విదేశీ మద్యం బాటిళ్లు స్వాధీనం | Sakshi
Sakshi News home page

విదేశీ మద్యం బాటిళ్లు స్వాధీనం

Published Tue, Mar 26 2024 12:20 AM

సీఎం పర్యటనపై మక్బూల్‌తో   చర్చిస్తున్న తలశిల రఘురాం   - Sakshi

అనంతపురం: నగరంలోని హమాలీ కాలనీలో పెద్ద సంఖ్యలో విదేశీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండో పట్టణ సీఐ కాంత్రి కుమార్‌ తెలిపిన మేరకు... అనంతపురంలోని హమాలీ కాలనీలో నివాసముంటున్న హనుమంతరెడ్డి కుమారుడు భరత్‌ రెడ్డి.. మాజీ సైనికోద్యోగుల కార్డులు సేకరించి బెంగళూరులోని ఆర్మీ క్యాంటీన్‌లో మద్యం బాటిళ్లు కొనుగోలు చేసుకొచ్చి అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఆర్మీ మద్యం బాటిళ్లతో పాటు విదేశీ మద్యాన్ని సైతం కొనుగోలు చేసి తీసుకొచ్చాడు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి నేతృత్వంలో బృందాలుగా విడిపోయి సోమవారం ఉదయం హమాలీ కాలనీలో తనిఖీలు చేపట్టారు. ఓ అపార్ట్‌మెంట్‌లో దాచిన 39 మద్యం బాటిళ్లు గుర్తించి స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్‌ చేశారు. తనిఖీల్లో రుష్యేంద్రబాబు, సలామ్‌ ఖాన్‌ పాల్గొన్నారు.

కదిరిలో ఇఫ్తారు

విందుకు సీఎం జగన్‌

కదిరి: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలో కదిరికి రానున్నారు. రంజాన్‌ మాసం సందర్భంగా ముస్లిం మైనార్టీల కోసం ఏర్పాటు చేయనున్న ఇఫ్తారు విందులో సీఎం పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన వేదికను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్‌, ఎమ్మెల్సీ తలశిల రఘురాం సోమవారం కదిరికి విచ్చేశారు. వైఎస్సార్‌ సీపీ కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి బీఎస్‌ మక్బూల్‌ అహ్మద్‌తో కలిసి కదిరి–మదనపల్లి రోడ్‌లోని పీవీఆర్‌ ఫంక్షన్‌ హాలును పరిశీలించారు. ఏప్రిల్‌ 1న సీఎం పర్యటన ఉండవచ్చని మక్బూల్‌ తెలిపారు.

స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను చూపుతున్న పోలీసులు
1/1

స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను చూపుతున్న పోలీసులు

Advertisement
Advertisement