తెలుగు ప్రజలకు సీఎం వైఎస్‌ జగన్‌ సంక్రాంతి శుభాకాంక్షలు | Sakshi
Sakshi News home page

CM Jagan Sankranti Wishes: తెలుగు ప్రజలకు సీఎం వైఎస్‌ జగన్‌ సంక్రాంతి శుభాకాంక్షలు

Published Wed, Jan 12 2022 5:14 PM

CM YS Jagan Makar Sankranti 2022 Wishes To Telugu People - Sakshi

సాక్షి, తాడేపల్లి: మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ విశిష్టతను సీఎం వివరించారు. 'మనవైన అచ్చ తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు, సొంత గ్రామాలమీద మమకారానికి.. రైతులకు, వ్యవసాయానికి మనమంతా ఇచ్చే గౌరవానికి, తెలుగువారికంటూ ప్రత్యేకమైన కళలకు సంక్రాంతి పండుగ ప్రతీక’ అని సీఎం జగన్‌ అన్నారు.

‘భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్లు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయని.. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలి' అని ఆయన ఆకాక్షించారు.
(చదవండి: ఐటీసీ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌)

Advertisement
Advertisement