Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Jagan Mohan Reddy Vs Chandrababu Naidu in Andhra pradesh
మీ ఓటు దేనికి?

సీఎం జగన్‌ వ్యక్తిత్వంసీఎం వైఎస్‌ జగన్‌ నిజాలే మాట్లాడతారు. అబద్ధాలు చెప్పరు. చేయగలిగిందే చెప్పడం.. ఇచ్చిన మాటకు కట్టుబడటం.. దాన్ని నిలబెట్టు కోవడం కోసం ఎందాకైనా పోరాటం చేయడం.. జనంతో మమేకమవడం సీఎం జగన్‌ విధానం. మిగిలిన సమయాన్ని కుటుంబంతో గడుపుతారు. ప్రైవేటు జీవితం అంటూ సీఎం జగన్‌కు లేదు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడూ.. అధికారంలోకి వచ్చాక కూడా ఇదే విధానం. తన తండ్రి, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణించాక.. ఆ వార్త విని తాళలేక గుండె పగిలి మరణించిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు ఓదార్పు యాత్ర చేపట్టారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాం«దీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుమ్మక్కై అక్రమ కేసులు బనాయించి.. 16 నెలలపాటు జైల్లో అక్రమంగా నిర్బంధించినా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం సీఎం జగన్‌ వెనక్కి తగ్గలేదు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాటాలు చేశారు.ప్రతిపక్ష నేతగా ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో 14 నెలలపాటు ప్రజల్లోనే గడిపారు. అధికారంలోకి వచ్చాక.. రోజువారీ పరిపాలన.. సమీక్షలు, ప్రజలతో మమేకమవడం.. మిగిలిన సమయం కుటుంబంతో గడపడం సీఎం దినచర్య. కుటుంబ రాజకీయాలకు సీఎం జగన్‌ వ్యతిరేకం. వీటి వల్ల అనవసరమైన ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నది సీఎం జగన్‌ నిశి్చతాభిప్రాయం.చంద్రబాబు వ్యక్తిత్వంమచ్చుకైనా నిజాన్ని చెప్పకపోవడం.. ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పడం ద్వారా నిజం చేయవచ్చునన్నది చంద్రబాబు విధానం. సెల్‌ ఫోన్‌ను నేనే కనిపెట్టా.. కంప్యూటర్‌ను నేనే తెచ్చా.. హైదరాబాద్‌ను నేనే కట్టా.. అంటూ బీరాలు పలకడమే అందుకు నిదర్శనం. ఇచ్చిన మాటకు కట్టుబడకపోవడం.. ఎనీ్టఆర్‌కు వెన్నుపోటు పొడవడంలో సహకరించిన కుటుంబ సభ్యులు హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు వంటి వారితోపాటు ఎవరినైనా నమ్మించి నట్టేట ముంచడం చంద్రబాబు నైజం.వారసత్వ రాజకీయాలకు.. కుటుంబ రాజకీయాలకు చంద్రబాబు ఆద్యుడు. సర్పంచుగా కూడా గెలవని తన కుమారుడు నారా లోకేశ్‌ను 2017లో ఏకంగా మంత్రిని చేసి.. నాలుగు కీలక శాఖలను కట్టబెట్టారు. వియ్యంకుడు బాలకృష్ణను హిందూపురం శాసనసభ స్థానం.. లోకేశ్‌ తోడల్లుడు భరత్‌ను విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దించారు. సీఎం జగన్‌ఓదార్పు యాత్ర నుంచి ప్రజాసంకల్ప పాదయాత్ర వరకు నిత్యం జనంతో మమేకమవుతూ వచ్చిన వైఎస్‌ జగన్‌.. ప్రజా సమస్యలను, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను గుర్తించారు. విద్య, వైద్యం కోసం అధిక శాతం కుటుంబాలు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవడం వల్ల రుణాల ఊబిలో కూరుకుపోతున్నారని పసిగట్టారు. అధికారంలోకి వచ్చాక సమస్యలను పరిష్కరించి మెరుగైన సమాజాన్ని నిరి్మంచడమే లక్ష్యంగా.. రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా రూపొందించుకున్న ప్రణాళికలను అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా డబ్బులను పేదలకు పంచి పెడుతున్నారని పెత్తందార్లు చేస్తున్న విమర్శల్లో అర్థం లేదు. సీఎం జగన్‌ ప్రారంభించిన ప్రతి పథకానికి ఒక లక్ష్యం ఉంది. ఆర్థిక వేత్తలంతా ఇదే సరైన విధానమని ప్రశంసిస్తున్నారు. విద్యారంగం⇒ ప్రజాసంకల్ప పాదయాత్రలో పేదరికంతో పిల్లలను చదివించలేని తల్లిదండ్రుల పరిస్థితిని గమనించారు. ప్రతి ఇంట్లో ప్రతి అబ్బాయి.. అమ్మాయి ఉన్నత చదువులు చదివితే.. ఉద్యోగాలు, ఉపాధి పొందుతారని, అప్పుడు ఆ కుటుంబం పేదరికాన్ని అధిగమిస్తుందని భావించారు. మీ పిల్లలను బడికి పంపితే చాలు అమ్మ ఒడి పథకం కింద ఏడాదికి తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు జమ చేస్తానని మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక నాడు–నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి.. కార్పొరేట్‌ స్థాయికి దీటుగా అభివృద్ధి చేశారు. ఇంగ్లిష్‌ మీడియం భోదనను, సీబీఎస్‌ఈ సిలబస్‌ను ప్రవేశపెట్టారు. ⇒ నాణ్యమైన పౌష్టికాహారాన్ని, మధ్యాహ్న భోజనం, చిక్కీని అందించేందుకు గోరుముద్ద పథకాన్ని ప్రారంభించారు. పాఠశాల తెరిచిన రోజే పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగ్, బూట్లు, సాక్స్‌లను విద్యా కానుక కింద పిల్లలకు అందిస్తున్నారు. మూడో తరగతి నుంచే టోఫెల్‌ శిక్షణ ఇస్తున్నారు. తద్వారా పిల్లలను పాఠశాలలకు పంపడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థి సగటు నమోదు నిష్పత్తి (జీఈఆర్‌) 2018 నాటికి 84.48 శాతం ఉంటే.. ఇప్పుడు వంద శాతానికి చేరుకుంది. అంటే.. బడి ఈడు పిల్లలందరూ బడుల్లోనే ఉండాలన్న లక్ష్యం సాధించారు. పిల్లల చదువుల కోసం సీఎం జగన్‌ తీసుకుంటున్న చర్యలను బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడుతున్న ప్రముఖ సంఘ సంస్కర్త, నోబెల్‌ శాంతిపురష్కార గ్రహీత, రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత కైలాస్‌ సత్యార్థి దేశ, అంతర్జాతీయ వేదికలపై ప్రశంసించారు. ⇒ అంతర్జాతీయ స్థాయిలో మన పిల్లలు పోటీ పడేలా చేయాలనే లక్ష్యంతో సీఎం జగన్‌.. ఐబీ (ఇంటర్నేషనల్‌ బకలారియేట్‌) సిలబస్‌ను 2025 జూన్‌ నుంచి ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. 2035 నాటికి పదో తరగతి పరీక్షలు ఐబీ సిలబస్‌లో మన విద్యార్థులు రాస్తారు. ఆ తర్వాత ఉన్నత విద్యను ఐబీ సిలబస్‌లోనే ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్, కేంబ్రిడ్జి, ఎంఐటీ, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ వంటి యూనివర్సిటీల ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో అభ్యసించనున్నారు. ఆ సరి్టఫికెట్లతో బయటకొచ్చిన మన విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు కార్పొరేట్‌ సంస్థలు క్యూ కట్టడం ఖాయం. ⇒ ప్రాథమిక స్థాయి నుంచి విద్యారంగాన్ని పటిష్టం చేస్తున్న సీఎం జగన్‌.. బీటెక్, ఎంటెక్, ఎంబీబీఎస్‌ వంటి ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు విద్యాదీవెన పథకం ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తున్నారు. వసతి, భోజన ఖర్చుల కోసం వసతి దీవెన కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తున్నారు. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా చూశారు. బీటెక్, ఎంటెక్‌ వంటి ఉన్నత చదువులు చదివిన విద్యార్థులకు నైపుణ్యాలను పెంచుతూ శిక్షణ ఇస్తున్నారు. దాంతో 2022–23లో క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా గరిష్టంగా 1.80 లక్షల మంది విద్యార్థులు కార్పొరేట్‌ సంస్థల్లో ఉద్యోగాలు పొందారు. ఎవరు విజనరీ?వైద్య రంగం ⇒ ఇంట్లో ఒకరికి జబ్బు చేస్తే.. చికిత్స కోసం చేసిన అప్పులు తడిసి మోపెడై ఇబ్బందులు పడుతున్న లక్షలాది కుటుంబాలను పాదయాత్రలో గుర్తించిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక నిర్జీవమైన ఆరోగ్యశ్రీకి జీవం పోశారు. ఆరోగ్యశ్రీలో చికిత్స విధానాలను 1,059 నుంచి 3,257కి పెంచారు. రూ.25 లక్షల వరకు వైద్య ఖర్చుల పరిమితిని పెంచారు. చికిత్స వ్యయం రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీని వర్తింపజేశారు. ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి ఆరోగ్య ఆసరా కింద నెలకు గరిష్టంగా రూ.5 వేలను సహాయంగా అందిస్తూ జీవనోపాధులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. తద్వారా ప్రజారోగ్యానికి భరోసా కల్పించారు. ⇒ నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను కల్పించి, కార్పొరేట్‌ స్థాయికి అభివృద్ధి చేశారు. ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు ఖాళీ ఉండడానికి వీలు లేకుండా చర్యలు తీసుకుని.. 54 వేల పోస్టులను భర్తీ చేశారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ ఆవిష్కరణే లక్ష్యంగా ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి.. ప్రజల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. ⇒ బీపీ, షుగర్, ఇతర అనారోగ్య సమస్యలను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి.. చికిత్సలు అందిస్తున్నారు. తద్వారా ప్రజలు గుండె, మెదడు, కిడ్నీ, క్యాన్సర్‌ వంటి ఇతర పెద్ద జబ్బుల బారిన పడకుండా నియంత్రిస్తున్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక మెడికల్‌ కాలేజ్‌ చొప్పున.. కొత్తగా 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టారు. వందేళ్ల చరిత్రలో రాష్ట్రంలో 11 మెడికల్‌ కాలేజీలు ఉంటే.. మూడేళ్ల వ్యవధిలోనే కొత్తగా 17 కాలేజ్‌లను అందుబాటులోకి తెస్తున్నారు. తాజాగా రాజంపేటలో మరో కాలేజీ నిర్మాణానికి హామీ ఇచ్చారు. ఐదు కాలేజీలు గతేడాది ప్రారంభమయ్యాయి. వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఐదు కాలేజీలు ప్రారంభించనున్నారు. వ్యవసాయ రంగం ⇒ రాష్ట్రంలో 70 శాతం ప్రజల జీవనాధారం వ్యవసాయం. పాదయాత్రలో రైతులు పడుతున్న వెతలను కళ్లారా చూసిన వైఎస్‌ జగన్‌.. పంట పండినా, ఎండినా కర్షకులకు నష్టం లేకుండా చేయడం ద్వారా వ్యవసాయాన్ని పండుగగా మార్చాలని నిర్ణయించారు. అధికారంలోకి వచ్చాక విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు గ్రామ స్థాయిలో ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు) వ్యవస్థను తీసుకొచ్చారు. ⇒నకిలీలకు తావులేకుండా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు రైతు ముంగిటకు అందించారు. ఇచ్చిన హామీ కంటే మిన్నగా రైతు భరోసా కింద ప్రతి ఏటా పెట్టుబడి సహాయం అందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత పంటల బీమా, తొమ్మిది గంటలపాటు పగటిపూటే ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ అందించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఆ సీజన్‌ ముగిసేలోగా పరిహారం అందించి దన్నుగా నిలబడటం ద్వారా వ్యవసాయాన్ని పండుగగా చేశారు. దేశ జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 16 శాతం ఉంటే.. రాష్ట్ర వ్యవసాయ రంగం వాటా 36 శాతంపైనే (దేశంలో రెండో స్థానం) ఉండటమే అందుకు తార్కాణం. రాష్ట్రంలో సీఎం జగన్‌ అమలు చేస్తున్న వ్యవసాయ విధానాలను ఐక్యరాజ్య సమితి, నీతి ఆయోగ్, నాబార్డు, ప్రపంచ బ్యాంకు ప్రశంసించాయి. పారిశ్రామిక రంగం ⇒ పాదయాత్రలో ఉద్యోగం, ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న యువత కష్టాలను తెలుసుకున్న వైఎస్‌ జగన్‌.. