Sakshi News home page

AP Political News Jan 6th: పొలిటికల్‌ అప్‌డేట్స్‌

Published Sat, Jan 6 2024 8:02 AM

AP Elections Political News Updates And Headlines 6th Jan 2024 Telugu - Sakshi

AP Elections Political Latest Updates Telugu..

7:11 PM, జనవరి 6, 2024
చంద్రబాబు మాయలు అన్నీ ఇన్నీ కావయ్యా.!

  • 2014లో పాయ‌క‌రావుపేట‌లో గెలిచిన వంగ‌ల‌పూడి అనితను 2019లో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కొవ్వూరుకు మార్చాడు బాబు 
  • కొవ్వూరు నుంచి మాజీ మంత్రి కేఎస్‌ జవహర్ ను  కృష్ణా జిల్లా తిరువూరుకు మార్చాడు
  • చంద్రగిరిలో ఓడిన చంద్రబాబు కుప్పంకు పారిపోయాడు
  • కోడెలను నరసరావు పేట నుంచి సత్తెనపల్లికి  మార్చాడు
  • ఇక గంటా అయితే ఒక్కో ఎన్నికల్లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడు
  • ఇన్ని చేసిన చంద్రబాబు.. ఇప్పుడు అభ్యర్థులను మారుస్తున్నారంటూ YSRCP మీద ఏడుస్తున్నాడు

5:06 PM, జనవరి 6, 2024
షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు: సజ్జల రామకృష్ణారెడ్డి

  • బ్రదర్‌ అనిల్‌ను టీడీపీ నేతలు గతంలో ఎలా ఆరోపించారో చూశాం..
  • ఇప్పుడు పక్కన నిలబడి అదే టీడీపీ నేతలు ఫొటోలు దిగుతున్నారు
  • వైఎస్సార్‌సీపీ తొలిరోజుల్లోనే కాంగ్రెస్‌ పార్టీ వివేకాను బరిలోకి తెచ్చింది
  • వైఎస్సార్‌ మరణంలోనూ కాంగ్రెస్‌ పార్టీపై అనుమానాలున్నాయి
  • కాంగ్రెస్‌తో చంద్రబాబు తెరవెనుక రాజకీయం కొనసాగుతూనే ఉంది
  • ఇష్యూను డైవర్ట్‌ చేయడానికే బాబు ఇలాంటి  కుట్రలు చేస్తున్నారు
  • షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉంది
  • షర్మిల వల్ల YSRCPకి ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే నష్టం ఏమీ ఉండదు
  • షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వెనుక చంద్రబాబు ఉన్నారు
  • సీఎం రమేష్‌కు సంబంధించిన సొంత విమానంలో షర్మిల, బ్రదర్‌ అనిల్‌ వెళ్లారు
  • ఎయిర్‌పోర్టులో బీటెక్ రవి, బ్రదర్ అనిల్ కుమార్ భేటీ అయ్యారు
  • టీడీపీ నేత బీటెక్ రవిని... బ్రదర్ అనిల్‌ కలవడం ఇవన్నీ అందులో బాగమే
  • వైఎస్ఆర్ మరణంపై కాంగ్రెస్‌కు సంబంధించి ఆ రోజు నుంచే అనుమానాలున్నాయి
  • టీడీపీ, కాంగ్రెస్ కలిసే నాడు వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డిపై తప్పుడు కేసులు మోపాయి
  • కాంగ్రెస్‌ నేతగా, ముఖ్యమంత్రిగా ఉంటూ వైఎస్సార్‌ చనిపోయారు
  • ఆయన చనిపోయాక.. పులివెందుల నుంచి విజయమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేశారు
  • విజయమ్మకు పోటీగా పులివెందుల నుంచి వైఎస్‌ వివేకానందరెడ్డిని కాంగ్రెస్‌ బరిలో దించింది
  • YSRCP అభ్యర్థిగా విజయమ్మకు 70శాతం ఓట్లు వస్తే.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా వివేకాకు 20శాతం ఓట్లు కూడా రాలేదు
  • కాంగ్రెస్ తో ఎప్పుటి నుంచో చంద్రబాబు కాంటాక్ట్ లో ఉంటున్నాడు
  • చంద్రబాబు తనకేం కావాలో ఓ కుట్ర ప్రకారం మిగతా వాళ్లను కలుపుకుని అందరితో కలిసి చేయిస్తాడు
  • సంక్షేమం పేరుతో ప్రజల్లోకి వెళ్తే చంద్రబాబుకు మైనస్ మార్కులు వస్తాయి
  • అందుకే ఇష్యూను డైవర్ట్ చేస్తున్నారు
  • కాంగ్రెస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది
  • ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదు
  • కాంగ్రెస్ పార్టీని మేము పట్టించుకో, పట్టించుకునే పరిస్థితులు కూడా లేవు
  • ప్రజలా? కుటుంబమా? అనే ప్రశ్న వస్తే ముఖ్యమంత్రి ఛాయిస్ ప్రజలే
  • రాజకీయాల్లో కుటుంబానికి ప్రాధాన్యత ఉండకూడదు అంటూనే మళ్లీ ఈ వాదన ఎందుకు తెస్తున్నారు?
  • కుటుంబం కోసం వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి  YSRCPని పెట్టలేదు
  • ఒక పార్టీగా మా విధానాలు మాకు ఉన్నాయి
     

