ఏపీ హైకోర్టులో నారా లోకేష్‌కు ఎదురు దెబ్బ | Sakshi
Sakshi News home page

ముందస్తు బెయిల్‌ పిటిషన్‌.. ఏపీ హైకోర్టులో నారా లోకేష్‌కు ఎదురు దెబ్బ

Published Fri, Sep 29 2023 11:32 AM

AP High Court Dispose Nara Lokesh Anticipatory Bail Plea - Sakshi

సాక్షి, గుంటూరు: ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ అలైన్‌మెంట్‌ కుంభకోణం కేసులో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు శుక్రవారం డిస్పోస్‌ చేసింది. అంతేకాదు ఈ కేసులో లోకేష్‌కు నోటీసులు ఇచ్చి విచారించాలని ఏపీ సీఐడీని ఆదేశించిన కోర్టు.. మరోవైపు విచారణకు సహకరించాల్సిందేనని నారా లోకేష్‌కు తేల్చి చెప్పింది.

ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో ఏ14గా నారా లోకేష్‌ పేరు చేరుస్తూ ఈ మధ్యే విజయవాడ కోర్టులో ఏపీ సీఐడీ మెమో దాకలు చేసింది. దీంతో అరెస్ట్‌ భయంతో.. నారా లోకేష్‌ ముందస్తు బెయిల్‌ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఇవాళ ఆ పిటిషన్‌పై వాదనలు జరిగాయి.

లోకేష్‌ తరపున దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించగా.. ఏపీ సీఐడీ తరపున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే లోకేష్‌కు 41-ఏ కింద నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. 

‘‘మేము చట్ట ప్రకారమే నడుచుకుంటున్నాం. దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని లోకేష్‌ను ఆదేశించిండి’’ అని ఏజీ శ్రీరామ్‌ చేసిన అభ్యర్థనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. 41-ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించుకోవచ్చని సూచించింది. ఆ ఆదేశాలను అనుసరించి నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ బయల్దేరింది ఏపీ సీఐడీ. మరికాసేపట్లో ఏపీ సీఐడీ అధికారులు లోకేష్‌ను కలిసి నోటీసులు అందించే అవకాశాలు ఉన్నాయి.

ఇదీ చదవండి:  పాపం.. లోకేష్‌ను కించపరుస్తూ యెల్లో మీడియా కథనాలు

Advertisement

తప్పక చదవండి

Advertisement