AP: రాష్ట్రంలో మూడు పార్టీల గుర్తింపు రద్దు

17 Sep, 2022 19:25 IST|Sakshi

సాక్షి, అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రం నుంచి నమోదైన మూడు రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్‌కుమార్‌ మీనా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్రంలో నమోదైన భారతదేశం పార్టీ, ఇండియన్స్‌ ఫ్రంట్, జాతీయ తెలుగు అభివృద్ధి సేవా సమూహం పార్టీలను గుర్తింపు పొందిన పార్టీల జాబితా నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోపు తగిన ధ్రువీకరణపత్రాలతో కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలని సూచించారు. 

చదవండి: (ఆ విషయాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టును కోరాం: మంత్రి అమర్నాథ్‌)

మరిన్ని వార్తలు