికుల్వంత్‌ సభా మందిరాన్ని మార్మోగించారు.

వైభవంగా భస్మాభిషేకం

తాడిపత్రి అర్బన్‌: కార్తీక అమావాస్యను పురస్కరించుకుని మంగళవారం రాత్రి తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వర ఆలయంలో కాశీ విశ్వేశ్వరునికి భస్మాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సతీమణి కేతిరెడ్డి రమాదేవి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ దర్మకర్తల మండలి సభ్యులు వీరికి తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు. భక్తులకు అన్నదానం చేశారు.

వైఎస్సార్‌సీపీ అనుబంధ కమిటీల్లో పలువురికి చోటు

అనంతపురం కార్పొరేషన్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అనుబంధ కమిటీల్లో జిల్లాకు చెందిన పలువురికి చోటు లభించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా స్వర్ణలతను నియమించారు. అలాగే యువజన విభాగం జోనల్‌ ఇన్‌చార్జ్‌గా (జోన్‌–8) యల్లారెడ్డి ప్రణయ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులుగా గొర్ల మారుతి నాయుడు, పామిరెడ్డి మహేశ్వర్‌రెడ్డి, సహాయ కార్యదర్శిగా బైరెడ్డిపల్లి రాజేష్‌ను నియమించారు.

1/2

సంగీత కచేరీ నిర్వహిస్తున్న మణిపూర్‌  సత్యసాయి భక్తులు
2/2

సంగీత కచేరీ నిర్వహిస్తున్న మణిపూర్‌ సత్యసాయి భక్తులు

Advertisement
Advertisement