చంద్రబాబు.. ఇప్పుడెందుకు నోరు మెదపవు? | Sakshi
Sakshi News home page

చంద్రబాబు.. ఇప్పుడెందుకు నోరు మెదపవు?

Published Wed, Apr 3 2024 7:31 PM

Chandrababu Nimagadda Goes Silent After Stop pensions In Andhra Pradesh - Sakshi

అవ్వతాతలకు పెన్షన్‌ అందకుండా కుట్ర చేశారు.. ముసలి వాళ్లు, వికలాంగుల కన్నీళ్లపై నోరు మెదపరు.. నిమ్మగడ్డ, ఇప్పుడు ఏ కలుగులో దాక్కున్నావు.. చంద్రబాబు.. ఇప్పుడెందుకు నోరు మెదపవు? రామోజీ.. అవ్వాతాతల కష్టాలు ఎందుకు రాయవు? చేసిదంతా చేసి ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్‌. అవ్వాతాతల రియాక్షన్‌ చూసి బాబు సైలెంట్‌ అయిపోయాడా? పింఛన్‌ దారులకు సమాధానం చెప్పలేక ఎల్లో ముఠా నోరు మూతబడిందా?

గత ఇదిలా ఉండగా నాలుగున్నరేళ్లుగా ప్రతి నెలా 1నే వలంటీర్ల ద్వారా లబ్దిదారుల ఇంటి వద్దే అందిస్తున్న పింఛన్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు బాబుతో సన్నిహితంగా వ్యవహరించే మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వలంటీర్లను విధుల నుంచి తప్పించడంతో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఆగిపోయింది.

పింఛన్ల పంపిణీ, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలులో గ్రామ, వార్డు వలంటీర్లను దూరం చేయడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. పింఛన్ల పంపిణీలో వలంటీర్లను పక్కన పెట్టడం.. సచివాలయాలకే వెళ్లి పింఛన్‌ పొందాల్సి రావడంతో అవ్వాతాతలు, దివ్యాంగులను తీవ్ర వేదనకు గురి చేస్తోంది. చంద్రబాబు అండ్‌ కో కుటిల రాజకీయాలకు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. లక్షల మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతు అక్కచెల్లెమ్మలు మండుటెండల్లో రోడ్లపై నిలబడాల్సి వచ్చింది. ఈ ఉదంతంతో పేదలంటే చంద్రబాబుకు ఎంత వ్యతిరేకత ఉందో మరోసారి స్పష్టమైంది. చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెప్తామంటున్నారు పెన్షనర్లు.

అదేదో సినిమాలో డైలాగు లాగా... వాడు ఎక్స్ దొంగ.. ఎప్పుడు దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ..! అన్నట్టుగా సేమ్ టు సేమ్ పాలిటిక్స్ లోనూ చంద్రబాబు ఇంతే..! కుట్రలు, కుతంత్రాలు చేయడం.. నిమిషంలో దొరికిపోవడం. వాలంటీర్ల విషయంలో ఇదే చేశాడు. అడ్డంగా బుక్కయ్యాడు. ఇప్పుడు చేయి నోటికి అడ్డంగా పెట్టుకుని సైలెంట్ అయ్యాడు. నిమ్మగడ్డను కలుగులో దాక్కోమని చెప్పాడు. ఎల్లో మీడియాను జగన్ పై రివర్స్ అటాక్ చేయమన్నాడు. దత్తపుత్రుడ్ని హైదరాబాద్ పోయి ఆసుపత్రి బెడ్‌పైకి పడుకోమన్నాడు.

నాకర్థం కాదు.. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్లంటే.. చంద్రబాబు ఆయన పచ్చ ముఠాకు ఎందుకంత కోపం.. ఎందుకంత కసి.. ఎందుకంత కక్ష.. వాళ్ల నోటి దగ్గర కూడు లాగేసుకుని రాక్షసానందం పొందాలని ఎందుకు అనుకుంటున్నారు. చంద్రబాబు ముఠా ఎన్ని కుట్రలు చేసినా.. ప్రభుత్వం మాత్రం ఆ 66 లక్షల మందికి పెన్షన్లు అందించేందుకు వేరే మార్గాలు అన్వేషించింది.. పెన్షన్లు ఇవ్వడం ప్రారంభించింది. సచివాలయాలకు రాలేని వారికి ఇంటికే వెళ్లి పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చింది.

వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థతో రాష్ట్రం రూపురేఖలనే జగన్ మార్చేశారు. జగన్‌కు  వస్తున్న మంచి పేరు చూసి తట్టుకోలేక కోర్టుల్లో కేసుల మీద కేసులు వేసి.. ఈసీకి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు ఇచ్చి.. ఆఖరికి అవ్వాతాతలకు వాలంటీర్లు ఫించన్లు ఇవ్వకూడదన్న ఆర్డర్ తెచ్చుకున్నారు. దాని ఫలితం ఏ రకంగా ఉంటుందో.. అవ్వాతాతల శాపనార్థాలు ఏ స్థాయిలో ఉంటాయో.. ఈరోజు పచ్చ ముఠాకు అర్థమైంది. దెబ్బకు ఠా దొంగల ముఠా అన్నట్టుగా.. ఎక్కడి దొంగలు అక్కడే సైలెంట్ అయిపోయారు. అయినా సరే అవ్వాతాతల కన్నీళ్లకు కారణమైన 74 ఏళ్ల కుప్పం తాత.. 87 ఏళ్ల ఎల్లో తాత.. ప్రజలు అడుగుతున్న ఈ పది ప్రశ్నలకు సమాధానం చెప్పాలి..


1. జగన్ ను నేరుగా ఎదుర్కోలేక అడ్డదారిలో నిమ్మగడ్డను తెరపైకి తెచ్చావా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు
2. పేదలకు పింఛన్ల అందకుండా నిమ్మగడ్డకు పసుపు ముసుగు తొడిగి ఈసీ వద్దకు పంపించావా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు
3. నిమ్మగడ్డతో సుప్రీం కోర్టులో, ఢిల్లీ హైకోర్టులో, ఏపీ హైకోర్టులో వరుస కేసులు వేయించావా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు
4. జగన్ నా మనవడు.. నా కొడుకు అంటున్న అవ్వాతాతలపై కక్ష తీర్చుకున్నావా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు
5. సంక్షేమంతో సుఖంగా ఉన్న వికలాంగులు, వితంతువులపై పగ తీర్చుకున్నావా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు 
6. ఎర్రటి ఎండలోకి వృద్ధులను లాగి పచ్చమూక పైశాచికానందం పొందుతోందా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు
7. పింఛన్ వస్తుందో రాదోనన్న భయంతో తాత చనిపోతే తేలు కుట్టిన దొంగల్లా ఉన్నారా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు
8. నీ కుట్రలు, కుతంత్రాలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో నిమ్మగడ్డను కలుగులో దాక్కోమన్నావా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు
9. వాలంటీర్లు ఫించన్లు అందించకూడదంటూ ఈసీకి ఫిర్యాదు చేయించింది నేనే అని చెప్పలేకపోతున్నావా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు
10. అవ్వాతాతలు నిలదీస్తారని పవన్ హైదరాబాద్ పారిపోయి హాస్పిటల్ బెడ్ పై పడుకుని నటిస్తున్నాడా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు

Advertisement
Advertisement