Sakshi News home page

వైద్య రంగంలో సమూల మార్పులు 

Published Tue, Jan 11 2022 3:41 AM

CM Jagan says has brought radical changes in medical and health sector - Sakshi

సాక్షి, అమరావతి:  ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ వైద్య, ఆరోగ్య రంగంలో సమూల మార్పులు తెచ్చినట్లు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రూ.426 కోట్లతో ఏర్పాటు చేసిన 144 పీఎస్‌ఏ ప్లాంట్లు, ఇతర సదుపాయాలను సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. మంత్రులు ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ, సీఎస్‌ సమీర్‌ శర్మతోపాటు పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం ప్రసంగం వివరాలివీ.. 

► ప్రభుత్వ ఆస్పత్రులలో రూ.90 కోట్ల వ్యయంతో 24,419 బెడ్లకు నేరుగా ఆక్సిజన్‌ పైపులైన్ల సదుపాయం.  
► లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ రవాణా, నిల్వ కోసం రూ.15 కోట్లతో 25 క్రయోజనిక్‌ ట్యాంకర్ల కొనుగోలు.  
► రూ.31 కోట్ల వ్యయంతో మొత్తం 74 ఎల్‌ఎంవో ట్యాంకుల కొనుగోలు 
► రూ.64 కోట్లతో 183 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో మౌలిక సదుపాయాల కల్పన 
► చిన్న పిల్లల కోసం ఆక్సిజన్‌ సపోర్ట్‌ బెడ్స్‌తో 20 పడకల పీడియాట్రిక్‌ కేర్‌ సెంటర్లు  
► రూ.8 కోట్లతో 230 కిలోలీటర్ల సామర్ధ్యం కలిగిన 23 ఎల్‌ఎంవో ట్యాంకులు మంజూరు.  
► టెస్టుల కోసం రాష్ట్రంలో 20 ఆధునిక వైరల్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు. అదనంగా సిద్ధమవుతున్న మరో 19 ల్యాబ్‌లు.  
► రాష్ట్రవ్యాప్తంగా ట్రూనాట్‌తో కలిపి మొత్తం 150 ల్యాబ్‌లు. 
► ఒమిక్రాన్‌ నిర్ధారణ కోసం విజయవాడలో జీనోమ్‌ సీక్వెన్స్‌ ల్యాబ్‌. కేరళ తర్వాత ఇక్కడే ఏర్పాటు.  
► రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడ్డ వారిలో 4,21,13,722 మందికి వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి. దాదాపు 80 శాతం మందికి రెండు డోసులు.
► 15 – 18 వయసు పిల్లల్లో ఇప్పటివరకు 20.02 లక్షల మందికి వ్యాక్సినేషన్‌తో దేశంలోనే అగ్రస్థానం.
► 33 దఫాలు ఇంటింటికీ ఫీవర్‌ సర్వేలు. ఎర్లీ ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్‌ ద్వారా కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌లో దేశానికే ఆదర్శంగా ఏపీ.  
► వైఎస్సార్‌ హెల్త్‌క్లినిక్స్‌ 80% నిర్మాణాలు పూర్తి.  
► ప్రభుత్వ రంగంలోనే కొత్తగా 16 వైద్య కళాశాలలు, నర్సింగ్‌ కాలేజీల ఏర్పాటు. నాలుగు చోట్ల శరవేగంగా పనులు.  
► ఆరోగ్యశ్రీ పరిధి 1,059 ప్రొసీజర్ల నుంచి 2,446 ప్రొసీజర్లకు విస్తరణ.
► టీచింగ్‌ ఆస్పత్రులలో 10 వేల మంది వైద్యులు, నర్సుల పోస్టులు భర్తీకి అవకాశం. మిగిలినవీ త్వరలో భర్తీ.   

Advertisement

What’s your opinion

Advertisement