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించి, నిరుద్యోగాన్ని తగ్గించాలని నిర్ణయించారు. అధికారం చేపట్టాక విప్లవాత్మక సంస్కరణల ద్వారా సులభతర వాణిజ్యం (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌)లో ఏటా రాష్ట్రాన్ని దేశంలో నంబర్‌ వన్‌ స్థానంలో నిలిపారు. ఎంఎస్‌ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్య చిన్నతరహా పరిశ్రమలు)లకు ప్రోత్సాహకాలు ఇచ్చి, చేయిపట్టి నడిపించారు. దాంతో 2018–19 నాటికి రాష్ట్రంలో 1.9 లక్షలు ఉన్న ఎంఎస్‌ఎంఈలు ఇప్పుడు ఏడు లక్షలకు చేరుకున్నాయి. ⇒ పారదర్శక పారిశ్రామిక విధానం వల్ల టాటాలు, బిర్లాలు, అదానీ, అంబానీ, భజంకా, భంగర్, సింఘ్వీ, మిట్టల్‌ వంటి పారిశ్రామిక దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు పోటీలు పడుతున్నాయి. ఐదేళ్లలో రూ.3,02,085 కోట్ల పెట్టుబడులు కార్యరూపం దాల్చాయి. టీడీపీ సర్కార్‌ హయాంలో కేవలం రూ.59,970 కోట్ల పెట్టుబడులే రావడం గమనార్హం. ఎంఎస్‌ఎంఈలు, భారీ పరిశ్రమల వల్ల కొత్తగా 15.88 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. రాష్ట్రంలో పీఎఫ్‌ ఖాతాల సంఖ్య 2018–19 నాటికి 44.85 లక్షలు ఉంటే.. 2022–23 నాటికి 60.73 లక్షలకు పెరగడమే అందుకు నిదర్శనం. ⇒ రాష్ట్రానికి 974 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా పారిశ్రామికాభివృద్ధి వేగవంతం చేయడం కోసం సీఎం జగన్‌ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. కొత్తగా నాలుగు పోర్టులు (మూలపేట, కాకినాడ గేట్‌వే, మచిలీపట్నం, రామాయపట్నం), పది ఫిషింగ్‌ హార్బర్లు, ఆరు ఫిష్‌ ల్యాండ్‌ సెంటర్లను నిరి్మస్తున్నారు. మూడు పారిశ్రామిక కారిడార్లు (వైజాగ్‌–చెన్నై, చైన్నై–బెంగళూరు, హైదరాబాద్‌–బెంగళూరు), పది ఇండస్ట్రియల్‌ నోడ్స్‌ను నిర్మిస్తున్నారు. అప్పుడే రామాయపట్నం పోర్టు పరిసర ప్రాంతాల్లో ఇండోసోల్‌ పరిశ్రమల ఉత్పత్తులను ప్రారంభించడం గమనార్హం. సేవా రంగం ⇒ హైదరాబాద్, బెంగుళూరు వంటి మెట్రోపాలిటన్‌ నగరాలతో పోటీ పడే నగరం రాష్ట్రంలో లేకపోయినా ఇన్ఫోసిస్, రాండ్‌స్టాడ్, అదానీ డేటా సెంటర్, బీఈఎల్, అమెజాన్‌ వంటి ఐటీ పరిశ్రమలను సీఎం జగన్‌ రాష్ట్రానికి రప్పించారు. ఐటీ పరిశ్రమల వల్ల 59 నెలల్లో రాష్ట్రంలో 47,908 మందికి ఉద్యోగాలు వచ్చాయి. విశాఖపట్నంలో రూ.పది వేల కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పిస్తే హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రోపాలిటన్‌ నగరాలతో పోటీ పడే స్థాయికి చేరుకుంటుంది. అప్పుడు భారీ ఎత్తున విశాఖపట్నంకు ఐటీ పరిశ్రమలతోపాటు అంతర్జాతీయ ప్రతిష్టాత్మక హోటల్స్‌ వంటివి వస్తాయి. తద్వారా సేవా రంగం ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఇది దోహదం చేస్తుంది. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఏలేరు భూ కుంభకోణం నుంచి ఐఎంజీ భారత్‌ కుంభకోణం వరకు అనేక స్కాంలకు పాల్పడ్డారు. వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం చంద్రబాబును ఎల్లో మీడియా విజనరీగా చిత్రీకరిస్తూ వచ్చింది. దాన్ని అందిపుచ్చుకున్న చంద్రబాబు విభజన తర్వాత తానో విజనరీ అంటూ ఊదరగొడుతూ వస్తున్నారు. రామోజీరావుకు చెందిన ఈటీవీకి ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో తానో విజనరీనని సెల్ఫ్‌ సర్టిఫికెట్‌ ఇచ్చుకున్నారు. అమరావతిలో ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించేందుకు సెంట్రల్‌ కూలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించానని చంద్రబాబు చెప్పడంతో మీడియా ప్రతినిధి నిర్ఘాంతపోయారు. విద్యా రంగం 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పలుమార్లు వివిధ వేదికలపై మాట్లాడుతూ విద్య అన్నది ప్రభుత్వ బాధ్యత కాదని ప్రకటించారు. నారాయణ వంటి ప్రైవేటు విద్యా సంస్థలు అడ్డగోలు ఫీజులతో దోచుకోవడం.. పంచుకోవడమే చంద్రబాబు విజన్‌. ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం జగన్‌ ఇంగ్లిష్‌ మీడియం బోధనను ప్రవేశపెడితే.. తెలుగు మీడియంలోనే బోధన సాగాలని అడ్డుకునే దుస్సాహసం చేసిన విజనరీ చంద్రబాబు. ఫీజు ఎంతైనా కేవలం రూ.35 వేల రీయింబర్స్‌ మాత్రమే చేస్తామంటూ చంద్రబాబు షరతులు విధించడంతో.. వేలాది మంది విద్యార్థులు మిగతా ఫీజు చెల్లించలేక ఉన్నత చదువులు మానేశారు. వైద్య రంగం మౌలిక సదుపాయాలు కల్పించకుండా.. ఖాళీలను భర్తీ చేయకుండా ప్రభుత్వ ఆస్పత్రులను చంద్రబాబు భ్రష్టు పట్టించారు. ఆరోగ్యశ్రీని నీరుగార్చారు. బిల్లులు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు చేసేందుకు ప్రైవేటు ఆస్పత్రులు నిరాకరించడంతో పేదలు తల్లడిల్లిపోయారు. వైద్యం కోసం లక్షలకు లక్షలు అప్పులు చేసిన లక్షలాది కుటుంబాలు అప్పుల పాలై రోడ్డున పడేలా చేసిన విజనరీ చంద్రబాబు. పారిశ్రామిక రంగం రాష్ట్రంలో 2014–19 మధ్య చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా తీరం మన బలం.. 974 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతాన్ని ఉపయోగించుకుని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానంటూ బీరాలు పలికారు. కానీ.. ఐదేళ్లలో కనీసం ఒక్క పోర్టు కడతామనిగానీ.. ఒక ఫిషింగ్‌ హార్బరైనా నిర్మిద్దామనిగానీ ఆలోచన చేయని విజనరీ చంద్రబాబు. సేవా రంగం దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలకు తెరతీశారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఆ సమయంలోనే అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నేదరుమల్లి జనార్ధనరెడ్డి హైటెక్‌ సిటీకి శంకుస్థాపన చేశారు. కానీ.. హైటెక్‌ సిటీని తానే నిర్మించినట్లు చంద్రబాబు ఇప్పటికీ అబద్ధాలు వల్లె వేస్తుంటారు. హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దినట్లు బీరాలు పలుకుతుంటారు. కానీ.. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు అధికారం కోల్పోయే నాటికి 2003–04 నాటికి ఐటీ ఎగుమతుల విలువ కేవలం రూ.5,025 కోట్లు మాత్రమే. కానీ.. మహానేత వైఎస్సార్‌ అధికారం చేపట్టిన తర్వాత ఐటీ ఎగుమతులు ఏటా సుమారు రెట్టింపు వృద్ధిని నమోదు చేస్తూ 2009–10 నాటికి రూ.33,482 కోట్లకు చేరాయి. అంటే వైఎస్సార్‌ హయాంలో ఐటీ ఎగుమతులు 566 శాతం పెరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో 900 ఐటీ కంపెనీలు వస్తే.. వైఎస్సార్‌ ఐదేళ్ల పాలనలో ఏకంగా 1,400కు పైగా కంపెనీలు రావడం గమనార్హం. చంద్రబాబు హయాంలో ఐటీ రంగం ద్వారా 85,000 మందికి ఉపాధి లభిస్తే.. వైఎస్సార్‌ హయాంలో 2,85,000 దాటింది. విభజన తర్వాత రాష్ట్రంలో 2014–19 మధ్య ఐటీ పరిశ్రమల వల్ల వచ్చిన ఉద్యోగాల సంఖ్య కేవలం 27,643 మాత్రమే. విశ్వసనీయత సీఎం జగన్‌ ⇒ ‘రాజకీయ నాయకుడు విశ్వసనీయత కోల్పోతే.. రాజకీయాలలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం లేకపోతే రాజకీయాలు ఎందుకు చేయడం? ఎవరి కోసం? దేనికోసం?’ అంటారు సీఎం జగన్‌. చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి ఇంట్లో తన ఫొటో.. ప్రతి పేదవాడి గుండెల్లో తాను బతికి ఉండాలన్నదే సీఎం జగన్‌ సిద్ధాంతం. అమలు చేయగలిగిన హామీలు మాత్రమే ఇవ్వడం.. ఇచ్చిన మాటకు కట్టుబడటం సీఎం జగన్‌ నైజం. ⇒ విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు ప్రకటించిన సందర్భంలో.. వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేయోభిలాషులు పలువురు రూ.50 వేల వరకు రుణ మాఫీ ప్రకటించాలని వైఎస్‌ జగన్‌పై ఒత్తిడి తెచ్చారు. ఆచరణ సాధ్యం కాని హామీని తాను ఇవ్వలేనని అప్పట్లో వైఎస్‌ జగన్‌ తేల్చి చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన అలవికాని హామీల వల్ల కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో వైఎస్‌ జగన్‌ అప్పట్లో అధికారంలోకి రాలేకపోయారు. ⇒ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశారు. ఇది సీఎం జగన్‌ చెప్పాడంటే చేస్తాడంతే అన్న నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుపోవడానికి దారితీసింది. ప్రస్తుత ఎన్నికల్లో కూడా అమలు చేయదగిన హామీలతోనే ఎన్నికల మేనిఫెస్టోను సీఎం జగన్‌ విడుదల చేశారు. చంద్రబాబు ⇒ మోసమే ఆస్తిగా.. వెన్నుపోటే పెట్టుబడిగా రాజకీయాల్లో ఎదిగిన నేత చంద్రబాబు. ఎన్నికలప్పుడు అలవికాని హామీలు ఇవ్వడం.. అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కి ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజం. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాక 1999 ఎన్నికల్లో కోటి మందికి ఉపాధి, 35 లక్షల ఇళ్లు నిరి్మస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. వాజ్‌పేయిపై వీచిన సానుభూతి పవనాల్లో అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. ⇒ విభజన నేపథ్యంలో చంద్రబాబు 2014 ఎన్నికల్లో వ్యవసాయ రుణాలు మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి వంటి 650 హామీలు ఇచ్చారు. మోదీ ప్రభంజనంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిన ఘనత ఈ పెద్దమనిíÙదే. చెప్పిన మాటకు కట్టుబడి ఉండకపోవడం చంద్రబాబు నైజం. చంద్రబాబు అంటే మోసం చేస్తాడనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. నైతిక విలువలు సీఎం జగన్‌: నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేయాలన్నది సీఎం జగన్‌ విధానం. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణించాక.. ఆ మరణవార్త విని గుండెలు పగిలి మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని వైఎస్‌ జగన్‌ అప్పట్లో మాట ఇచ్చారు. ఓదార్పు యాత్ర చేపట్టడానికి కాంగ్రెస్‌ నిరాకరించడంతో ప్రజలకు ఇచ్చిన మాట కోసం, మహానేత వైఎస్‌ ఆశయ సాధన కోసం కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్‌సీపీని స్థాపించారు. వైఎస్సార్‌సీపీలో చేరాలంటే.. ఎవరైనా ఆ పార్టీ నుంచి సంక్రమించిన ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రాజీనామాలు చేయాలని షరతు విధించారు. అదే విధానానికి కట్టుబడ్డారు. చంద్రబాబు: ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిందే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి. ఓటుకు నోటును అలవాటు చేసి రాజకీయాలను ఫక్తు వ్యాపారం చేసిన ఘనత చంద్రబాబుదే. దేశంలో తొలి సారిగా 1996 లోక్‌సభ ఎన్నికల్లో ఓటుకు నోటును ఎరగా వేసి.. ఆ తర్వాత అలవాటు చేసిన చరిత్ర బాబుది. విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చి.. వైఎస్సార్‌సీపీని దెబ్బ తీసేందుకు 23 మంది ఎమ్మె ల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేయడమే కాకుండా, ఏకంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం కల్పించి రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు కేసులో కోట్ల కట్టలు, ఆడియో వీడియో టేపులతో తెలంగాణ ప్రభుత్వానికి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ చంద్రబాబు.. ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి రాత్రికి రాత్రే హైదరాబాద్‌ నుంచి పారిపోయివచ్చి ఉండవల్లిలోని కృష్ణా నది కరకట్టపై ఉన్న అక్రమ కట్టడంలో తల దాచుకున్నారు. అంతెందుకు ఆర్నె ల్ల క్రితం శాసనసభ్యుల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓటుకు కోట్లను ఎరవేశారు. నిబద్ధత.. సీఎం జగన్‌ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన (ఏవోబీ) వై.రామవరం మండలం చాపరాయిలో 2017 జూన్‌ 30న విష జ్వరాలు ప్రబలి 17 మంది గిరిజనులు మృత్యువాత పడ్డారు. కానీ.. ప్రభుత్వం పట్టించుకోలేదు. అప్పటి ప్రతిపక్ష నేత అయిన వైఎస్‌ జగన్‌ 2017 జూలై 1న పోలీసులు వారిస్తున్నా వినకుండా అటవీ ప్రాంతంలో సముద్ర మట్టానికి 1750 మీటర్ల ఎత్తులో ఉన్న చాపరాయికి వెళ్లారు. విష జ్వరాలు ప్రబలి 17 మంది గిరిజనులు కన్ను మూయడానికి దారితీసిన పరిస్థితులను వెలుగులోకి తెచ్చారు. తాను అధికారంలోకి వస్తే.. గిరిజన ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలను మెరుగు పరుస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరచడంతోపాటు ఖాళీలను భర్తీ చేశారు. స్పెషలిస్టు డాక్టర్లను నియమించారు. గిరిజన ప్రాంతాల్లో ఐదు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, ఒక మెడికల్‌ కాలేజ్‌ని నిరి్మస్తున్నారు. సీఎం జగన్‌ నిబద్ధతకు ఇదో తార్కాణం మాత్రమే. చంద్రబాబు గోదావరి పుష్కరాల ప్రారంపోత్సవం రోజున అంటే 2015 జూలై 14న రాజమహేంద్రవరంలో అప్పటి సీఎం చంద్రబాబు ప్రచార పిచ్చితో స్నానాలు చేసేందుకు ఒకేసారి భక్తులను వదలడంతో తొక్కిసలాట జరిగి 29 మంది దుర్మరణం పాలయ్యారు. కనీసం ఈ దుర్ఘటనపై చంద్రబాబు పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదు. మీ ప్రచార పిచ్చితో 29 మందిని బలిగొన్నారు కదా.. అని చంద్రబాబును మీడియా ప్రశి్నస్తే.. కుంభమేళాలో చచ్చిపోవడం లేదా.. గోదావరి పుష్కరాల్లోనే చచ్చిపోయారా? గోరంతలు కొండంతలు చేస్తారా? అంటూ రంకెలేయడం విస్మయానికి గురిచేసింది. ప్రచారపిచ్చితో 2022 డిసెంబర్‌ 29న కందుకూరులో ఇరుకుసందులో చంద్రబాబు సభ నిర్వహించడం వల్ల తొక్కిసలాటలో 9 మంది మరణించారు. అయినా సరే ఆ సభను నిర్వహించడం ద్వారా ప్రజల పట్ల తనకు ఎంత నిబద్ధత ఉందో చంద్రబాబు చాటి చెప్పుకున్నారు. సంస్కర్త (రిఫార్మర్‌) సీఎం జగన్‌విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన సీఎం జగన్‌.. పాలనలోనూ విప్లవాత్మక మార్పులు తెచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ.. జిల్లాలను పునర్‌ వ్యవస్థీకరించడం ద్వారా ప్రజల ఇంటి ముంగిటకే ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (నగదు బదిలీ) రూపంలో పేదల ఖాతాల్లో నేరుగా అత్యంత పారదర్శకంగా రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. మరో అడుగు ముందుకేసి వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీన వృద్ధులకు పెన్షన్‌ పంపిణీ చేస్తున్నారు. పాలనా సంస్కరణల ద్వారా సీఎం జగన్‌ ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ స్వరాజ్యాన్ని ఆవిష్కరించారని నీతి ఆయోగ్‌ ప్రశంసించింది. ఇంజనీరింగ్‌ పనుల్లో రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టి.. చంద్రబాబు నిర్జీవంగా మార్చిన టెండర్ల వ్యవస్థకు జవసత్వాలు చేకూర్చి, ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.7,500 కోట్లు ఆదా చేశారు. చంద్రబాబు సంస్కరణ అంటే చంద్రబాబు దృష్టిలో ప్రభుత్వ రంగ సంస్థలను మూసేయడం.. ఉద్యోగులను రోడ్డున పడేయడం.. వాటిని అత్తెసరు ధరకే బినామీలకు కట్టబెట్టడం. ఉమ్మడి రాష్ట్రంలో 1999–2004 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో నిజాం షుగర్స్, ఆల్విన్, హెచ్‌ఎంటీ వంటి 54 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసి.. వేలాది మంది ఉద్యోగులను రోడ్డున పడేశారు. వాటి ఆస్తులను అస్మదీయులకు కట్టబెట్టి దోచుకున్నారు. 2014–19 మధ్య టెండర్ల వ్యవస్థను నీరుగార్చి.. అస్మదీయ కాంట్రాక్టర్లకు సగటున 4.85 శాతం అధిక ధరలకు కట్టబెట్టి ప్రభుత్వ ఖజానాకు రూ.20 వేల కోట్లకుపైగా నష్టం చేసిన చంద్రబాబు.. వాటిని కాంట్రాక్టర్లతో కలిసి దోచుకున్నారు. రూ.16 వేల కోట్లకుపైగా విలువైన పనులను నామినేషన్‌ పద్ధతిలో అస్మదీయులకు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకున్నారు. సామాజిక సాధికారత సీఎం జగన్‌సామాజిక న్యాయం చేయడంలో సీఎం జగన్‌ దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచారు. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలు అంటూ అక్కున చేర్చుకునే సీఎం జగన్‌.. మంత్రివర్గంలో ఏకంగా 17 పదవులు (70 శాతం) ఆ వర్గాలకే ఇచ్చారు. ఐదు డిప్యూటీ సీఎం పదవులు ఉంటే.. నాలుగు పదవులు ఆ వర్గాల వారికే ఇచ్చారు. శాసనసభ స్పీకర్‌గా బీసీ.. శాసనమండలి చైర్మన్‌గా ఎస్సీ, డిప్యూటీ చైర్‌ పర్సన్‌గా మైనార్టీ మహిళకు అకాశం ఇచ్చారు. రాజ్యసభ, శాసన మండలి సభ్యులుగా సింహ భాగం ఆ వర్గాలకే అవకాశం ఇచ్చారు. స్థానిక సంస్థల్లో అధిక శాతం పదవులు వారికే ఇచ్చారు. దేశ చరిత్రలో తొలి సారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలు, మహిళలకు నామినేషన్‌ పనుల్లో, పదవుల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం చేసి మరీ ఆ వర్గాలకు పట్టం కట్టారు. డీబీటీ, నాన్‌ డీబీటీ పథకాల ద్వారా రూ.4.49 లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చితే.. అందులో అధిక భాగం వాటా ఆ వర్గాలకే దక్కింది. రాజకీయ, ఆర్థిక సాధికారతతో ఆ వర్గాలు సామాజిక సాధికారత సాధించాయి. సార్వత్రిక ఎన్నికల్లో సీఎం జగన్‌ మరో అడుగు ముందుకేసి, 175 శాసనసభ, 25 లోక్‌సభ వెరసి 200 స్థానాల్లో వంద స్థానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారినే బరిలోకి దించారు. చంద్రబాబు ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా.. అంటూ ఎస్సీలను.. తోకలు కత్తరిస్తా, తాటతీస్తా, జడ్జీలుగా పనికి రారంటూ బీసీలను.. దేశ ద్రోహం కేసులు బనాయించి ముస్లింలను.. కోడలు మగపిల్లాన్ని కంటానంటే అత్త వద్దంటుందా అంటూ మహిళలను అపహాస్యం చేసిన చంద్రబాబు సామాజిక అన్యాయానికి పాల్పడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రివర్గంలో ఆ వర్గాలకు సముచిత స్థానం కల్పించిన చంద్రబాబు.. ఒక్కరినంటే ఒక్క బీసీనిగానీ, ఎస్సీనిగానీ, ఎస్టీనిగానీ, మైనారీ్టనిగానీ రాజ్యసభకు పంపలేదు. చివరకు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆ వర్గాలకే టికెట్ల కేటాయింపుల్లో అన్యాయం చేసి సామాజిక విద్రోహానికి పాల్పడ్డారు. ఆర్థికవేత్త సీఎం జగన్‌సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చే నాటికి అంటే 2019 మే 30కి ప్రభుత్వ ఖజానాలో రూ.వంద కోట్లు మాత్రమే మిగిలాయి. చంద్రబాబు దోపిడీతో గాడితప్పిన ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టిన సీఎం వైఎస్‌ జగన్‌.. సంక్షేమ, అభివృద్ధి పథకాలను పరుగులు పెట్టించారు. పేదల ఖాతాల్లో సంక్షేమ పథకాల ద్వారా రూ.2.70 లక్షల కోట్లను జమ చేశారు. వాటిని సద్వినియోగం చేసుకున్న పేదలు జీవనోపాధిని మెరుగుపరుచు కోవడంతో పేదరికం తగ్గింది. రాష్ట్రంలో పేదరికం చంద్రబాబు హయాంలో 11.77 శాతం ఉంటే.. ఇప్పుడు 4.19 శాతానికి తగ్గింది. రాష్ట్ర తలసరి ఆదాయం చంద్రబాబు హయాంలో 2018–19లో రూ.1,51,173 ఉంటే.. సీఎం జగన్‌ హయాంలో 2022–23 నాటికి రూ.2,19,518కి పెరిగింది. కేంద్రం జీడీపీలో రాష్ట వాటా చంద్రబాబు హయాంలో ఐదేళ్లూ సగటున 4.47 శాతం ఉంటే.. సీఎం జగన్‌ హయాంలో 4.82 శాతానికి పెరిగింది. చంద్రబాబు హయాంలో అప్పుల కాంపౌండెడ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌ 21.87 శాతం ఉంటే.. ఇప్పుడు 12.13 శాతానికి తగ్గింది. సంపద సృష్టించిందీ సీఎం జగనే. చంద్రబాబు హయాం (2014–19)లో మూల ధన వ్యయం ఏటా సగటున రూ.15,227 కోట్లు ఖర్చు చేస్తే.. సీఎం జగన్‌ గత ఐదేళ్లు ఏటా సగటున రూ.17,757 కోట్లు ఖర్చు చేశారు. కోవిడ్‌ ఆర్థిక సంక్షోభంలో ప్రజల ఖాతాలకు నగుదు జమ చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజలు ఆకలితో అలమటించకుండా ఆదుకున్నారు. చంద్రబాబు ఆర్థిక శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చదివానని, తానో ఆర్థికవేత్తనని, సంపద సృష్టించానని చంద్రబాబు బీరాలు పలుకుతారు. ఇందులో చదువొక్కటే నిజం.. మిగతావన్నీ అసత్యాలే. ఎడాపెడా అధిక వడ్డీలకు రుణాలు చేయడం.. వాటిని అస్మదీయులతో కలిసి దోచుకోవడం, పంచుకోవడం.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడమే చంద్రబాబు ఆర్థిక విధానం. పరిపాలన దక్షత సీఎం జగన్‌విభజిత రాష్ట్రాన్ని 2014–19 మధ్య చంద్రబాబు అడ్డగోలుగా దోచేసి ఛిన్నాభిన్నం చేశారు. కుంగి కుదేలైన రాష్ట్రాన్ని సీఎం జగన్‌ తన పరిపాలన దక్షతతో అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపారు. 2020 ఫిబ్రవరి నుంచి 2022 జనవరి వరకు కరోనా మహమ్మారి దాదాపు రెండేళ్లు ప్రపంచాన్ని గజగజ వణికించింది. ఈ మహమ్మారి విజృంభించినప్పుడే.. దానితో సహజీవనం చేయాల్సిందేనని.. ట్రేస్‌.. టెస్ట్‌.. ట్రీట్‌మెంట్‌ మినహా మరో మార్గం లేదని సీఎం జగన్‌ ప్రకటించారు. దీన్ని చంద్రబాబు సహా ఆయన ఎల్లో గ్యాంగ్‌ అప్పట్లో అపహాస్యం చేసింది. సీఎం జగన్‌.. వైద్యారోగ్య శాఖను సమర్థవంతంగా పని చేయించడం ద్వారా కరోనా మహమ్మారిని గట్టిగా ఎదుర్కొన్నారు. కోట్లాది మంది ప్రజల ప్రాణాలను రక్షించారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా, సంక్షేమ పథకాలు ఆపకుండా.. పేదల ఖాతాల్లో నిధులు జమ చేశారు. దాంతో కోట్లాది మంది ప్రజల జీవనోపాధికి ఇబ్బంది లేకుండాపోయింది. పరిపాలన దక్షతతో కరోనాను సీఎం జగన్‌ సమర్థవంతంగా ఎదుర్కొన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ, నీతి ఆయోగ్‌ ప్రశంసించాయి. చంద్రబాబు హుద్‌హుద్‌ తుఫాన్‌ 2014 అక్టోబర్‌ 12న విశాఖపట్నంతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాలను అతలాకుతలం చేసింది. సర్వం కోల్పోయి.. ఆకలి కేకలతో ఉత్తరాంధ్ర దద్దరిల్లింది. తుఫాన్‌ తగ్గిన వెంటనే విశాఖపట్నంకు చేరుకున్న అప్పటి సీఎం చంద్రబాబు.. ప్రచార పిచ్చితో రంపం పట్టుకుని చెట్లను తొలగిస్తున్నట్లు ఫొటోలకు ఫోజులు ఇస్తూ.. సహాయక చర్యలు చేపట్టకుండా ఆటంకం కలిగించారు. బాధితులను ఆదుకోకుండానే హుద్‌హుద్‌ తుఫాన్‌ను జయించినట్లు ప్రగల్భాలు పలికారు. ప్రతిపక్షంలోకి మారాక 2020 మార్చిలో తాను అధికారంలో ఉంటే కరోనా మహమ్మారి వచ్చేదా.. అంటూ బీరాలు పలకడంతో ప్రజలు నిర్ఘాంతపోయారు. – సాక్షి అమరావతి

