ఆలంబనగా.. ఆసరా | Sakshi
Sakshi News home page

ఆలంబనగా.. ఆసరా

Published Sun, Jan 28 2024 4:19 AM

The Asara celebrations are going on with grandeur - Sakshi

రాష్ట్రవ్యాప్తంగా ఆసరా వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మహిళలు తాము పొందిన లబ్దికి కృతజ్ఞతగా అనేకచోట్ల సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చే­స్తు­న్నారు. చంద్రబాబు మాటలతో తాము ఐదేళ్ల కిందట మోసపోయామని 2019 ఎన్నికల ముందు జగ­న్‌ ఇచ్చిన మాట ప్రకారం నాలుగేళ్లుగా తమకు లబ్ది చేకూరుతోందని వారు ఆనందం వ్యక్తం చే­స్తు­న్నారు. ఆసరా సొమ్ముతో తమకాళ్లమీద తాము నిలబడేలా వ్యాపారాలు చేస్తున్నామని చెబుతున్నారు. –  సాక్షి, నెట్‌వర్క్‌ 

దన్నుగా నిలిచిన ఆసరా సొమ్ము 
ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు భుక్యా శివమ్మ. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కిలేశపురం. ఐదేళ్ల క్రితం ఆమె భర్త కోటేశ్వరరావు అనారోగ్యానికి గురయ్యాడు. తీసుకున్న డ్వాక్రా రుణం అప్పు తీర్చలేక, కుటుంబ ఖర్చులు భరించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఆ సమయంలో వైఎస్సార్‌ ఆసరా సొమ్ము రూ.12 వేలు జమయ్యాయి.వాటితో హైవే పక్కనున్న ఇంటి వద్ద హోటల్, టీ స్టాల్‌ పెట్టుకున్నారు. కుటుంబ ఖర్చులు, ఆమె భర్త వైద్య ఖర్చులు హోటల్‌ సంపాదనతోనే నెట్టుకొస్తున్నారు. ఆ తర్వాత ఆసరా సొమ్ము రూ.48 వేలు,  జమయ్యాయి. అనంతరం వైద్య ఖర్చులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ.50 వేలు మంజూరయ్యాయి. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ ప«థకాలతో ఆ కుటుంబం ఇప్పుడు సంతోషంగా ఉంది.  

నాడు చేటు– నేడు ‘స్వీటు’ 
ఈమె పేరు పి.హైమావతి. అనంతపురం జిల్లా కణేకల్లు మండల కేంద్రం. శ్రీలక్ష్మి వెంకటేశ్వర డ్వాక్రా సంఘంలో సభ్యురాలిగా కొనసాగుతోంది. వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా మూడు విడతల్లో రూ.32,800 లబి్ధపొందింది. ఆ నిధులతో కుటుంబ సభ్యుల సహకారంతో ఇంటి వద్దే  తినుబండారాల తయారీ కేంద్రం (స్వీటు షాపు) ఏర్పాటు చేసుకుంది. ఇందులో ప్రతి పైసా వ్యాపారాభివృద్ధికి వినియోగించుకుంది. బ్యాంకు లింకేజీ,  స్త్రీనిధి లాంటి రుణాలు తీసుకుంది. తద్వారా వ్యాపారాన్ని మరింత విస్తరించుకుంది. ఇతరులకూ ఉపాధి కల్పిస్తోంది. 

పాడిగేదెలు కొన్నాం 
నాలుగు దఫాలుగా  నా అకౌంట్‌లో పడిన ఆసరా డబ్బులతో మేము పాడి గేదెలు కొన్నాము. ప్రస్తుతం పాల వ్యాపారం చేస్తూ సంతోషంగా బతుకుతున్నాం.  వైఎస్సార్‌ ఆసరా పథకంతో మా కుటుంబానికి ఎంతో ఆసరా వుంది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఏనాడూ డ్వాక్రా మహిళల అభ్యున్నతి గురించి పట్టించుకోలేదు. కానీ జగన్‌ సీఎం అయిన తర్వాత పొదుపు సంఘాలకు ఇచ్చిన మాట ప్రకారం ఆసరా నిధులు జమ చేస్తూనే ఉన్నారు. గతలో మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడేవాళ్లం. ఇప్పుడా పరిస్థితులు లేవు.   – గర్నెపూడి ఇమాంజలీ, అంబేడ్కర్‌నగర్‌ కాలనీ, కారంచేడు, బాపట్ల జిల్లా  

ఆసరా సొమ్ముతో మేకలు కొన్నాము 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే పొదుపు సంఘాలకు రుణమాఫీ 4 విడతలుగా అందించారు. నాకు 4 విడతలుగా మొత్తం రూ.44,800 నా వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు జమ అయింది. వ్య­వసాయ పనులు చేసుకొని జీవనం సాగించే మా కుటుంబం జగనన్న సాయంతో మేకలు కొనుగోలు చేసి జీవిస్తున్నాము. వీటివల్ల ఆదాయం మెరుగైంది. మాట తç­³్పకుండా మహిళలు ఆర్థికాభివృద్ధి చెందేలా చేసిన జగనన్నకు రుణపడి ఉంటాం.  – చిట్టేటి పావని, తోటవీధి, ఆత్మకూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 

ఆసరా కొండంత అండ 
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఇప్పటివరకు నాకు నాలుగు విడతలుగా ఆసరా మొత్తం జమ అయింది.  సంవత్సరానికి రూ. 16 వేలు అందుతున్నాయి. డ్వాక్రా గ్రూపులో పది మంది మహిళలు ఉన్నారు. నేను కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాను.  అన్ని విధాలుగా అండగా నిలిచిన జగనన్నే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నా.   – పాలెం అరుణ, 48వ డివిజన్, కడప, వైఎస్సార్‌ జిల్లా  

Advertisement

తప్పక చదవండి

Advertisement