AP CM YS Jagan To Launch New AP 13 Districts Updates And Latest News i- Sakshi
Sakshi News home page

AP New Districts Launch: ఏపీ కొత్త జిల్లాల అవతరణ.. అప్‌డేట్స్‌

Published Mon, Apr 4 2022 9:07 AM

CM YS Jagan Launch Andhra Pradesh New Districts Updates - Sakshi

అప్‌డేట్స్‌

తూర్పుగోదావరి జిల్లా: జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టిన సీఎం వైఎస్ జగన్‌కు  కృతజ్ఞతలు తెలుపుతూ రాజమండ్రి కొవ్వూరు రైల్ కం రోడ్డు వంతెనపై ఎంపీ భరత్ రామ్ భారీ పాదయాత్ర నిర్వహించారు. కొవ్వూరు టోల్ గేట్ నుంచి రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ వరకు పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రలో మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ నాయుడు, డాక్టర్ సూర్య నారాయణ రెడ్డి, తలారి వెంకట్రావు, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ పాల్గొన్నారు.

గుంటూరు: కొత్త జిల్లాలను స్వాగతిస్తూ గుంటూరు లాడ్జ్ సెంటర్ నుంచి శంకర్ విలాస్ సెంటర్ వరకు ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్, ముస్తఫా, మేయర్ మనోహర్ నాయుడు, మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి, మిర్చి యార్డ్ చైర్మన్ ఏసురత్నం ర్యాలీ నిర్వహించారు.

నంద్యాల జిల్లా: జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా నూతనంగా నంద్యాల జిల్లా ఏర్పాటుపై న బనగానపల్లె ఎమ్మేల్యే కాటసాని రామిరెడ్డి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ గుండం నాగేశ్వర్ రెడ్డి,ఎంపీపీ మానస వీణ, జెడ్పీటీసీ సుబ్బ లక్ష్మమ్మ,సర్పంచ్ ఈసారి ఎల్లమ్మ,మైనారిటీ నాయకుడు అబ్దుల్ ఫైజ్,డాక్టర్ మహమ్మద్ హుస్సేన్,కోడూరు రామ చంద్ర రెడ్డి,వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

పార్వతీపురం జిల్లా: పార్వతీపురం కేంద్రంగా పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పటు అయ్యింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి  నూతన జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

నెల్లూరుజిల్లా : రాపూరుని నెల్లూరు జిల్లాలో కొనసాగించడంతో హర్షం వ్యక్తం చేస్తున్న మండల వాసులు 
సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ భారీ ర్యాలీ ర్యాలీ లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి , జడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ ,వైఎస్సార్సీపీ  నేతలు.. బాణాసంచారాలు పేల్చి సంబరాలు 
ప్రజాభిప్రాయాన్ని గౌరవించిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు.. ఆయన చిత్రపటానికి పాలాభిషేకం 
థాంక్యూ సీఎం సార్ అంటూ ప్ల కార్డులు ప్రదర్శించిన చిన్నారులు 
చిన్నారులకు టెట్రా మిల్క్ , బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆనం

12:53 PM
కాకినాడ జిల్లా: కాకినాడ జిల్లాగా ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ ఎంపీ వంగా గీత. ఎమ్మెల్యే పెండెం దొరబాబు. కార్పొరేషన్ చైర్మన్ సుంకర ప్రసన్న.
కాకినాడ జిల్లా.. ప్రగతి తొలిమెట్టు నినాదాలు చేస్తూ పార్టీ కార్యాలయం నుండి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు ర్యాలీ.
ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి ప్రజలు గురించి ఆలోచించే వారు లేరు చిన్న వయసులోనే ప్రజల మన్ననలు పొందిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి
-ఎంపీ వంగా గీత

12: 35 PM
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నూతన  కొత్త కలక్టరేట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఎస్పీ రవి ప్రకాష్, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోసేనురాజు, గృహ నిర్మాణ  మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యేలు  గ్రంధి శ్రీనివాస్, కొట్టు  సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, ఉండి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జ్‌ గోకరాజు రామరాజు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు, డిసిసిబి చైర్మన్ పి వి ఎల్ నరసింహ రాజు

11:28AM
కృష్ణాజిల్లా: జిల్లాల పునర్విభజనకు మద్దతుగా అవనిగడ్డ పార్టీ కార్యాలయం నుంచి వంతెన సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించి వతెన సెంటర్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ కడవకోల్లు నరసింహారావు

10.20 AM
జిల్లా ఏర్పాటుపై చాలా గర్వంగా, ఆనందంగా ఉంది.  గిరిజనులకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఒక టీమ్‌గా తామంత పనిచేస్తాం.
-అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌.