Sakshi Editorial On TDP Political Alliance And Yellow Media
పౌర సమాజమా... పారాహుషార్‌!

అఖిలాంధ్ర జనులారా! అప్రమత్తంగా ఉండండి! గోముఖ వ్యాఘ్రాలు అంబారావాలు చేస్తున్నాయ్, తప్పుదోవ పట్టిస్తున్నాయ్‌. తేనె పూసిన కత్తులు కోలాటమాడు తున్నాయ్, కనికట్టు చేస్తున్నాయ్‌. జన తటాకపు గట్టు మీద మూడు కొంగలు నిలబడి దొంగజపం చేస్తున్నాయ్‌. జాగ్తే రహో!మతోన్మాదులు – కులోన్మాదులు జెండా గుడ్డలతో కొంగులు ముడేసుకొని అడుగులు వేస్తున్నారు, అప్రమత్తంగా ఉండండి.నాజీలను మించిన కులోన్మాదులు, ఫాసిస్టులను తల దన్నే మతోన్మాదులు ఉమ్మడిగా, కలివిడిగా ఉన్మత్త ప్రచారపు విషవాయువులను ప్రయోగిస్తున్నారు, తస్మాత్‌ జాగ్రత్త!విష ప్రచారపు ప్రయోగ వేదికలైన యెల్లో మీడియా కార్ఖానాల్లోంచి రోజుకు లక్ష క్యూబిక్‌ మీటర్ల పాయిజనస్‌ గ్యాస్‌ వెలువడుతున్నది. ఆ గాలి సోకితే జ్ఞానేంద్రియాలు పనిచేయవు, జరభద్రం!మన జ్ఞానేంద్రియాలు పని చేయకూడదనేదే వారి కోరిక. పని చేస్తే వారి నిజస్వరూపం మనం గుర్తిస్తామన్న భయం.ఈ మతోన్మాద, కులోన్మాద ఉమ్మడి ముఠాను నడిపించేది అంతా కలిపి పిడికెడు మందే! వారే పెత్తందార్లు. వారే పెట్టుబడిదార్లు. ముఠాలోని మిగిలిన పరివారంలో మతం అనే మత్తుమందుకు బానిసలు కొందరు. కులం అనే దురద రోగపు బాధితులు కొందరు.ఈ బానిసల్నీ, బాధితుల్నీ వెంటేసుకొని పెత్తందారీ కాలకూట విషకూటమి దండయాత్రకు బయల్దేరింది. ప్రపంచ యుద్ధాల్లో కూడా కొన్ని రకాల కెమికల్‌ వెపన్స్‌ వాడకంపై నిషేధాలుంటాయి. కానీ రోగ్‌ కంట్రీస్‌ ఖాతరు చేయవు. మన హెజెమోనిక్‌ రోగ్స్‌ కూడా అంతే! ప్రచారపు విధి నిషేధాలను ఖాతరు చేయరు, చేయట్లేదు.మన పెత్తందారీ కూటమి యుద్ధానికి తెగబడింది ఎవరి మీద? ఎవరిని తెగటార్చడానికి భగభగమండే పగతో సెగలుగక్కుతున్నారు?ఇంకెవరి మీద? పేదసాదల మీద, వారి సాధికారతా స్వప్నాల మీద! బడుగు బలహీన వర్గాల మీద, వారి జీవన వికాసపు ఆకాంక్షల మీద! కోట్ల జతల కనురెప్పల మాటు నున్న కలల మీద ఒకేసారి దాడి చేయడం ఎట్లా?వారికి ఆలంబనగా నిలబడిన వెన్నెముకను విరి చేయాలి. ఆ వెన్ను ఎముకే... వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.ఇంకెందుకు ఆలస్యం. బొంబార్డ్‌ ది హెడ్‌ క్వార్టర్స్‌. ప్రజల పక్షాన నిలబడిన ప్రభుత్వాన్ని కూలదోస్తే సరిపోతుంది. ఈ ఎన్నికల్లో కూల్చివేయాలి. పెత్తందారీ కూటమి తలపోత ఇది.తలపోసినంత మాత్రాన కుదురుతుందా? కోట్లాది మంది జీవితాలను క్రాంతి మార్గానికి మళ్లిస్తున్న సర్కార్‌కు వారు అండగా నిలబడరా? అశేష జనావళి మద్దతున్న జగన్‌ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఎలా ఓడించగలరు?బలరామదేవుడి ముక్కోపానికి విరుగుడు మంత్రం ఉండనే ఉన్నది కదా ముఖస్తుతి అంటాడు ‘మాయాబజార్‌’ శకుని మామ. ఆ లెక్కన ప్రజాభిమానానికీ విరుగుడు ఉంటుంది కదా! ప్రజల్లో అపోహలు సృష్టించడం, అను మాన బీజాలు నాటడం! అసత్య ప్రచారంతో చీలికలు తేవడం వగైరా. కూటమిలోని శకుని మామలు పాచికలు విసరడంలో ఆశ్చర్యమేమున్నది?ప్రజలను ఆకట్టుకోగల నినాదం ఈ కూటమికి ఒక్కటి కూడా లేదు. ప్రజలకు మేలు చేసే విధానమూ లేదు. అరువు తెచ్చుకున్న అతుకుల బొంత మేనిఫెస్టో మాత్రం ఉన్నది. అందులోని అంశాలు అరచేతిలో వైకుంఠాన్ని చూపే టక్కు టమారం బాపతు. ఈ గారడీ సంగతి ముందే తెలిసిన జనం దాన్ని బొత్తిగా పట్టించుకోలేదు. క్రెడిబిలిటీ టెస్ట్‌లో కూటమి మేనిఫెస్టో డకౌటయింది.కూటమి నేతలు కూడా మేనిఫెస్టోను నమ్ముకోలేదు. యెల్లో మీడియా నేతృత్వంలో వెలువడే విషవాయు ప్రచా రాన్నే ఆయుధంగా ఎక్కుపెట్టారు. జగన్‌ పరిపాలనలో రాష్ట్రం సర్వనాశనమైపోయిందంటారు. ఎలా అని అడగ కూడదు. తర్కానికి తావులేదు. సర్వనాశనం అనే మాటను అష్టోత్తర శతనామంలా ప్రతివాడూ నూటా ఎనిమిది సార్లు జపించాలి. అంతే!జగన్‌ హయాంలో అభివృద్ధి శూన్యమంటారు. దాని పైనా చర్చ ఉండదు. ఆధారాలుండవు. గణాంకాల జోలికి వెళ్లొద్దు. ఫీల్డ్‌ విజిట్‌ చేయొద్దు. రోజూ ఓపికున్నంత సేపు రామకోటి రాసుకున్నట్టుగా ‘అభివృద్ధి లేదు’ అనే మాటను రాసుకోవాలి. పంచాక్షరి మంత్రంలా పవిత్రంగా ఉచ్ఛరించి నెత్తిన నీళ్లు చల్లుకోవాలి.సర్వనాశనం, అభివృద్ధి శూన్యం అనే రెండు మాటల్ని మన యెల్లో మీడియా, టీడీపీ నేతలు నమలడం మొదలు పెట్టి ఇప్పటికి నాలుగేళ్లు దాటింది. నమలడం, నెమరు వేయడం అనే కార్యక్రమం అప్పటి నుంచి నిరాటంకంగా సాగుతూనే ఉన్నది. చూసేవాళ్లకు రోత పుట్టినా వాళ్లు మాత్రం ఈ పాచిపాటను ఆపలేదు.ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచీ మరీ ఘోరం. ఆ పత్రికలు చదవాలన్నా, ఆ ఛానెళ్లు చూడాలన్నా అల్ప ప్రాణులకు జడుపు జ్వరం వచ్చే పరిస్థితిలోకి తీసుకెళ్లారు. అభూతకల్పనలు, అభాండాలు, బట్టకాల్చి మీద వేయడం నిత్యకృత్యంగా మారింది.‘ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌’ అనే నల్ల చట్టాన్ని జగన్‌ మోహన్‌రెడ్డి తీసుకొచ్చారట. దాని ఆధారంతో ఆయన అర్ధరాత్రి వేళల్లో గ్రామాలకు కన్నంవేసి కంటికి నచ్చిన భూమినల్లా తవ్వుకొని, మూట కట్టుకొని వెళ్లిపోతారట! ఇదీ వీళ్లు ప్రచారం చేస్తున్న వార్త సారాంశం.మనిషి జన్మ ఎత్తిన వాడికి కొన్ని లక్షణాలు తప్పని సరిగా ఉంటాయని ఆశిస్తాము. సిగ్గూ–లజ్జ, మానము– మర్యాద, అభిమానం – గౌరవం వంటివి వాటిలో మచ్చుకు కొన్ని! యెల్లో మీడియా, దేశం కూటమి ఈ తరహా లక్షణా లను పూర్తిగా విసర్జించాయి. విలువల్నీ, వలువల్నీ విప్పేసి అవతలపారేశారు. దిగంబర వీరంగాలతో జుగుప్సాకరంగా తయారయ్యారు. నడివీధుల్లో నగ్నంగా నర్తిస్తున్నారు.ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అనేది భూయజమానులకు మేలు చేస్తుందనీ, ఇంతకాలం ఈ చట్టాన్ని తేకపోవడమే పొరపాటనీ ఈ దేశంలోని బుద్ధిజీవులందరూ అభిప్రాయ పడుతున్నారు. ప్రపంచంలో సగానికి పైగా దేశాల్లో ఇప్పటికే ఈ చట్టం అమల్లో ఉన్నది.ఏపీ శాసనసభలో తెలుగుదేశం పార్టీ ఈ చట్టానికి మద్దతు ప్రకటించింది. ఇప్పటికింకా మూడో వంతు గ్రామా ల్లోనే భూసర్వే పూర్తయింది. అన్ని గ్రామాల్లో సర్వే పూర్త యితే తప్ప మరో రెండేళ్లకు గానీ ఈ చట్టం అమల్లోకి రాదు.చట్టం లక్ష్యమే యజమానికి భూమిపై సర్వహక్కులు కల్పించడం. ఆ హక్కులకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం. అందుకు గుర్తుగానే సర్వే పూర్తయిన చోట ఇచ్చే పాస్‌ పుస్తకాలపై సీఎం బొమ్మను ముద్రిస్తున్నారు. అది ఆ యజ మాని హక్కుకు ప్రభుత్వ గ్యారంటీ. దాని మీద జరిగిన వక్రప్రచారం, చంద్రబాబు నోటి వెంట వచ్చిన బూతులు కూటమి దివాళాకోరుతనానికి రుజువు.అవ్వాతాతల పెన్షన్ల పంపిణీ విషయంలో కూటమి – యెల్లో మీడియా ఎంత అమానవీయంగా ప్రవర్తించాయో రాష్ట్ర ప్రజలు గమనించారు. వలంటీర్ల విషయంలో ఎన్ని పిల్లిమొగ్గలు వేశాయో గమనించారు.ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, ఇన్‌పుట్‌ సబ్సిడీ లబ్ధిదారులకు దక్కకుండా ఈసీపై నెరిపిన ఒత్తిడి రాజ కీయం కూటమి వారి దింపుడు కళ్లెం ఆశల దిగజారుడు తనాన్ని ఎత్తిచూపింది.ఇసుక సరఫరాపై విషం చిమ్ముతూ గత నాలుగేళ్లుగా చందమామ కథలు నెలనెలా ప్రచారం చేయడాన్ని ఎలా మర్చిపోగలం?మద్యం వ్యాపారుల మాఫియా కోసం మద్య నియంత్రణపై వెళ్లగక్కిన అక్కసు గుర్తు చేసుకోండి. తను అధికా రంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని చంద్రబాబు అంది స్తారట. ప్రాణాలకు హానికరమైన లిక్కర్‌కు నాణ్యతా ప్రమాణాలేమిటి?విచ్చలవిడి లాభాల కోసం వ్యాపారులు వేలాది బెల్ట్‌ షాపులు కూడా నడిపి మద్యాన్ని డోర్‌ డెలివరీ చేసినప్పుడు ప్రజల ఆరోగ్యం అద్భుతంగా ఉందట. మద్యాన్ని అందు బాటులో లేకుండా చేసి, బెల్టుషాపులు ఎత్తివేసి నియంత్రిత వేళల్లో మాత్రమే, లాభాపేక్ష లేని ప్రభుత్వ షాపుల్లోనే అమ్ముతుంటే మాత్రం కాలేయాలు, కిడ్నీలు పాడైపోతు న్నాయనే కాకమ్మ కథలను ప్రచారంలో పెట్టిన వైనాన్ని గమనించండి.పరిశ్రమల విషయంలోనూ ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేశారు. గ్రామ స్వరాజ్యాన్ని ఆచరణా త్మకం చేస్తే సహించలేకపోయారు. ఏ వివక్ష లేకుండా, పుట్టిన ప్రతిబిడ్డకూ నాణ్యమైన విద్యను ప్రాథమిక హక్కుగా మార్చితే పెత్తందారీ కూటమి భరించలేకపోతున్నది. ప్రభు త్వంపై యుద్ధం ప్రకటించింది.పేద వర్గాల ప్రజలు, మహిళలు నిటారుగా నిలబడ టానికి సాధికారతను సంతరించుకోవడానికి ఉపయోగపడే ఒక విప్లవకర ఎజెండాను జగన్‌ ప్రభుత్వం అమలుచేసింది. ఈ ఎజెండా కొనసాగవలసిన అవసరం పేదవర్గాలు, బలహీనవర్గాల ప్రజలకున్నది.ఈ ఎజెండా కొనసాగితే పెత్తందార్లకు ఆకలి తీరదు. అందుకే కట్టుకథలతో ముందుకు వస్తున్నారు. పేదవర్గాల ప్రజలను ఏమార్చాలని చూస్తున్నారు. మభ్యపెట్టాలని చూస్తున్నారు. మరోసారి దారుణంగా మోసం చేయాలని కపట నాటకమాడుతున్నారు.వారు ప్రజలకు మిత్రులు కారు... శత్రువులు. మాన వీయ విలువలు లేశమాత్రం లేనివారు. పేద బిడ్డలు మంచి చదువులు చదివితే ఓర్చుకోలేరు.మిత్రులారా! ఏదైనా జరగరాని పొరపాటు జరిగి కూటమి గెలిస్తే సర్కారు బడులు మళ్లీ పాడుబడిపోతాయి. పేద బిడ్డలకు ఇంగ్లిష్‌ మీడియం రద్దవుతుంది. విద్య ప్రైవేట్‌ పరమవుతుంది.ఈ లక్ష్యం కోసమే కార్పొరేట్‌ విద్యా సంస్థల యజమా నులు కూటమి గెలుపు కోసం వేలకోట్లు ఖర్చు చేస్తున్నారు. అర్థం చేసుకోండి.ప్రభుత్వ వైద్యరంగం నిర్వీర్యమవుతుంది. ‘ఫ్యామిలీ డాక్టర్‌’ అదృశ్యమవుతాడు. కార్పొరేట్‌ మాఫియా వైద్యరంగాన్ని మళ్లీ ఆక్రమించుకుంటుంది. ‘రైతు భరోసా’ ఎగిరి పోతుంది. ఆర్‌బీకే సెంటర్లు అదృశ్యమవుతాయి.అధికార వికేంద్రీకరణకు అద్దం పట్టిన గ్రామ సచివాల యాలు మాయమవుతాయి. వలంటీర్‌ వ్యవస్థను ఎత్తి వేస్తారు. ఎందుకంటే అధికార వికేంద్రీకరణ అనేది పేద వర్గాలను బలోపేతం చేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుంది. ఈ పరిణామం పెత్తందారీ వర్గాలకు గిట్టదు.అందుకే ఈ కూటమి పలుమార్లు వికేంద్రీకరణపై అవాకులు చెవాకులు పేలిన విషయం మరిచిపోరాదు.సమస్త వనరుల మీద తమ పెత్తనం కోసం పెత్తందార్లు పరితపిస్తారు. అందుకోసం నిరంతరం వేటాడుతూనే ఉంటారు. బలహీనవర్గాలకు అధికారంలో వాటా పెరిగితే ఈ వేటగాళ్ల ఆటలు సాగవు.అందుకే జగన్‌ ప్రభుత్వ విధానాలపై పెత్తందార్లు యుద్ధం ప్రకటించారు. వారి మాయ నాటకాలకు లొంగి పోతే పేదవర్గాల విజయ ప్రస్థానం ఆగిపోతుంది. సామా జిక విప్లవానికి ఎదురుదెబ్బ తగులుతుంది. పేద ప్రజల విచక్షణ మీద, ఆలోచనాశక్తి మీద పెత్తందార్లకు చిన్నచూపు. అందుకే మిమ్మల్ని ప్రలోభపెట్టాలని చూస్తున్నారు. మిత్రులారా! మీ చైతన్య స్థాయిని చాటిచెప్పండి. విప్లవకర ఎజెండాను జెండాగా ఎగరేయండి! వర్దెల్లిమురళి

