హంపీలో పోటెత్తిన పర్యాటకులు | Sakshi
Sakshi News home page

హంపీలో పోటెత్తిన పర్యాటకులు

Published Mon, Dec 25 2023 1:50 AM

హంపీలో పర్యాటకుల సందడి 
 - Sakshi

హొసపేటె: ప్రపంచ ప్రసిద్ద పర్యాటక కేంద్రంగా, దక్షిణ కాశీగా పేరొందిన హంపీకి ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. శనివారం నుంచి సోమవారం వరకు వరసగా సెలవులు రావడంతో పర్యాటకుల సందడి భారీగా పెరిగింది. దీంతో హంపీ వీధులు కిటకిటలాడుతున్నాయి. పర్యాటకుల రాకతో హంపీలోని కొన్ని చోట్ల ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. పర్యాటకులు హంపీ శ్రీ విరుపాక్ష స్వామిని దర్శించుకొన్నారు. అదే విధంగా రాయలకాలంనాటి లోటస్‌ మహాల్‌, ఎలిఫెంట్‌ హౌస్‌, ఏకశిలా రథం, సరిగమలు స్వప్త స్వరాల మందిరం, హాజరామ మందిరం, మహానవమి దిబ్బ, విజయవిఠల దేవస్థానం, ఉగ్రనరసింహా, రాణిస్థాన మందిరం, జైన్‌ మందిరం, కోదండ రామ మందిరంతో పాటు సుందరమైన స్మారకాలు, కట్టడాలు, దేవాలయాలను వీక్షించారు. ఎలాంటి సమస్యలు కలగకుండా ముందుగా ఎస్పీ శ్రీ హరిబాబు ఆధ్వర్యంలో గట్టిగా పోలీస్‌ బందోబస్త్‌ ఏర్పాటు చేశారు.

హంపీలో సూర్యోదయ అందాలు

హంపీలోని శ్రీ మాల్యవంత పర్వతం వద్ద సూర్యోదయ అందాలను చూడటానికి ఆదివారం ఉదయం పెద్ద ఎత్తున దేశ, విదేశాలకు చెందిన పర్యటకులు తరలివచ్చారు. చలిని సైతం లెక్క చేయకుండా సూర్యోదయ అందాలను వీక్షించారు.

హంపీ పర్యాటకులు సూర్యోదయాన్ని వీక్షిస్తున్న దృశ్యం
1/1

హంపీ పర్యాటకులు సూర్యోదయాన్ని వీక్షిస్తున్న దృశ్యం

Advertisement

తప్పక చదవండి

Advertisement