మౌలిక వసతులతో... రాష్ట్రం సుసంపన్నం  | Sakshi
Sakshi News home page

మౌలిక వసతులతో... రాష్ట్రం సుసంపన్నం 

Published Thu, Feb 8 2024 5:53 AM

43307 crores for creation of infrastructure - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ‘ఏపీ పారిశ్రామిక విధానం 2023–27’ ప్రభుత్వం తీసుకువచ్చింది. మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు 2024–25లో రూ.43 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించారు. 

రూ.24 వేల కోట్లతో తీరప్రాంతాభివృద్ధి 
రాష్ట్రంలో రూ.24 వేల కోట్లతో ఓడరేవులు, ఫిషింగ్‌ హార్బర్లు, షిప్‌ ల్యాండ్‌ కేంద్రాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వేలో రూ.20 వేల కోట్లతో పర్యావరణహిత ఓడరేవులు నిర్మిస్తున్నారు. రూ.3800 కోట్లతో 10 ఫిషింగ్‌ హార్బర్లను జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, బుడగట్లపాలెం, కొత్తపట్నం, ఓడరేవు, పూడిమడక, బియ్యపుతిప్ప, మంచినీళ్లపేట వద్ద ని ర్మిస్తున్నారు.

రూ.127 కోట్లతో చింతపల్లి, భీమిలి, రాజయ్యపేట, దొండవాక, ఉప్పలంక, రాయదరువుల్లో ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాలను అభివృద్ధి చేశారు. అంతర్గత జల రవాణా అభివృద్ధికి ఏపీ ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీని 2023లో స్థాపించి, కృష్ణానదిపై ముక్త్యాల–­మద్దిపాడు మధ్య తొలి నదీ ప్రవాహ ప్రాజెక్టును రూపొందించారు. భోగాపురం విమానాశ్రయ అభివృద్ధి పనులు చేపట్టారు.
   
గ్రామాల అనుసంధానం 

భారత్‌ నెట్‌ రెండో దశ ప్రాజెక్ట్‌ అమలులో భాగంగా 613 మండలాల్లోని 11,254 గ్రామ పంచాయతీలను కలుపుతూ 55 వేల కి.మీ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేశారు.
 
వైద్య విద్య బలోపేతం 
♦ రాష్ట్రంలో రూ.8480కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు 
♦ ఉద్దానం ప్రాంత కిడ్నీ రోగులకోసం పలాసలో వైఎస్సార్‌ కిడ్నీ పరిశోధన కేంద్రం, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభం. 

అత్యున్నత విద్యాలయాలు 
♦ కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్‌  కాలేజీ, సాలూరులో సెంట్రల్‌ గిరిజన వర్సిటీ, విజయనగరంలో గురజాడ జేఎన్‌టీయూ, ఒంగోలులో ఆంధ్రకేసరి వర్సిటీ, వైఎస్సార్‌ కడపలో వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ వర్సిటీ కర్నూలులో క్లస్టర్‌ వర్సిటీ, రెండో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం.
పోలవరం పురోగమనం 
♦  2019మే నాటికి 42 శాతం హెడ్‌ వర్క్‌లు 70 శాతానికి చేరిక 
♦ గోదావరి నదిలో తొలి సారిగా రేడియల్‌ గేట్ల ఏర్పాటు.  
♦ గతేడాది నవంబర్‌ 30వ తేదీన అవుకు రెండో టన్నెల్‌ ప్రారంభం.  
♦ అవుకు మొదటి, రెండో టన్నెళ్లు పూర్తి. మూడో టన్నెల్‌ త్వరలో పూర్తి. 
♦  గతేడాది సెపె్టంబర్‌ 19న 77 చెరువుల అనుసంధానం ప్రాజెక్ట్‌ ప్రారంభం. 
♦ 2022 సెపె్టంబర్‌ 6వ తేదీన గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీల ప్రారంభం.
♦  పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్‌ నిర్మాణం పురోగతి.  

పారిశ్రామిక పరుగులు 
♦  2019 నుంచి ఇప్పటి వరకు 311కుపైగా ఏర్పాటైన భారీ పరిశ్రమలు 
♦ రూ.5995 కోట్లతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు 
♦ రూ.19345 కోట్ల పెట్టుబడులతో 117 ఒప్పందాలు చేసుకున్న ఒబెరాయ్, నోవోటెల్, వంటి ప్రముఖ సంస్థలు. 

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు 
♦ పట్టణాభివృద్ధిలో భాగంగా 1426 ఎకరాల్లో జగనన్న స్మార్ట్‌ టౌన్‌íÙప్‌ల ఏర్పాటు 
♦ రూ.189 కోట్లతో 481 ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు 
♦ గ్రామీణ మౌలిక సదుపాయాల కింద 10,893 గ్రామ పంచాయతీ భవనాలు, 10216 వ్యవసాయ గోదాములు, 8299 భారత్‌ నిర్మాణ్‌ సేవా కేంద్రాలు, 3734 భారీ పాల శీతలీకరణ కేంద్రాల నిర్మాణం

Advertisement
Advertisement