BRS Leader KCR About His National Politics
ప్రధాని రేసులో ఉంటా!: కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: దేశ ప్రధానిగా పనిచేసే అవకాశం వస్తే వంద శాతం రేసులో ఉంటానని.. అవకాశం వస్తే వదులుకునేంత అమాయకుడిని కాదని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ జాతీయ రాజకీయాలను కొనసాగిస్తామని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత అందరినీ సంప్రదించి.. తనకున్న రాజకీయ సంబంధాలు, శక్తి, తెలివిని రంగరించి ప్రాంతీయ కూటమి కోసం ప్రయత్నాలు చేస్తానని చెప్పారు. ఏదో ఒక జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీల కూటమికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితిని సృష్టిస్తామన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ 12 నుంచి 14 ఎంపీ స్థానాల్లో గెలిచితీరుతుందని చెప్పారు. కాంగ్రెస్‌ 9 చోట్ల మూడో స్థానంలో ఉందని.. బీజేపీ రెండో స్థానంలో ఉన్నా బీఆర్‌ఎస్‌కు చాలా దూరంలో ఉందని పేర్కొన్నారు. 16 రోజుల పాటు నిర్వహించిన ఎన్నికల ప్రచార బస్సుయాత్ర ముగియడంతో శనివారం బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ నేత కె.కేశవరావు పార్టీని వీడటంతో ఆయన స్థానంలో రాజ్యసభ ఎంపీ కేఆర్‌.సురేశ్‌రెడ్డిని పార్లమెంటరీ పార్టీ నేతగా నియమిస్తూ రాజ్యసభ చైర్మన్‌కు లేఖ ఇస్తున్నా. జాతీయ రాజకీయాల్లో మా పార్టీ తరఫున ఆయన కీలక ప్లేయర్‌గా ఉంటారు. ఈ అక్టోబర్‌లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేయాలని అక్కడి నేతలు కోరుతున్నారు. మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి ఉంది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అక్కడా అమలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌ పేరిట పోటీచేసి గెలుస్తాం. హైదరాబాద్‌ గొంతు కోస్తే సహించరు.. కేంద్ర పాలిత ప్రాంతం పేరిట హైదరాబాద్‌ గొంతు కోస్తే తెలంగాణ ప్రజలు సహించరు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే వంటివారు కూడా దేశానికి రెండో రాజధాని కావాలని అంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ వంటి పిచ్చివాళ్లకు స్థానమిస్తే హైదరాబాద్‌ను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తారు. హైదరాబాద్‌ తెలంగాణ సొంతం.. ఎన్నటికీ వదులుకోబోం. ఓటుకు నోటు కేసులో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన రేవంత్‌ బీజేపీలో చేరతాడని కాంగ్రెస్‌ నేతలే అనుమానిస్తున్నారు. 26 నుంచి 33 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఏర్పాటుకు రెడీగా ఉన్నామని మాతో అంటున్నారు. కారు షెడ్డుకు వెళ్లిందంటున్న రేవంత్‌రెడ్డి.. మా ధాటికి రేపు ఎక్కడికి పోతాడో చూద్దాం. పనులు, పైరవీల కోసమే కొందరు కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ ప్రళయ గర్జన చూస్తారు. ఫోన్‌ ట్యాపింగ్‌తో సంబంధం లేదు.. ప్రభుత్వంలో వందల మంది అధికారులు ఉంటారు. అందులో ఒకరైన రాధాకిషన్‌రావు ఎవరు? ఫోన్‌ ట్యాపింగ్‌కు సీఎంకు ఏం సంబంధం? గూఢచార వ్యవస్థ లేని ప్రభుత్వం ఉండదు. నిఘా విభాగం నుంచి ప్రభుత్వం కేవలం సమాచారం మాత్రమే కోరుతుంది. ట్యాపింగ్‌ పూర్తిగా పోలీసు విభాగం అంతర్గత విషయం. టెలిగ్రాఫ్‌ యాక్ట్‌ ప్రకారం.. హోంశాఖ కార్యదర్శి అనుమతితోనే ట్యాపింగ్‌ జరుగుతుంది. రేవంత్‌వి చిల్లర రాజకీయాలు రైతు భరోసా, ఉద్యోగులకు 51 శాతం ఫిట్‌మెంట్, నాలుగు విడతల డీఏ విడుదల వంటివి ఉండగా రైతులకు రూ.40 వేల కోట్ల రుణమాఫీ సాధ్యం కాదు. ప్రజలను భ్రమల్లో పెట్టేందుకు రేవంత్‌ చేస్తున్న ప్రయత్నం సఫలం కాదు. మేం ఎంతో ఆలోచించి ఏర్పాటు చేసిన జిల్లాలను రద్దు చేస్తే.. ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదు. భాష విషయంలో రేవంత్‌ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. రేవంత్‌ ఓటుకు నోటు దొంగ, బ్లాక్‌ మెయిలర్, భూ కబ్జాకోరు. ఆయన చేతకానితనంతోనే రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి. ప్యారగాన్‌ చెప్పులు లేని కుటుంబం ఎవరిదో ప్రజలకు తెలుసు. రేవంత్‌వి చిల్లర రాజకీయాలు. ఆరు నెలల పాలనలో ఆరోగ్యం, విద్యుత్, వ్యవసాయ, చేనేత తదితర రంగాల్లో కాంగ్రెస్‌ పూర్తిగా విఫలమైంది. ఇదే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీని ముంచుతుంది..’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. లక్ష మంది రేవంత్‌లు వచ్చినా బీఆర్‌ఎస్‌ను తుడిచిపెట్టలేరు.. కేసీఆర్‌ అంటే తెలంగాణ చరిత్ర. నా రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రం తెచ్చా. కేసీఆర్‌ గుండెల్లో తెలంగాణ.. తెలంగాణ గుండెల్లో కేసీఆర్‌ ఉంటరు. గెలుపోటములు పక్కన పెడితే తెలంగాణ ఎమోషన్‌ కేసీఆర్‌. 65 లక్షల మంది సభ్యత్వం కలిగిన మహా సముద్రం లాంటి బీఆర్‌ఎస్‌ను తుడిచిపెట్టడం లక్ష మంది రేవంత్‌లు వచ్చినా సాధ్యం కాదు. కేసీఆర్‌ను గిల్లి పడేస్తం అనుకునే వాళ్లు పిచ్చివాళ్లు. మోదీ దుర్మార్గాలు పెరిగాయ్‌..ప్రధాని మోదీ దుర్మార్గాలు పెరిగిపోయాయి. ఆయన గోబెల్స్‌ మాదిరిగా అవసరాన్ని బట్టి మాట్లాడుతారు. నాలుక మడతేయడం ఆయనకు వచ్చినంతగా ఎవరికీ రాదు. మత విద్వేషాలను రెచ్చగొట్టి దేవుడి పేరిట ఓట్లు కొల్లగొట్టే పార్టీ బీజేపీ. హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా.. అసమానతకు గురైన ఎస్సీ, ఎస్టీ, ఎస్టీ, ఎంబీసీ, మైనారిటీలు అందరికీ న్యాయం జరగాలి. ఎస్సీ రిజర్వేషన్లు 15% నుంచి 19 శాతానికి పెంచాలి. అల్పాదాయం ఉన్న ముస్లింలకు కూడా రిజర్వేషన్లు ఉండాలి. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ మోదీ సృష్టించిన రాజకీయ కుట్ర. నేనూ, కేజ్రీవాల్‌ మోదీకి కంటిలో నలుసులా తయారయ్యాం. మోదీ కుడి భుజం బీఎల్‌ సంతో‹Ùను అరెస్టు చేసేందుకు వెళ్లినందునే.. నా కూతురు కవితను టార్గెట్‌ చేశారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మేం ఈ కుట్రలను ఎదుర్కొంటాం.