చరిత్రలో ఒక భాగమైనందకు ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ప్రభుత్వ సూచనలతో జిల్లాను అభివృద్ధి చేస్తాం.
-బాపట్ల జిల్లా కలెక్టర్‌ విజయ

తిరుపతి జిల్లా ప్రజల తరుఫున కృతజ్ఞతలు. స‍్పెషాలిటీ ఉన్న జిల్లా తిరుపతి. ఇక్కడ సెక్స్‌ రేషియో 1:1 గా ఉంది. ఎకానమీ పరంగా తిరుపతి నుంచి మంచి రెవెన్యూ బూస్ట్‌ ఉంటుంది. జిల్లా అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారులను కలుపుకొని ముందుకు వెళ‍్తాం.
-తిరుపతి జిల్లా కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి

9.36 AM
కొత్త జిల్లాలను వర్చువల్‌గా ప్రారంభించిన తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘ఏపీలో పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా జరిగే మంచిని గ్రామస్థాయి నుంచి చూశాం. ఇప్పుడు జిల్లా స్థాయిలో కూడా వికేంద్రీకరణ చేస్తున్నాం. ఇవ్వాళ్టి నుంచి మనది 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం ఏర్పడింది. తమతమ బాధ్యతలు తీసుకుని, పనులు ప్రారంభిస్తున్న ఉద్యోగులు, సిబ్బంది, అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నాను. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, తిరుపతి పేరుతో 13 కొత్తజిల్లాలు. పరిపాలనా సౌలభ్యాన్ని, వికేంద్రీకరణ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాల పేర్లు పెట్టాం.  గతంలో ఉన్న జిల్లాల పేర్లు అలాగే ఉన్నాయి. కనీసం ఒక పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున జిల్లాను ఏర్పాటుచేశాం’ అని అన్నారు.

► కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీలో సుస్థిర ప్రగతికి బాటలు వేసిన ప్రభుత్వం. అన్ని ప్రాంతాల సమతులాభివృద్ధికి బాటలు.

► ఆంధ్రప్రదేశ్‌లో 42 ఏళ్ల తర్వాత.. కొత్త జిల్లాల ఏర్పాటు 

9.29 AM
► తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి.. కొత్త జిల్లాలను ఒక్కొక్కటిగా వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌

► ఆంధ్రప్రదేశ్‌ కొత్త జిల్లాలను వర్చువల్‌గా ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా.. 13 జిల్లాలు కాస్త 26గా మార్పు. ఇకపై ఏపీ రాష్ట్రంలో 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లు.

9.24 AM
► కొత్తపేట ప్రజల మనోభావాలను, ఆకాంక్షలను సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. కొత్తపేట రెవెన్యూ డివిజిన్‌ ఏర్పాటును కోరుకుంటున్నారని వెల్లడి. జగ్గిరెడ్డి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌. తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన సీఎం వైఎస్‌ జగన్‌


► ప్రభుత్వ భవనాల్లోనే అత్యధిక శాతం కార్యాలయాలు. ఇప్పటికే సరిపడా అధికారుల, ఉద్యోగుల కేటాయింపులు.

8.55 AM
► మరికాసేపట్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్త జిల్లాల అవతరణ.. వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌

► కొత్త జిల్లాలతో పరిపాలన వికేంద్రీకరణ ద్వారా పాలనను ప్రజల చెంతకు మరింత దగ్గరగా తీసుకువెళ్లనున్నారు.

► సోమవారం ఉదయం 9.05 గంటలకు 26 జిల్లాల కలెక్టర్లు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత మిగిలిన శాఖల జిల్లా అధికారులు బాధ్యతలు స్వీకరిస్తారు.

► కొత్తగా 13 జిల్లాల ఏర్పాటుతో పునర్‌వ్యవస్థీకరించిన 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిపాలన చరిత్రలో నవశకానికి నాంది పలకనుంది. కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సోమవారం ఉదయం 9.05 – 9.45 గంటల మధ్య లాంఛనంగా ప్రారంభించనున్నారు. 

► ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ వాగ్దానాన్ని కార్యరూపంలోకి తీసుకు రానుంది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.

జిల్లాల పెంపుతో ఉపయోగాలివే 
► చిన్న జిల్లాల ఏర్పాటు ద్వారా జిల్లా కేంద్రం నుంచి మారుమూల సరిహద్దు గ్రామాలకు దూరభారం తగ్గనుంది. జిల్లా పరిపాలన యంత్రాంగం ప్రజలకు మరింత చేరువకానుంది. ప్రజల ఇంటి వద్దకు పాలన ద్వారా జవాబుదారీతనం ఇంకా పెరగనుంది. 

►  పాలనాపరంగా పర్యవేక్షణ పెరగనుంది. అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించే వెసులుబాటు ఉంటుంది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో మరింత వేగంగా మరింత పారదర్శకంగా అమలు చేసే అవకాశం ఉంటుంది. 

►  అన్ని ప్రాంతాల సమతులాభివృద్ధికి బాటలు వేయొచ్చు. అభివృద్ధిలో ప్రాదేశిక సమానత్వం, సమ్మిళిత ఆర్థిక వృద్ధి, బడుగు, బలహీన వర్గాల వికాసంతో పాటు సుస్థిర ప్రగతికి బాటలు వేస్తుంది. 

►  వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి మైళ్ల కొద్దీ తిరిగే దుస్థితిని తొలగిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలు, వారి క్యాంపు కార్యాలయాలతో సహా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం కనీసం 15 ఎకరాల సువిశాల స్థలంలో మంచి డిజైన్లతో పది కాలాలపాటు గుర్తుండే విధంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం సాగనుంది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

సంబంధిత వార్త: ఏపీ కొత్త జిల్లాల స్వరూపమిదే..పెద్ద జిల్లా, చిన్న జిల్లాలు ఇవే..

Advertisement
Advertisement