3:15 PM, జనవరి 6, 2024
ఏపీని చంద్రబాబు సర్వనాశనం చేశారు:  ఎమ్మెల్యే  బుర్రా మధుసూదన్‌

  • కరోనా కష్టకాలంలో బాబు, టీడీపీ నాయకులు ఎక్కడికెళ్లారు
  • 2014లో బాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా?
  • బీసీలను పూర్తిస్థాయిలో చంద్రబాబు మోసం చేశారు
     

2:41 PM, జనవరి 6, 2024
అభివృద్ధి, సంక్షేమానికి సీఎం జగన్ పెద్దపీట

  • విశాఖ నార్త్ నియోజకవర్గం సామాజిక సాధికార యాత్రలో  వైవీ సుబ్బారెడ్డి 
  • నాడు నేడు ద్వారా విద్య, వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు
  • చంద్రబాబు, పవన్, ఎల్లో మీడియా కలిసి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు 
  • సీఎం జగన్ పాలనలో దేశంలో ఎక్కడా జరగని విధంగా సామాజిక న్యాయం జరుగుతుంది.
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జరిగిన సామాజిక న్యాయాన్ని  బస్సు యాత్ర ద్వారా వివరిస్తున్నాం

2:25 PM, జనవరి 6, 2024
సీఎం జగన్‌ పేదల పక్షపాతి.. మాజీ మంత్రి ఆళ్ల నాని

  • ఏలూరు రూరల్ మండలం చాటపర్రు గ్రామంలో వైఎస్సార్‌ పెన్షన్ కానుక కార్యక్రమం
  • చంద్రబాబు హయాంలో అంతా  దోపిడీయే
  • నేడు సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక చాటపర్రులో రూ. 58 కోట్ల అభివృద్ధి
  • గత ప్రభుత్వం, ‍ప్రభుత్వానికి మధ్య తేడా తేడా గమనించండి.
  • ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా.. ఇచ్చిన ప్రతి హామీ సీఎం జగన్‌ నెరవేర్చారు
  • టీడీపీ, జనసేనలు కుట్రలు
  • సీఎం జగన్‌ వ్యక్తిగత ప్రతిష్ట దిగజార్చేలా టీడీపీ, నేతలు విమర్శలు చేస్తున్నారు
  • సీఎం జగన్‌కు అందరూ అండగా ఉండాలి

