CM Jagan: ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రారంభించిన సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

ఏపీ: సీఎం జగన్‌ చేతుల మీదుగా ఆహార శుద్ధి పరిశ్రమల ప్రారంభం

Published Wed, Oct 4 2023 9:00 AM

AP CM Jagan Start Food processing industries Live Updates - Sakshi

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగాభివృద్ధిలో.. నేడు మరో కీలక అడుగు పడింది. ఏపీలో ఆహార శుద్ధి, ఇథనాల్‌ తయారీ పరిశ్రమలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఆహార శుద్ధి, పరిశ్రమల రంగంలో మొత్తం 13 ప్రాజెక్టుల ద్వారా  దాదాపు రూ.2,851 కోట్ల పెట్టుబడులు రానున్నాయి.

పరిశ్రమల ఏర్పాటుతో 6,705 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలగనుంది. 90, 700 వందల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. పరిశ్రమల రంగంలో మరో ఏడు ప్రాజెక్టుల పనులకు సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారు. ఈ  ఏడు ప్రాజెక్టుల ద్వారా 4,300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. 

► అనంతపురం జిల్లా డి.హీరేహళ్లో రూ.544 కోట్లతో ఎకో స్టీల్ ఇండియా

►తిరుపతి నాయుడుపేటలో రూ.800 కోట్లతో గ్రీన్లామ్ సౌత్ ప్రాజెక్టు

►బాపట్ల జిల్లా కొరిశపాడు వద్ద రూ.225 కోట్లతో శ్రావణి బయో ఫ్యూయల్

►శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో రూ.200 కోట్లతో నాగార్జునా ఆగ్రో కెమికల్స్

►తూర్పుగోదావరి జిల్లా ఖండవల్లి వద్ద రూ.150 కోట్లతో రవళి స్పిన్నర్స్

►శ్రీసత్యసాయి జిల్లా గూడుపల్లి వద్ద రూ.125 కోట్లతో యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటో ప్లాస్టిక్

►శ్రీసత్యసాయి జిల్లా మడక శిర వద్ద రూ.250 కోట్లతో ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ యూనిట్

Advertisement

తప్పక చదవండి

Advertisement