మరింత చేరువగా భవిష్యనిధి | Sakshi
Sakshi News home page

మరింత చేరువగా భవిష్యనిధి

Published Sat, Dec 23 2023 4:50 AM

- - Sakshi

అనంతపురం సిటీ: ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్‌ఓ)ని లబ్ధిదారులకు మరింత చేరువ చేసి, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే లక్ష్యంగా నిరంతర కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆ శాఖ కడప రీజనల్‌ కమిషనర్‌–1 కార్యాలయ అధికారులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందు కోసం ప్రతి నెలా 27న నిధి ఆప్కే నికత్‌ 2.0 పేరుతో కార్యక్రమాలు చేపడుతున్నట్ల వివరించారు. ఇందులో భాగంగా ఈ నెల 27న కొత్తగా కవర్‌ చేసిన సంస్థల కోసం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు ఒరియంటేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. సంస్థల యజమానులు/ప్రధాన యజమానుల సమస్యలను తెలుసుకునేందుకు ఉదయం 11 నుంచి 11.30 గంటల వరకు ఆన్‌లైన్‌ సేవలు ఉంటాయన్నారు. చందాదారులు/పెన్షనర్ల కోసం ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, కొత్త కార్యక్రమాలు, సంస్కరణలపై మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు అవగాహన కార్యక్రమాలు ఉంటాయన్నారు. మధ్యాహ్నం 2 నుంచి 2.30 గంటల వరకు మినహాయింపు పొందిన సంస్థల వారితో ముఖాముఖి కార్యక్రమం ఉంటుందన్నారు. సమస్యలను జిల్లాలోని నిధి ఆప్కే నికత్‌ 2.0 నోడల్‌ అధికారి స్వీకరించగలిగితే త్వరగా పరిష్కరమవుతాయన్నారు. అనంతపురం జిల్లాకు సంబంధించి నిధి ఆప్కే నికత్‌2.0 కార్యక్రమం అక్కడి రాంగనర్‌లోని సేతు ఎడ్యుకేషనల్‌ అకాడమీ, డోర్‌ నెంబర్‌: 6–2–713, మీసేవా దగ్గరనున్న కార్యాలయంలో ఉంటుందన్నారు. వినియోగదారులు హాజరై తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.

Advertisement
Advertisement