Babu conspiracy targeting women: Andhra Pradesh
మహిళల భద్రతకు ‘పచ్చ’ముప్పు

సాక్షి, అమరావతి : చంద్రబాబుకు జీవన్మరణ సమస్యగా మారిన ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఆయన మునుపెన్నడూలేని రీతిలో బరితెగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అక్రమాలకు పన్నాగం పన్నుతూ యావత్‌ మహిళల భద్రతకు పెనుముప్పుగా మారారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు టీడీపీ రూపొందించిన ‘వుయ్‌ యాప్‌’ రాష్ట్రంలో మహిళల రక్షణకు ప్రమాదంగా పరిణమించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజాప్రాతినిధ్య చట్టం, ఐటీ చట్టాలను ఉల్లంఘించి రూపొందించిన ఈ యాప్‌ మహిళల భద్రత పాలిట పెనుగండంగా మారింది. తీవ్ర ఆందోళన కలిగిస్తున్న టీడీపీ ‘వుయ్‌ యాప్‌’ బాగోతం కథాకమామిషు ఏమిటంటే.. వ్యక్తిగత సమాచారం అంతా ‘పచ్చ’ముఠా గుప్పెట్లోరాష్ట్రంలో ఓటర్ల వివరాలన్నింటినీ చంద్రబాబు ముఠా అక్రమంగా సేకరించింది. గతంలో అధికారంలో ఉండగా నిర్వహించిన ప్రజా సాధికార సర్వే ద్వారా సేకరించిన సమాచారాన్ని టీడీపీ సేవామిత్ర యాప్‌కు అనుసంధించారు. ప్రస్తుతం కూడా టీడీపీ అదే రీతిలో ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌ నుంచి ఓటర్ల వివరాలను అక్రమంగా సేకరించింది. ఓటర్ల పేర్లు, చిరునామాలు, వయసు, ఆధార్‌ నంబర్లు, ఫోన్‌ నంబర్లు, బ్యాంకు ఖాతాల నంబర్లతో పాటు ఫొటోలు.. ఇలా పూర్తి వివరాలను వుయ్‌ యాప్‌లో పొందుపరిచారు. వాటిలో రాష్ట్రంలోని 2.10 కోట్ల మహిళా ఓటర్ల వివరాలు వారి ఫొటోలతో సహా ఉండటం గమనార్హం. అంటే.. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన యవతులు, మహిళల పూర్తి వ్యక్తిగత సమాచారం అంతా టీడీపీ గుప్పెట్లోకి వచి్చందన్న మాట. ఈ సమచారాన్ని వుయ్‌ యాప్‌ ద్వారా టీడీపీ బూత్‌కమిటీలకు చేర్చింది. దీంతో ఆకతాయిలు, వీధి రౌడీలు, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడేవారు, ఇతర నేరచరితులకు ఈ వివరాలన్నీ అందుబాటులోకి వచ్చినట్లే. వేధింపులకు అవకాశం.. భద్రతకు ముప్పుటీడీపీ పాల్పడుతున్న ఈ అక్రమాలు రాష్ట్రంలోని మహిళల భద్రతకు పెనుముప్పుగా పరిణమించాయి. ఎందుకంటే ఆకతాయిలు మహిళల ఫోన్‌ నంబర్లకు ఫోన్లుచేసి వేధించొచ్చు.. ఫొటోలను ఎవరైనా మార్ఫింగ్‌ చేసి సైబర్‌ నేరాలకు పాల్పడొచ్చు.. వారి బ్యాంకు ఖాతాలను హ్యాకింగ్‌ చేసి ఆరి్థక నేరాలకు పాల్పడొచ్చు.. ఇలా.. ఎటువంటి నేరాలకైనా పాల్పడేందుకు ఆ యాప్‌ అవకాశం కలి్పస్తోంది.టీడీపీ కుట్ర కచి్చతంగా రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత స్వేచ్ఛ హక్కుకు భంగకరం. వ్యక్తిగత గోప్యత హక్కుకు ప్రమాదకరం. ఈ నేపథ్యంలో.. వుయ్‌ యాప్‌ పేరుతో టీడీపీ ఎన్నికల అక్రమాలకు పాల్పడటంతోపాటు రాష్ట్రంలోని మహిళల భద్రతకు పెను ప్రమాదాన్ని తీసుకొచి్చందని మేధావులు, రాజకీయ పరిశీలకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ (ఈసీ)తోపాటు పోలీసు యంత్రాంగం తక్షణం స్పందించి ఈ యాప్‌ను తొలగించాలని కోరుతున్నారు. చంద్రబాబుతోపాటు వుయ్‌ యాప్‌ రూపొందించిన వారిపై కుట్ర కేసు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. విధ్వంసాలకు బాబు స్కెచ్‌మరోవైపు.. ఓటమి భయంతో అసలే బెంబేలెత్తుతున్న చంద్రబాబు మహిళా ఓటర్లు పేరెత్తితే రగిలిపోతున్నారు. వారంతా ముక్తకంఠంతో సీఎం జగన్‌కే మద్దతు ప్రకటిస్తుండడంతో బాబుకు కంటిమీద కునుకు కరువైంది. దీంతో ఆయన విధ్వంసకర కుట్రకు తెరతీశారు. పోలింగ్‌ సందర్భంగా రాష్ట్రంలో విచ్చలవిడిగా దాడులు, దౌర్జన్యాలకు స్కెచ్‌ వేశారు. మహిళల ఓట్లు ఎలాగూ సాధించలేం కాబట్టి వారి ఓటింగ్‌ శాతాన్ని తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్రంలో పెను విధ్వంసం సృష్టించేందుకు తెగబడుతున్నారు. ఇందులో భాగంగా రాబోయే 24 గంటల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా చంద్రబాబు పన్నాగం పన్నారు. రెచ్చగొట్టి దాడులకు తెగబడాలి.. పోలింగ్‌ బూత్‌లకు వెళ్లే మహిళలను ఆకతాయిలతో రెచ్చగొట్టి.. అసభ్య పదాలతో దూషించి.. వారు దానిపై ప్రశి్నంచగానే టీడీపీ గూండాలు ఘర్షణలకు దిగి.. దాడులకు తెగబడేలా చేయాలన్నది చంద్రబాబు బ్లూప్రింట్‌. ఈ కుట్రను పక్కాగా అమలుచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అభ్యర్థులు, నేతలు తమ మందీమార్బలాన్ని, గూండాలను సమీకరించుకుని.. వారికి కర్రలు, కత్తులతోపాటు ఇతర ఆయుధాలను కూడా అందించి పోలింగ్‌ను భగ్నం చేసేందుకు తద్వారా మహిళల ఓటింగ్‌ను తగ్గించేందుకు సన్నద్ధమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మహిళలే లక్ష్యంగా బాబు కుట్ర..ఇక ఎన్నికల ప్రచారం ముగియడంతో రాష్ట్రంలోని ఎన్నికల ముఖచిత్రం ఏమిటన్నది చంద్రబాబుకు స్పష్టమైంది. ప్రజలంతా వైఎస్సార్‌సీపీపట్ల పూర్తి సానుకూలంగా ఉన్నారన్నది తేలిపోవడం.. మహిళా ఓటర్లు సీఎం జగన్‌కు నీరాజనాలు పడుతున్నారని అన్ని జాతీయ సర్వేలతో సహా స్పష్టంచేస్తుండటంతో ఆయన రగిలిపోతున్నారు. ఎందుకంటే.. రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లుండగా.. వారిలో మహిళా ఓటర్లే 2.10 కోట్ల మంది ఉన్నారు. తన ఐదేళ్ల పాలనలో జగన్‌ మహిళలకు పెద్దపీట వేశారు. డీబీటీ, నాన్‌ డీబీటీ పథకాల ద్వారా మొత్తం రూ.2.83 లక్షల కోట్ల మేర లబ్ధి వారికి చేకూర్చి దేశంలోనే కొత్త చరిత్రను సృష్టించడంతో సీఎం జగన్‌కు మహిళలు జేజేలు పలుకుతున్నారు. దీంతో మహిళల ఓట్లపై చంద్రబాబు దాదాపుగా ఆశలు వదిలేసుకోవడం.. టీడీపీ శ్రేణులు నైరాశ్యంలో కూరుకుపోవడంతో మహిళా ఓటర్లే లక్ష్యంగా బాబు విధ్వంసానికి కుట్ర పన్నారు.అడ్డుకట్ట వేయాల్సింది ఈసీ, పోలీసులేఈ నేపథ్యంలో.. పోలింగ్‌ ప్రశాంతంగా, సక్రమంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ (ఈసీ), పోలీసు యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. సమస్యాత్మక నియోజకవర్గాల్లో పోలింగ్‌ నిర్వహణ కోసం వెబ్‌కాస్టింగ్, వీడియో రికార్డింగ్‌ తదితర చర్యలు తీసుకుంటున్నా.. అవి పోలింగ్‌ బూత్‌ల వద్ద పరిస్థితిని మాత్రమే పర్యవేక్షణకు ఉద్దేశించినవి.⇒కానీ, సామాన్య మహిళా ఓటర్లు తమ ఇళ్ల నుంచి పోలింగ్‌ బూత్‌లకు వచ్చే మార్గాల్లోనూ.. ఇతర ప్రాంతాల్లోనూ దాడులకు తెగబడేందుకు కుట్ర పన్నుతున్న టీడీపీ గూండాలను కట్టడి చేయాలంటే ఆ చర్యలు సరిపోవు. కాబట్టి ఈసీ, పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండి.. పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించేలా.. మహిళలు అత్యధికంగా ఓటింగులో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వారి ఓటింగ్‌ శాతం తగ్గించడమే లక్ష్యం సాధారణంగా ప్రతి ఎన్నికల్లోనూ మహిళలు పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొంటారు. పోలింగ్‌ ప్రశాంతంగా, సక్రమంగా సాగితే మహిళల ఓటింగ్‌ శాతం అమాంతంగా పెరుగుతుంది. అందుకే మహిళల ఓటింగ్‌ శాతాన్ని తగ్గించడమే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. ఇందుకోసం పోలింగ్‌ ముందు రోజు, పోలింగ్‌ రోజు రాష్ట్రవ్యాప్తంగా దాడులు, దౌర్జాన్యాలకు పాల్పడమని చంద్రబాబు పార్టీ శ్రేణులను ఆదేశించారు.అందుకోసం స్థానికంగా ఉండే టీడీపీ రౌడీలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి గూండాలు, రౌడీ మూకలను రప్పించినట్లు సమాచారం. ఎక్కడపడితే అక్కడ దాడులకు తెగించాలని.. తద్వారా ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చెలరేగి.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సృష్టించాలన్నది చంద్రబాబు పన్నాగం. పోలీసుల లాఠీచార్జీ, బాష్పవాయు ప్రయోగం.. వీలైతే పోలీసు కాల్పుల వరకూ పరిస్థితి తీసుకొచ్చి శాంతిభద్రతలు అదుపుతప్పేలా చేయాలని ఆయన టీడీపీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఇందులో భాగమే ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు. అవి.. ⇒ తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో సాక్షాత్తూ రాష్ట్ర హోంమంత్రి తానేటి వనితపైనే టీడీపీ గూండాల దాడి. ⇒ మాచర్లలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవి, మాజీ ఎంపీపీ దాసరి చౌడేశ్వరిలపై టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహా్మరెడ్డి తన అనుచరులతో దాడిచేయించడం.. ⇒ ఇక కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి భార్య, తనయుడిపై టీడీపీ గూండాలు దాడి.

