●ముక్కోటి.. జనకోటి | Sakshi
Sakshi News home page

●ముక్కోటి.. జనకోటి

Published Sun, Dec 24 2023 1:40 AM

అనంతపురం: పాతూరు చెన్నకేశవస్వామి దర్శనానికి బారులుదీరిన భక్తులు   - Sakshi

గోవింద నామస్మరణతో ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రతిధ్వనించింది. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం శ్రీవారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలిరాగా, వైష్ణవాలయాలన్నీ కిటకిటలాడాయి. అనంతపురంలో లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవాలయం, చెన్నకేశవ ఆలయం, కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు పలు ఆలయాల వద్ద తెల్లవారుజామునే భక్తుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది. ముక్కోటి ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు భూలోకానికి వచ్చి శ్రీ మహా విష్ణువును పూజిస్తారని అర్చకులు తెలిపారు. అందుకే ఈరోజు ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే సమస్త పుణ్య పరంపరలు చేకూరుతాయని అర్చక పండితులు భక్తులకు వివరించారు.

– అనంతపురం కల్చరల్‌

1/3

అనంతపురం: అలంకరణలో చెన్నకేశవస్వామి
2/3

అనంతపురం: అలంకరణలో చెన్నకేశవస్వామి

కదిరి నృసింహాలయంలో ఉత్తర ద్వారం వద్ద క్యూలైన్లో భక్తులు (ఇన్‌సెట్‌) ఖాద్రీశుడు
3/3

కదిరి నృసింహాలయంలో ఉత్తర ద్వారం వద్ద క్యూలైన్లో భక్తులు (ఇన్‌సెట్‌) ఖాద్రీశుడు

Advertisement
Advertisement