ప్రభుత్వమే మా కుటుంబాన్ని నడిపిస్తోంది | AP Navaratnalu Schemes Beneficiaries Emotional Words About AP CM YS Jagan, Details Inside - Sakshi
Sakshi News home page

ప్రభుత్వమే మా కుటుంబాన్ని నడిపిస్తోంది

Published Thu, Feb 1 2024 7:45 AM

AP Navaratnalu Schemes Beneficiaries - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే  ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.

మాలాంటోళ్లకూ సొంతిల్లు
మేం వలస జీవులం. బతుకు తెరువుకోసం ఒక చోట స్థిరంగా ఉండలేక ఊరూర భిక్షాటన చేసుకునే వాళ్లం. 20 ఏళ్ల కిందట కర్నూలు జిల్లా కోసిగికి వచ్చి ఊరు చివర గుడారాలు వేసుకుని జీవిస్తున్నాం. మాది ఉమ్మడి కుటు­ంబం. ఈరమ్మ, కాశమ్మ, అనుమంతి, యల్లమ్మ అనే నలుగురు కుమార్తెలు, శివశంకర్, శివచంద్రశేఖర్, శివరాములు అనే ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక మా కుటుంబంలో వెలుగు కనిపిస్తోంది. శివశంకర్‌ ఏపీ మోడల్‌ స్కూల్‌లో తొమ్మిదో తరగతి, శివ చంద్రశేఖర్‌ అయిదో తరగతి చదువుతున్నారు. ఒకరికి అ మ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15,000 వ స్తోంది. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశాం. నేను, నా భర్త అయ్యప్ప ఇంటి దగ్గర తట్టలు, బుట్టలు తయారు చేస్తుంటాం. మా పిల్లలు వాటిని చుట్టు పక్కల ఊళ్ల­ల్లో అమ్ము­తారు. రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు ఆదాయం వస్తోంది. ఈ సొమ్ము ఇంటి అవసరాలకే సరిపోయేది. చేయూత ద్వారా ప్రతి ఏటా రూ.18,750 నా ఖాతాలో జమవుతోంది. సొంతిల్లు లేదని మా ప్రాంత వలంటీర్‌కు చెప్పడంతో సచివాలయంలో దరఖాస్తు చేయించారు. కోసిగిలో సజ్జలగుడ్డం రోడ్డు జగనన్న లేఅవుట్‌లో ఇంటి స్థలం కేటాయించారు. నిర్మాణానికి నిధులు కూడా మంజూరయ్యాయి. ఎట్టకేలకు 
సొంతిల్లు కట్టుకున్నాం. 
– బేడ బుడగ జంగాల మారెమ్మ, కోసిగి (నీలి ఈరేష్, విలేకరి, కోసిగి) 

ప్రభుత్వమే మా కుటుంబాన్ని నడిపిస్తోంది
నేను లారీ క్లీనర్‌గా పనిచేసేవాడిని. ఆరేళ్ల కిందట రాజమండ్రి వద్ద  రోడ్డు ప్రమాదంలో నా కాళ్లు, ఎడమ చేయి కోల్పోయి వీల్‌ చెయిర్‌కే పరిమి త­మయ్యాను. నా అవిటితనం చూసి నా భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం పెదపూడిలో నాతో పాటు వృద్ధులైన అమ్మా నాన్న రాజమ్మ, రామునాయుడులు నా సంపాదనపైనే ఆధారపడి ఉన్నారు. సీఎంగా జగనన్న వచ్చాక నాకు నెలకు రూ.5 వేల వంతున పింఛన్‌ వస్తోంది. మా నాన్నకు వృద్ధాప్య పింఛన్‌ ఈ ప్రభుత్వ హయాంలోనే మంజూరైంది.  నాతో పాటు వృద్ధులైన అమ్మ, నాన్న ఒక్క రూపాయి కూడా సంపాదించే అవకాశం లేదు. ఈ ప్రభుత్వం ద్వారా నాకు, మా నాన్నకు ప్రతినెలా రూ.8 వేలు పింఛన్‌ రూపంలో వ స్తుండడం, రేషన్‌ కార్డు ద్వారా బియ్యం, కందిపప్పు వంటివి అందుతున్నాయి. గతంలో మే ము పూరింట్లో ఉండేవాళ్లం. మేము పక్కా ఇంటికి దరఖాస్తు చేసుకోగా ఈ ప్రభుత్వం రూ. 1.80 లక్షలు మంజూరు చేసింది. దీనికి తోడు వైఎస్సార్‌సీపీ నేత, విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి ఆనందబాబు రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందించారు. ఈ మొత్తంతో పూరిల్లు ఉన్న స్థలంలోనే పక్కా ఇల్లు నిర్మించుకున్నాం. 
– వియ్యపు సోమునాయుడు, పెదపూడి (చప్పా రామలింగేశ్వరరావు, విలేకరి, బుచ్చెయ్యపేట) 

మా పిల్లలకు బంగారు బాట.. 
మా ఆయన కూలి పనులకు వెళ్తాడు. ఏలూరు జిల్లా కలిదిండి మండలం ఎస్సార్పీ అగ్రహారానికి చెందిన మాకు 6, 8 తరగతులు చదువుతున్న ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. వాళ్లను బాగా చదివించాలని మా కోరిక. దానికి పేదరికం అడ్డు వస్తుందేమో అని చాలా మదనపడ్డాం. 2019లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగనన్న అమ్మ ఒడి పథకం ప్రవేశ పెట్టడంతో వారి చదువుల సమస్య పరిష్కారమైంది. మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు. అంతే కాకుండా వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా నాకు ఏటా రూ.10 వేలు చొప్పున ఇప్పటి వరకు రూ.40 వేలు వచ్చింది. ఆ మొత్తంతో రోడ్డు పక్కన కొబ్బరి»ొండాల విక్రయం సాగిస్తున్నాను. పేదల గురించి ఇంతగా ఆలోచించే ముఖ్యమంత్రిని నేను చూడలేదు. నా కళ్ల ముందు నా బిడ్డలు మంచి చదువులు చదువుతున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి భవిష్యత్తు తరాలకు ఎంతో అవసరం.  
– పి.అశి్వని, ఎస్సార్పీ అగ్రహారం (కొమ్మంటి లక్ష్మణ్, విలేకరి, కలిదిండి)  

Advertisement
Advertisement