More than 300 killed in Afghanistan flash floods
అఫ్గాన్‌లో ఆకస్మిక వరదలు.. 300 మందికి పైగా మృతి

ఇస్లామాబాద్‌: అఫ్గానిస్తాన్‌ ఉత్తరప్రాంతంలో శుక్రవారం రాత్రి ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో 300 మందికి పైగా ప్రజలు మృతి చెందినట్లు ఐరాస ఆహారం విభాగం తెలిపింది. వెయ్యి వరకు నివాసాలు ధ్వంసం కాగా వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని పేర్కొంది. బాధితులకు ఆహారం అందజేస్తున్నట్లు శనివారం తెలిపింది. బఘ్లాన్, బాదాక్షాన్, ఘోర్, హెరాట్, టఖార్‌ ప్రావిన్స్‌ల్లో ఎక్కువ నష్టం సంభవించినట్లు తాలిబన్‌ ప్రభుత్వం తెలిపింది. బఘ్లాన్‌లో 131 మంది, టఖార్‌లో 20 మంది మరణించారని వెల్లడించింది. డజన్ల కొద్దీ గల్లంతయ్యారని కూడా తెలిపింది. బఘ్లాన్‌లో వరదల్లో చిక్కుకుపోయిన వారిని వైమానిక దళం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోందని తెలిపింది. 100 మందికి పైగా క్షతగాత్రులను సైనిక ఆస్పత్రులకు తరలించినట్లు రక్షణ శాఖ వివరించింది.

TDP Leader Chandrababu Fake Promises Of Manifesto
బాబూ.. నీ హామీల అమలు ఎలా సాధ్యం?

(సాక్షి, అమరావతి): మేనిఫెస్టో సహితంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన అలవికాని హామీలకు మొదటి సంవత్సరంలోనే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? అక్షరాలా లక్షా అరవై ఐదువేల కోట్లు. అంటే... రూ. 1.65 లక్షల కోట్లు. మరి అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు? అసలు రాష్ట్ర ఆదాయం ఎంత? అన్ని లక్షల కోట్లు సమకూరే అవకాశం ఉందా అంటే? ఈ ప్రశ్నలకు ఆర్థిక నిపుణులనెవరిని సమాధానమడిగినా అలాంటి ఛాన్సే లేదని స్పష్టంగా చెబుతున్నారు. అయినా చంద్రబాబు మాత్రం అధికారమే లక్ష్యంగా నోటికి వచ్చినట్లు వాగ్దానాలు ఇచ్చేశారు. ఎందుకంటే వాటిని అమలు చేసే ఆలోచన లేదు కాబట్టి నోటిమాటగా యధేచ్చగా ప్రజలకు మాయ హామీలు ఇచ్చేశారు. ప్రజలను మోసం చేయడం, వంచించడం ఈ వృద్ధ నేతకు వెన్నతో పెట్టిన విద్య కావడంతో ఈ ఎన్నికల్లోనూ అదే లైను ఎంచుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆయన ఇచ్చి­న హామీలు, ఇతర ఖర్చులు, ఎంత వరకు అప్పు చేయవచ్చు వంటి విషయాలను పరిశీలించిన నిపుణులు చంద్రబాబు హామీలు అమలు చేయడం అసాధ్యమని కుండబద్ధలు కొట్టినట్లు చెబుతున్నారు. ఆ వివరాలు చూస్తే... చంద్రబాబు కాపీ కొట్టి ప్రకటించిన తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, పింఛన్లు వంటి వివిధ పథకాలకు 2024–2025 సంవ­త్సరంలో రూ.1.65 లక్షల కోట్లు అవసరమనేది ఆర్థిక నిపుణుల అంచనా. ఇక 2029 సంవత్సరానికి అది రూ.1.76 లక్షల కోట్లకు పెరుగుతుంది. ఇక వీటితో పాటు ప్రభుత్వం తప్పనిసరిగా చేయాల్సిన ఖర్చులు, మూలధన వ్యయం ఎలాగూ ఉండనే ఉంటుంది. అంటే ఉద్యోగులు, పెన్షనర్ల జీత భత్యాలు, ప్రభుత్వం అప్పులపై కట్టాల్సిన వడ్డీలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు చేయాల్సిన ఖర్చు, ఇతర బిల్లులు, చెల్లింపులు వంటివన్నీ కలిపి ఏడాదికి రూ.2 లక్షల కోట్లకుపైనే ఉంటుంది. 2024–2025­లో ఇందుకోసం రూ.2.10 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే, 2029 నాటికి అది రూ.2.85 లక్షలకు కోట్లకు పెరుగుతుందని నిపుణుల అంచనా. మొత్తంగా ఐదేళ్లలో రూ.12.23 లక్షల కోట్లు ఇందుకోసం అవసరమవుతుంది. మొత్తంగా చంద్రబాబు ప్రకటించిన పథకాలు, ప్రభుత్వ ఖర్చు కలిపి 2024–2025లో రూ.3.75 లక్షల కోట్లు అవసరమని అంచనా. 2028–29 నాటికి అది రూ.4.61 లక్షల కోట్లకు ఎగబాగనుంది. ఇంత ఖర్చును భరించే సామర్థ్యం రాష్ట్రానికి సాధ్యమయ్యే అవకాశమే లేదని ఆర్థిక వేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఖర్చు 3.75 లక్షల కోట్లయితే... ఆదాయం రూ.2.03 లక్షల కోట్లేప్రభుత్వానికి పన్నులు, పన్నేతర ఆదాయాలన్నీ కలిపి 2025లో రూ.2.03 లక్షల కోట్లు సమకూరే అవకాశం ఉంది. 2029 నాటికి ఈ ఆదాయం రూ.2.82 లక్షల కోట్లు పెరిగే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఆర్థిక నిపుణులు చెప్పేదేమిటంటే ఆదాయ–వ్యయాల మధ్య తేడా గరిష్ఠంగా 10–12 శాతం వరకూ ఉన్నా పర్వాలేదు. పరిస్థితి గాడి తప్పకుండా ఉంటుంది. పన్నుల వసూళ్లలో సమర్థతను పెంచుకోవటం, వ్యయాన్ని పక్కాగా నియంత్రించుకోవటం వంటి చర్యలతో ఈ మాత్రం వ్యత్యాసాన్ని అధిగమించే అవకాశం ఉంటుంది. అలాకాకుండా ఆదాయ – వ్యయాల మధ్య తేడా మరీ ఎక్కువగా ఉంటే చేతులెత్తేయటం తప్ప ఏ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. ఈ లెక్కన చూసుకుంటే చంద్రబాబు హామీలను బట్టి చూసినపుడు ప్రభుత్వ ఆదాయానికి.. పథ­కాలు, ఇతర ఖర్చులకు మధ్య వ్యత్యాసం 2024–­2025 సంవత్సరంలో రూ.1.72 లక్షల కోట్లు ఉంటుంది. 2028–2029 నాటికి అది రూ.1.78 లక్షల కోట్లకు పెరుగుతుంది. ఇంత డబ్బును సమకూర్చుకోవాలంటే అప్పులు దొరికే అవకాశం ఉండదు. ప్రభుత్వ ఆస్తులను అమ్మడం, లేదా ఉద్యోగుల జీతభత్యాలను పూర్తిగా నిలిపేయటం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటివి చేయలేని పక్షంలో పథకాలను అమలు చేయటం మానేయాలి. అంటే... అయితే మేనిఫెస్టో­ను చెత్తబుట్టలో పడేసి జనాన్ని మోసం చెయ్యాలి... లేదంటే ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్ల వంటి తప్పనిసరి వ్యయాలను ఎగ్గొట్టాలి. ఇది అరాచకానికి దారి తీస్తుందనేది నిపుణుల మాట. ఏడాదికి రూ.1.72 లక్షల కోట్ల అప్పులు తెస్తారా?తాజా లెక్కల ప్రకారం చంద్రబాబు హామీలు అమలు చేయాలంటే ఏడాదికి రూ.1.72 లక్షల కోట్ల అప్పు తప్పనిసరిగా తేవాల్సి ఉంటుంది. ఈ అప్పులు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో (జీఎస్‌డీపీ)లో 10.5 శాతాన్ని దాటేస్తాయి. అది కూడా ఆయా సంవత్సరాల్లో రెండంకెల వృద్ధి రేటు సాధిస్తారు అని ఊహిస్తేనే. అలాకాకుండా వృద్ధి రేటు తగ్గితే పరిస్థితి మరింత అధ్వాన్నం. అసలు ఇంత అప్పు తేవడం నిజంగా సాధ్యమా అంటే కానే కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఇంతకుముందు ఎప్పుడూ ఈ స్థాయి అప్పు చేయలేదు. కాగ్‌ లెక్కలు, ఆర్‌బీఐ అంచనాలు, రాష్ట్ర బడ్జెట్‌ పత్రాలన్నింటినీ పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం 2019–2024 మధ్య సగటున రూ.44 వేల కోట్లకు మించి అప్పులు చేయలేదు. జీఎస్‌డీపీలో (రాష్ట్ర స్థూల ఉత్పత్తి) 3 శాతానికి మించి అప్పు చేయడానికి ఏ కేంద్ర ప్రభుత్వమూ అనుమతించదు. ఆ పరిమితిని పూర్తిగా ఉపయోగించుకుని... కేంద్రం అనుమతించిన మేరకు గరిష్ఠంగా అప్పులు తెచ్చినా తొలి ఏడాదే ఇంకా రూ.1.13 లక్షల కోట్లు కావాలి. ఐదేళ్లలో రూ.5.40 లక్షల కోట్లు సమకూరిస్తేనే చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయడం కుదురుతుంది. ఇవికాకుండా అమరావతి నిర్మాణం ఖర్చు మరో రూ.1.09 లక్షల కోట్లు. మొత్తం కలిపి రూ.6.50 లక్షల కోట్లను చంద్రబాబు ఎక్కడి నుంచి తెస్తారు? రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం కడుతున్న పన్నుల్ని నాలుగు రెట్లు పెంచి, ప్రభుత్వ ఆస్తులన్నింటినీ గతంలో ఎన్నడూ లేనివిధంగా అయిన కాడికి అమ్మేస్తే కొంత మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. అంటే ప్రజలపై నాలుగు రెట్ల పన్నుల్ని చంద్రబాబు పెంచుతారా? లేకపోతే చంద్రబాబు హామీల అమలు కోసం ఏటా రూ.లక్ష కోట్లకు పైగా ఆస్తుల్ని అమ్మేస్తారా? ఇవేమీ సాధ్యమయ్యే అవకాశమే లేదు. అంటే చంద్రబాబు హామీలు అమలు చేయడానికి ఏమాత్రం ఛాన్సే లేదని నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. గతంలో రుణమాఫీ హామీని అమలు చేయకుండా ఎగ్గొట్టినట్టే ఈ హామీలను తుంగలో తొక్కడం తప్ప బాబుకు వేరే ఆప్షన్‌ లేదని, ఆయనను నమ్మి ఓటేస్తే జరిగేది అదేనని వారు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. నిజానికి ఈ సంగతులన్నీ జనానికి తెలుసు. ఎలాగంటే... బాబు ట్రాక్‌ రికార్డు అలాంటిది మరి. అందుకే అలవికాని హామీలిచ్చిన చంద్రబాబును ప్రజలు నమ్మడంలేదు.

