గీతాంజలి ఉదంతం: సీఎం జగన్‌ విచారం.. రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా | Sakshi
Sakshi News home page

గీతాంజలి ఉదంతం: సీఎం జగన్‌ తీవ్ర విచారం.. రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన

Published Tue, Mar 12 2024 2:41 PM

CM Jagan Reacts Geetanjali Case Announces 20 lakh Ex Gratia - Sakshi

గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన

ఆడబిడ్డల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే వారిని చట్టం వదిలిపెట్టదన్న సీఎం

సాక్షి, అమరావతి: తెనాలి మహిళ గీతాంజలి ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురించేసిందని అన్నారు. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ కూడా చట్టం వదిలిపెట్టదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. కాగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందంటూ గీతాంజలి ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూపై ప్రతిపక్షాలకు చెందిన సోషల్‌ మీడియా కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేయడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చదవండి: టీడీపీ, జనసేన ఆన్‌లైన్‌ మృగాల వికృత క్రీడ.. ఓ చెల్లెమ్మను చంపేశారు!

Advertisement
Advertisement