AP CM YS Jagan Directs Officials To Help Farmers Who Suffered Crop Loss Due To Unseasonal Rains - Sakshi
Sakshi News home page

అకాల వర్షాలు.. అధికారులకు సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

Published Tue, May 2 2023 9:17 PM

Cm Jagan Orders To Officials On Untimely Rains - Sakshi

సాక్షి, అమరావతి: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు, పంటలపై దాని ప్రభావం అంశంపై అధికారులతో సీఎం సమీక్షించారు. వర్షాల వల్ల రైతుల వద్ద తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు.ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలపై మొదలైన ఎన్యుమరేషన్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి.. నివేదిక ఖరారు చేయాలన్నారు. ఈ నెలలో వైఎస్సార్‌ రైతు భరోసాతో పాటు.. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేలా ఇన్‌పుట్‌ సబ్సిడీ జారీకి అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీచేశారు.
చదవండి: ఏపీ వాసులకు అలర్ట్‌.. మూడురోజుల పాటు భారీ వర్షాలు

నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించి సామాజిక తనిఖీ పూర్తి చేయాలన్నారు. మార్చి నెలలో కురిసిన వర్షాలకు సంబంధించి ఇప్పటికే పంట నష్టం అంచనాలు తయారు చేశామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న పంట నష్టం అంచనాలపైనా ఎన్యుమరేషన్‌ చురుగ్గా కొనసాగుతోందని ముఖ్యమంత్రికి తెలిపారు.
చదవండి: రైతులెవరో తెలియదా రామోజీ?.. ఇంకెన్నాళ్లు ఈ మొద్దునిద్ర?

Advertisement
Advertisement