‘వీఆర్‌ఓల సమస్యల పరిష్కారానికి సీఎం జగన్‌ కృషి’

29 Jul, 2021 14:44 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, తాడేపల్లి: వీఆర్‌ఓల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి అన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామని, ఫైనాన్స్‌ శాఖలో ఉన్న సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఎం ఆదేశించినట్లు పేర్కొన్నారు. పరీక్షల్లో ఉన్న సమస్యలను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు వెంకట్రామిరెడ్డి వెల్లడించారు.

మరిన్ని వార్తలు