11:07AM, జనవరి 6, 2024

ఏపీ బీజేపీలో తొలగని అయోమయం

  • పొత్తులా.. ఒంటరిగానా తేల్చుకోలేకపోతున్న ఏపీ బీజేపీ
  • రెండు రోజుల సమావేశాల్లో తేలని పొత్తుల అంశం
  • టీడీపీతో గత అనుభవాలను గుర్తు చేసిన మరికొందరు నేతలు
  • జనసేన వైఖరిపైనా సమావేశాల్లో ప్రస్తావన
  • ప్రతీ ఒక్కరి అభిప్రాయం రహస్యంగా సేకరణ
  • అగ్రనేతల రాష్ట్ర పర్యటన లోపే పొత్తులపై తేల్చాలన్న మెజార్టీ నేతలు
  • అందరి అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్న నాయకత్వం
  • అధిష్టాన నిర్ణయమే పైనల్‌ అంటూ ప్రకటనలు
     

8:10 AM, జనవరి 6, 2024
ఓటర్ల జాబితాపై టీడీపీ అక్రమాలు

  • ఓటర్ల జాబితాలో కొత్త కుట్రకు తెరతీసిన టీడీపీ
  • ఓటర్ల జాబితాలోని ప్రజల నంబర్లు తీసుకుని వారికి మెసేజ్‌లు
  • మెసేజ్‌లు పెడుతూ ఓటీపీలు అడుగుతున్న పచ్చ బ్యాచ్‌ నేతలు
  • మెసేజ్‌లపై పచ్చ నేతలను ప్రశ్నిస్తున్న ప్రజలు 

7:10 AM, జనవరి 6, 2024
టీడీపీకి కేశినేని గుడ్‌బై..

  • చంద్రబాబుకు షాకిచ్చిన టీడీపీ ఎంపీ కేశినేని నాని
  • టీడీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్టు ప్రకటన
  • త్వరలోనే టీడీపీ, తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించిన కేశినేని
  • టీడీపీలో రాజకీయంగా రసవత్తరం.

7:00 AM, జనవరి 6, 2024
ఏం చేశాడని బాబు పిలిస్తే రావాలి!

  • రా.. కదలిరా అని చంద్రబాబు పిలవగానే జనం ఎందుకు రావాలి? 
  • టీడీపీ అధినేతపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు
  • పగవాడికి కూడా చంద్రబాబుకు పట్టిన గతి పట్టకూడదు 
  • బెంగళూరు, హైదరాబాద్ లాంటి అవకాశాలను కల్పిస్తానంటూ కనిగిరి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు 
  •  చంద్రబాబు, పవన్ లకు పిచ్చిమాటలు మాట్లాడే అవలక్షణం ఉంది
  • జగన్ 17 మెడికల్ కాలేజీలు, పోర్టులు, సచివాలయాలు, స్కూల్స్ కట్టించారు
  • లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయి 
  • చంద్రబాబు లేకపోతే రాష్ట్ర ప్రజలు  అసలు విమానాలే ఎక్కనట్లు మాట్లాడుతున్నారు
  • అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని చంద్రబాబు.. అధికారం ఇస్తే అన్నీ చేస్తామంటారు 
  • బిగ్ బజారులో వాటాలు ఉన్న చంద్రబాబు నిత్యావసర వస్తువులను ఎందుకు అధికంగా అమ్ముతున్నారు
  • ప్రజలను తాగుబోతులను చేసేలా చంద్రబాబు మాటలు ఉన్నాయి
  • బీసీలకు ఏం చేశావని చంద్రబాబుకు ఓట్లు వేయాలి? 
  • ఎన్నికల సమయంలో మాత్రమే బీసీలు గుర్తుకు వస్తారా? 
  • చంద్రబాబుకు ఆయన ఇంట్లో, బంధువుల్లోనూ వ్యతిరేకమే
  • ఎన్టీఆర్ కుటుంబం నుండి తోడపుట్టిన సోదరులు, అక్క, వారి పిల్లలు అందరూ వ్యతిరేకమే 
  • అలాంటి వ్యక్తి ఎదుటివారి గురించి ఎలా మాట్లాడతారు? 
  •  రాష్ట్రాల వారి మ్యానిఫెస్టోని కాపీ కొట్ఠం తప్ప సొంత ఆలోచనలే లేని పార్టీ టీడీపీ
  • 2014లో 600 హామీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయని వ్యక్తి చంద్రబాబు
  • అలాంటి వ్యక్తిని రాష్ట్ర ప్రజలు ఎందుకు నమ్మాలి? 
  • కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయమని అప్పట్లో తునిలో మీటింగ్ పెట్టారు
  • చంద్రబాబు, పవన్ ఇచ్చిన హామీలను అమలు చేయమనే కాపులు ఉద్యమం చేశారు
  • మరి ఇప్పటికీ పవన్, చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు? 
  • తనకు కులం లేదన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు కులాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?
  • అధికారం కోసం, అవసరాల కోసం వచ్చినవారే ఇప్పుడు మా పార్టీ వీడుతున్నారు
  • జగన్‌ని నమ్మిన వారంతా పార్టీలోనే ఉన్నారు
  • జనసేనకు నాయకులు లేకనే ఇతర పార్టీల వారిని ఆహ్వానిస్తున్నారు 
  • షర్మిళ ఒక రాజకీయ నాయకురాలు
  • ఆమె ఏపీకి వస్తే మాకేం ఇబ్బంది ఉంటుంది?
  • వైసీపిని జగన్ ప్రారంభించారు
  • ఆయన్ను చూసే షర్మిళ ఐనా, నేనైనా ఇంకొందరైనా పార్టీలో చేరాం 
  • కొందరు వదిలేది పోయినంత మాత్రాన ఏం జరుగుతుంది? 
  • జగన్ బొమ్మ లేకుండా కాపు రామచంద్రారెడ్డి గెలవలేరు

