ఉద్యోగులకు బాబు మార్క్‌ దగా  | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు బాబు మార్క్‌ దగా 

Published Fri, Jan 12 2024 5:42 AM

Chandrababu brought the system of minus marks in departmental tests - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతులు, ఇంక్రిమెంట్ల కోసం రాసే డిపార్ట్‌మెంటల్‌ టెస్టుల్లో వారు పాసవకుండా గత చంద్రబాబు సర్కారు అడ్డుకుంది. అందుకోసం ప్రత్యేకంగా జీవోను సైతం జారీ చేసింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చే దాకా ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించిన అన్ని డిపార్ట్‌మెంటల్‌ టెస్టుల్లోనూ గరిష్టంగా 4 నుంచి 6 శాతం మాత్రమే పాసయ్యారంటే ప్రభుత్వ ఉద్యోగులపై చంద్రబాబుకున్న ప్రేమ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

ఏపీపీఎస్సీ ఏటా రెండుసార్లు డిపార్ట్‌మెంటల్‌ టెస్టులు నిర్వహిస్తుంది. సరీ్వస్‌ కమిషన్‌ ద్వారా భర్తీ చేసిన పోస్టుల్లో చేరిన అభ్యర్థులు ప్రొబేషన్‌లో ఉంటారు. వారి ప్రొబేషన్‌ పూర్తవ్వాలంటే సరీ్వస్‌ టెస్ట్‌ పాసవ్వాలి. ఫెయిలైతే వారు ప్రొబేషన్‌లోనే కొనసాగుతారు. టెస్ట్‌ పాసైనవారు మాత్రం సీనియారిటీలోకి వెళ్లిపోతారు. అలాగే ఇతర డిపార్ట్‌మెంట్లలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందేందుకు కూడా డిపార్ట్‌మెంటల్‌ టెస్టు పాసవ్వాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు సరీ్వసులో సీనియారిటీలోనూ ముందుంటారు.  

జీవో నం.101తో ఉద్యోగులకు మేలు  
ప్రభుత్వ ఉద్యోగుల వయసు రీత్యా గతంలో డిపార్ట్‌మెంటల్‌ టెస్టులను ఆఫ్‌లైన్‌లో డ్రి స్కిప్టివ్‌ విధానంలో నిర్వహించేవారు. ఉద్యోగులు నిబంధనల ప్రకారం పుస్తకాలను చదివి, సరైన జవాబులను రాసేవారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం డిపార్ట్‌మెంట్‌ టెస్టును మల్టీపుల్‌ చాయిస్‌ విధానంలో మార్చి ఆన్‌లైన్‌ విధానం ప్రవేశపెట్టింది. మైనస్‌ మార్కు విధానాన్ని తీసుకొచ్చి ప్రతి తప్పు సమాధానానికి 1/3 (0.33 శాతం) మార్కులు కోత విధించారు. దీంతో పెద్ద వయసులో ఉన్న ఉద్యోగులు ఆన్‌లైన్, మల్టీపుల్‌ చాయిస్‌ విధానంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని ఈ విధానంతో 2017–19 సంవత్సరాల మధ్య తాము ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కోల్పోతున్నామని, నెగిటివ్‌ మార్కుల విధానం రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. అయినా నాటి ప్రభుత్వం పట్టించుకున్నది లేదు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చాక డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో మైనస్‌ మార్కులను తొలగించాలని అభ్యరి్థస్తూ ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు సర్వీస్‌ కమిషన్‌కు అనేక విజ్ఞప్తులు అందజేశాయి. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేసిన అనంతరం ఉద్యోగులకు మేలు చేసేందుకు మైనస్‌ మార్కుల విధానం రద్దు చేస్తూ జీవో నం.101 జారీ చేసింది. దీంతో ఇప్పుడు డిపార్ట్‌మెంటల్‌ టెస్టుల్లో 85 శాతం పైగా ఉత్తీర్ణత సాధించి, పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతున్నారు.   

ప్రభుత్వ ఉద్యోగులే లక్ష్యంగా..  
ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ విధానాన్ని ప్రోత్సహించేందుకు చంద్రబాబు ప్రభు­త్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నారు. వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రాకుండా అడ్డుకునేందుకు 2017లో జీవో నం.55ను విడుదల చేసి డిపార్ట్‌మెంటల్‌ టెస్టుల్లో ‘మైనస్‌ మార్కు’లను అమల్లోకి తెచ్చారు. దాంతో గతంలో ఏటా సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే ఈ పరీక్షల్లో 60 శాతం మంది ఉత్తీర్ణులైతే.. జీవో నం.55 వచ్చాక ఆ సంఖ్య 4–6 శాతం మిం­చలేదు. కొన్ని విభాగాల డిపార్ట్‌మెంటల్‌ టెస్టు­ల్లో ఒక్క శాతం కూడా పాసవలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ జీవోతో దాదాపు ఉద్యోగులు మూడేళ్లపాటు తమ పదోన్నతులు, ఇంక్రిమెంట్‌ అవకాశాలను కోల్పోయారంటే ఆశ్చర్యం కలుగుతుంది.

Advertisement
Advertisement