Why not 175/175 for YSRCP : సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

Why not 175/175 for YSRCP : సీఎం జగన్‌

Published Tue, Sep 26 2023 5:12 PM

CM YS Jagan Review Meeting On Gadapa Gadapaku Mana Prabhutvam - Sakshi

సాక్షి, తాడేపల్లి :  వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు 175 సీట్లు గెలవాలనే లక్ష్యంతో పని చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి పార్టీ నేతలకు సూచించారు. 

175కి 175 సీట్లు గెలవడం అసాధ్యం ఏమీ కాదని,  కచ్చితంగా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు సీఎం జగన్‌. ఈరోజు (మంగళవారం)  తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు సీఎం జగన్‌. ఈ మేరకు పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు.  ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కో-ఆర్డినేటర్లు, పార్టీ రీజినల్‌ ఇంచార్జులు హాజరయ్యారు.  

మనం గేర్‌ మార్చాల్సిన అవసరం వచ్చింది
‘ఇప్పటివరకూ మనం చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు..  రాబోయే కాలంలో చేపట్టే కార్యక్రమాలు మరో ఎత్తు. వచ్చే 6 నెలలు ఎలా పనిచేస్తామన్నది చాలా ముఖ్యం.  మనం గేర్‌ మార్చాల్సిన అవసరం వచ్చింది. మన పార్టీ, ప్రభుత్వం పట్ల సానుకూల స్పందన చూశారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలి. క్షేత్రస్థాయిలో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. ఒంటరిగా పోటీ చేయలేక ప్రతిపక్షాలు పొత్తులకు వెళ్తున్నాయి. మన పార్టీ, మన ప్రభుత్వం పట్ల సానుకూల అంశం చూశాం. ఇదే ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకేయాలి’ అని సూచించారు సీఎం జగన్‌.

‘అసెంబ్లీ నియోజకవర్గాల్లో విభేదాలు లేకుండా చూసుకోవాలి. మనమంతా ఒక కుటుంబంలోని సభ్యులమే. టికెట్లు రానంత మాత్రాన నిరాశ వద్దు.  కొందరికి టికెట్లు ఇవ్వొచ్చు.. మరికొందరికి ఇవ్వకపోవచ్చు. టికెట్లు రాని వారికి  మరో అవకాశం కల్పిస్తాం’ అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

వై ఏపీ నీడ్స్‌ జగన్‌ అనే కార్యక్రమం చేపట్టబోతున్నాం
ప్రజల్లో ఎవరికి ఇస్తే కరెక్ట్‌ అనే ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకోవచ్చు. టికెట్‌ ఇవ్వనంత మాత్రాన వాళ్లు నా వాళ్లు కాకుండాపోరు. టికెట్లపై ప్రతి ఒక్కరూ నా నిర్ణయాలను పెద్ద మనసుతో స్వాగతించాలి.  

టికెట్లు రాని వారికి మరొక అవకాశం కల్పిస్తాం. లీడర్‌, పార్టీ మీద నమ్మకం ఉండాలి.  సర్వేలు కూడా తుది దశలోకి వస్తున్నాయి. చివరి దశ సర్వేలు కూడా జరుగుతాయి. ప్రజల్లో ఎక్కువగా ఉంటే మంచి ఫలితాలు.  ప్రతి ఒక్కరూ ప్రజలతో మమేకమై ఉండాలి. వచ్చే నెలల్లో చేపట్టే కార్యక్రమాలు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం, వై ఏపీ నీడ్స్‌ జగన్‌ అనే కార్యక్రమం చేపడతాం’ అని తెలిపారు సీఎం జగన్‌.

మొత్తం ఐదు దశల్లో జగనన్న సురక్ష కార్యక్రమం
జగనన్న సురక్ష కార్యక్రమం వల్ల చాలా పాజిటివ్‌ వచ్చింది. దాదాపు 98 లక్షల సర్టిఫికెట్లు ఇచ్చాం. అర్హులకు అవసరమైన సర్టిఫికెట్లను జారీ చేశాం.ఇప్పుడు ఆరోగ్య సురక్ష చేపడుతున్నాం. ఆరోగ్య పరంగా ప్రతి ఇంటిని జల్లెడ పడతాం. ఉచితంగా మందులు, పరీక్షలు చేస్తాం. గుర్తించిన వారికి మెరుగైన చికిత్సలు అందిస్తాం. విలేజ్‌ క్లినిక్‌, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌తో చేయూతనిస్తాం. ఇందులో ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులను మమేకం చేస్తాం.మొత్తం ఐదు దశల్లో జగనన్న సురక్ష కార్యక్రమం. తొలి దశలో వాలంటీర్లు, గృహ సారథులు ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి వివరిస్తారు.రెండో దశలో ఏఎన్‌ఎంలు, సీహెచ్‌ఓలు, ఆశా వర్కర్లు ప్రతి ఇంటికి పరీక్షలు చేయడానికి వెళ్తారు. మూడో దశలో వాలంటీర్లు, గృహ సారథులు ప్రజా ప్రతినిధులు క్యాంపు వివరాలు తెలియజేస్తారు. నాల్గో దశలో క్యాంపులను ఏర్పాటు చేస్తారు. ఐదో దశలో అనారోగ్యంతో ఉన్న వారిని గుర్తించి వారికి నయం అయ్యే వరకూ చేయూతనిస్తారు’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement