లోక క్షేమం కోరుతూ.. ఏకంగా 14 కి.మీ గిరిప్రదక్షిణ | Sakshi
Sakshi News home page

కరోనా: లోక క్షేమం కోరుతూ.. ఏకంగా 14 కి.మీ గిరిప్రదక్షిణ

Published Wed, Jun 23 2021 7:35 AM

AP Women Rounds Around Arunachaleswarar Temple In Tiruvannamalai - Sakshi

వేలూరు (తమిళనాడు): కరోనా నుంచి మానవాళిని కాపాడాలని కోరుతూ ఓ భక్తురాలు భగవంతుడిని వినూత్న రీతిలో వేడుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకి చెందిన మాధవి తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో మంగళవారం 14 కిలోమీటర్లు గిరివలయం రోడ్డుపై అంగప్రదక్షిణ చేసింది. అరుణాచలేశ్వరాలయంలో పౌర్ణమి రోజున భక్తులు గిరిప్రదక్షిణ (గిరివలయం) చేస్తుంటారు. ముఖ్యంగా చిత్ర పౌర్ణమి, కార్తీక దీపోత్సవ పౌర్ణమి రోజున వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి గిరిప్రదక్షిణలో పాల్గొంటారు.  

చదవండి: నెలాఖరుకల్లా శ్రీశైలానికి కృష్ణమ్మ!

Advertisement
Advertisement