6:50 AM, జనవరి 6, 2024
కనిగిరిలో రా.. కదలి రా అట్టర్‌ ఫ్లాప్‌

  • ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలోని కనిగిరి(ప్రకాశం) నుంచి టీడీపీ ఎన్నికల ప్రచారం షురూ
  • కనిగిరిలో రా.. కదలి రా పేరుతో చంద్రబాబు నాయుడు సభ 
  • భారీగా జనం వస్తారని ఆశ పడ్డ టీడీపీ శ్రేణులు.. చివరకు నిరాశ 
  • ఊహించిన రీతిలో.. సభ ఫ్లాప్‌ 
  • షాక్‌ తిన్న టీడీపీ నేతలు
  • చంద్రబాబు ప్రసంగం కొనసాగిస్తుండగానే వెళ్లిపోయిన జనం 
  • ఖాళీ కుర్చీలకే చంద్రబాబు ప్రసంగం 
  • ప్రసంగంలోనూ తన స్టయిల్‌లో గప్పాలు కొట్టుకున్న చంద్రబాబు
  • గతంలో కంటే ఘోరమైన హామీలు ఇచ్చిన బాబు
  • టీడీపీ-జనసేన కలిసినా కూడా జనం తిరస్కరణ

6:40 AM, జనవరి 6, 2024
బాబు గ్యారెంటీ ఇవ్వాల్సింది వాళ్లకు!

  • సొంత పార్టీ నేతల్ని కూడా మోసం చేయగల ఘనుడు చంద్రబాబు
  • విజయవాడ ఎంపీ కేశినేని నానినే అందుకు ఉదాహరణ
  • డబ్బు ఉన్న వ్యక్తులే తన నాయకులు అని చంద్రబాబు నిరూపించారు
  • చంద్రబాబును నమ్మి వెంట నడిచిన కేశినేని నానిని మోసం చేశారు
  • వ్యక్తిత్వం గల వారిని నాయకులను చేసిన లీడర్ జగన్ మోహన్ రెడ్డి
  • ప్రజలకు కాదు ముందు లోకేష్‌కి.. టీడీపీ నాయకుల భవిష్యత్తుకు చంద్రబాబు గ్యారెంటీ ఇవ్వాలి
  • చంద్రబాబుపై దేవినేని అవినాష్ సెటైర్లు

Advertisement
Advertisement