ఉత్సాహంగా గ్రామీణ పోటీలు | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా గ్రామీణ పోటీలు

Published Mon, Dec 25 2023 1:50 AM

రాగిముద్దను ఆరగిస్తున్న పోటీదారులు - Sakshi

తుమకూరు: తుమకూరు జిల్లా తిపటూరు తాలూకా శ్రీసత్య గణపతి అస్థాన మంటపంలో వ్యవసాయశాఖ, జేమ్స్‌ ఫౌండేషన్‌, శ్రీసత్యగణపతి సేవా ట్రస్టు, సోగడు జానపద హెజ్జె ఆధ్వర్యంలో ఆదివారం రైతు దినోత్సవం సందర్భంగా ఇసురు రాయి తిప్పే పోటీలు, రాగి ముద్ద తినే పోటీలు నిర్వహించారు. ఎమ్మెల్యే షడక్షరి హాజరై పోటీలను ప్రారంభించి మాట్లాడారు. రాగి గంజి, రాగి రొట్టె, రాగి ముద్ద తినేవారికి ఎలాంటి వ్యాధులు రావన్నారు. రాగి ఉప్మా, రాగి ఒబ్బట్లు, రాగి తంబ్టిట్లు, రాగి నిప్పట్లు, రాగి కారం, రాగి మాల్ట్‌, రాగి సేమియా ఇలా అనేక రకాల వంటలను ప్రదర్శించారు. కరడాలు శంకరయ్య అనే వ్యక్తి మూడు నిమిషాల్లో 5 రాగి ముద్దలు తిని మొదటి స్థానంలో నిలిచాడు. రంగనాథ్‌ అనే వ్యక్తికి రెండో స్థానం దక్కింది. ఉప విభాగం అధికారి సప్తశ్రీ పాల్గొన్నారు.

ఇసురురాయిని తిప్పే పోటీల దృశ్యం
1/1

ఇసురురాయిని తిప్పే పోటీల దృశ్యం

Advertisement

తప్పక చదవండి

Advertisement