Lok Sabha Election 2024: Mamata Attacks Bengal Governor Over Molestation Charges
మమతా బెనర్జీ: రాజ్‌భవన్‌లో అడుగుపెట్టను

సప్తాగ్రామ్‌: పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ ఆనంద బోసుపై టీఎంసీ చీఫ్‌ మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గవర్నర్‌ ఇంకా పదవిలో కొనసాగుతున్నారని మండిపడ్డారు. ఆయన ఎందుకు రాజీనామా చేయలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. శనివారం సప్తాగ్రామ్‌లో ఎన్నికల ప్రచారం మమతా బెనర్జీ మాట్లాడారు. గవర్నర్‌ పదవిలో ఆనంద బోసు కొనసాగినంత కాలం తాను రాజ్‌భవన్‌లో అడుగుపెట్టబోనని తేలి్చచెప్పారు. ఒకవేళ గవర్నర్‌ను కలవాలనుకుంటే వీధుల్లోనే కలుస్తానని అన్నారు. మహిళలపై వేధింపులకు గవర్నర్‌ సమాధానం చెప్పాలన్నారు. గత నెల 24న, ఈ నెల 2న గవర్నర్‌ ఆనంద బోసు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రాజ్‌భవన్‌లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి గతవారం కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను తప్పు చేయలేదని గవర్నర్‌ అన్నారు. పూర్తి వీడియోలను గవర్నర్‌ బహిర్గతం చేయలేదని మమత ఆరోపించారు.

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు, కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్‌లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Lok Sabha Election 2024: Priyanka Gandhi attacks PM Modi in Nandurbar
Priyanka Gandhi: చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నారు

నందుర్బార్‌: ప్రధాని మోదీ లక్ష్యంగా కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. ప్రపంచంలోనే గొప్ప నేతంటూ మోదీని బీజేపీ నేతలు ఆకాశానికి ఎత్తేస్తుండగా ఆయన మాత్రం తనను వేధిస్తున్నారంటూ చిన్నా పిల్లాడిలా ఏడుస్తున్నారన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మాదిరిగా ధైర్యసాహసాలను అలవర్చుకోవాలని ప్రియాంక ఉద్బోధించారు. శనివారం ప్రియాంక మహారాష్ట్రలోని నందుర్బార్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడారు. ‘అవినీతిపై ఒంటరి పోరాటం సాగిస్తున్నట్లు మోదీ చెప్పుకుంటున్నారు. ఆయన వద్దే అధికారం యావత్తు కేంద్రీకృతమై ఉంది. మోదీ అందరి కంటే గొప్పనేత అనీ, ప్రపంచ నేతల మద్దతు ఆయనకు ఉందని బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ, మోదీ మాత్రం తనను లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్షాలు వేధింపులకు పాల్పడుతున్నాయంటూ ఎన్నికల సభల్లో చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నారు. ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి ప్రజల కష్టాలను అడిగి తెలుసుకోవాలి. కానీ, ఆయనే స్వయంగా ఇబ్బందులను చెప్పుకుంటున్నారు. ధైర్యంగా ఉండాలి మోదీజీ, ఇది ప్రజా జీవితం. ప్రధాని పదవిని తక్కువ చేయొద్దు’ అని హితవు పలికారు. ‘దుర్గామాతలా వ్యవహరించిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నుంచి నేర్చుకోండి. ఆమె పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేశారు. ఆమె మాదిరిగా ధైర్యం, కృతనిశ్చయం కలిగి ఉండండి. కానీ, జాతి వ్యతిరేకి అంటూ ఇందిరను తిట్టిపోసే మీరు, ఆమె నుంచి నేర్చుకునేందుకు ఏముంటుంది?’ అని ప్రియాంక అన్నారు. ప్రధాని మోదీ శుక్రవారం నందుర్బార్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో..తనను సజీవంగా సమాధి చేయాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయంటూ వ్యాఖ్యానించడం తెలిసిందే.

Mothers Day 2024: Mom Instagram Influencers in India
Mothers Day 2024: సూపర్‌ మామ్‌ఫ్లూయెన్సర్‌

సోషల్‌ మీడియా ప్రపంచంలో మామ్‌ఫ్లూయెన్సర్‌లు పవర్‌ఫుల్‌ ఫోర్స్‌గా మారారు. ఇన్‌స్పిరేషనల్‌ వైరల్‌ కంటెంట్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. సోషల్‌ మీడియాలో కొందరు పాపులర్‌ మామ్‌ ఫ్లూయెన్సర్‌ల గురించి...ఫ్యాషన్, బ్యూటీటిప్స్‌ నుంచి పేరెంటింగ్‌ అండ్‌ వర్క్‌–లైఫ్‌ బ్యాలెన్స్‌ వరకు తల్లులకు ఉపయోగపడే ఎన్నో సలహాలు ఇస్తోంది మాసుమ్‌ మినవాలా మెహతా. ఎన్నో బ్రాండ్‌లు, పబ్లికేషన్‌లతో కలిసి పనిచేస్తోంది.తన పేరెంటింగ్‌ జర్నీ విషయాలు, డిఐవై(డూ ఇట్‌ యువర్‌సెల్ఫ్‌) ్రపాజెక్ట్స్, హోమ్‌ డెకార్‌ ఐడియాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తోంది కరిష్మ దొండే. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన కరిష్మ కామన్‌ పేరేంటింగ్‌ చాలెంజెస్‌కు క్రియేటివ్‌ సొల్యూషన్స్‌ అందిస్తోంది. మామ్‌గా తన అనుభవాలను పంచుకోవడంతో పాటు ఇతర తల్లులకు టిప్స్, సలహాలు ఇస్తోంది.బాలీవుడ్‌ సినిమాలు, టీవీ షోలు, వెబ్‌ సిరీస్‌లతో పాపులర్‌ అయిన శ్వేతా సాల్వే మామ్‌ఫ్లూయెన్సర్‌గా సోషల్‌ మీడియాలో మంచి పేరు తెచ్చుకుంది. ఫిట్‌నెస్‌ టిప్స్‌ నుంచి ఫ్యాషన్‌ వరకు ఎంతో కంటెంట్‌ను తల్లుల కోసం షేర్‌ చేస్తోంది. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఎకౌంట్‌లో హెల్తీ మీల్స్, సెల్ఫ్‌–కేర్‌ ్రపాక్టీసెస్‌తో పాటు తన పేరెంటింగ్‌ జర్నీని కూడా షేర్‌ చేస్తోంది. మదర్‌హుడ్‌ను కెరీర్‌ అండ్‌ పర్సనల్‌ గోల్స్‌తో ఎలా బ్యాలెన్స్‌ చేయాలో చెబుతోంది.సోషల్‌ మీడియాలో మాసివ్‌ ఫాలోయింగ్‌ ఉన్న మామ్‌ఫ్లుయెన్సర్‌లలో నిరాళి మెహతా ఒకరు. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన మెహతా తన పేరెంటింగ్‌ జర్నీ, ట్రావెల్‌ అడ్వెంచర్స్, ఫ్యాషన్‌ ఇన్‌స్పిరేషన్‌లను షేర్‌ చేస్తుంటుంది. ‘మోర్‌ ఫన్‌ అండ్‌ క్రియేటివ్‌’ అనే కోణంలో పేరెంటింగ్‌కు సంబంధించిన ట్రిక్స్, టిప్స్‌ను తల్లుల కోసం షేర్‌ చేస్తుంటుంది నివేదిత గౌడ. తన పేరెంటింగ్‌ జర్నీతోపాటు కుకింగ్‌ టిప్స్, డిఐవై (డూ ఇట్‌ యువర్‌సెల్ఫ్‌) ఐడియాలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటుంది.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all