Sakshi News home page

సంక్షేమం కొనసాగింపు జగన్‌కే సాధ్యం

Published Mon, Jan 8 2024 5:21 AM

Continuation of welfare is only possible for Jagan - Sakshi

డాబాగార్డెన్స్‌ (విశాఖపట్నం): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ ఫలాలు కొనసాగాలంటే వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆయననే సీఎంగా గెలిపించుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఈ ప్రభు­త్వం అమలుచేస్తున్న సంక్షేమ ఫలాలు ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగించలేవని కుండబద్ధలుగొట్టారు. మరే పాకి   సంక్షేమ ఫలాలు అందించే సత్తా లేదన్నారు. సంఘ సంస్కర్త జగన్‌ను గెలిపించుకోవల్సిన బాధ్యత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనాలతో పాటు అన్ని వర్గాల ప్రజలపై ఉందని తెలిపారు.  

ఆయన ఆదివారం నగరంలోని ఓ హోటల్లో విలేకరులతో మాట్లాడారు. అధికారం కోసం  ప్రతిపక్ష పార్టీలు బీసీలను ప్రలోభపెడుతున్నాయని, అటు­వంటి వాటిని తిప్పికొట్టాలన్నారు. బీసీల కోసం అనేక సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అని స్పష్టంచేశారు.    దేశంలో అనేక రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులున్నప్పటికీ ఆయా రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న సంక్షేమ ఫలాలు అమలుకావడం లేదన్నారు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లలో ఏ నాయకుడు ప్రవేశపెట్టని, అమలుచేయలేని ఎన్నో సంక్షేమ పథకాలు జగన్‌  ప్రవేశపెట్టి దేశంలో వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని గుర్తుచేశారు.   

70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 
దాదాపు 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్‌ అని కృష్ణయ్య చెప్పారు.  శాసనసభ స్పీకర్‌ పదవి బీసీ, శాసనమండలి చైర్మన్‌ ఎస్సీ వర్గానికి ఇవ్వడమే గాక 18 మంది ఎమ్మెల్సీల్లో 11 సీట్లు బీసీలకు కేటాయించడం చూసి దేశంలోని బీసీలంతా ఆశ్చర్యం వ్యక్తంచేశారన్నారు.  

పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంట్‌ చరిత్రను జగన్‌మోహన్‌రెడ్డి తిరగరాశారన్నారు. అందుకు వైఎస్సార్‌ సీపీ రెండేళ్ల కిందట బీసీ బిల్లు పెట్టిందని, మద్దతుగా 14 రాజకీయ పాల మద్దతు కూడగట్టిందన్నారు. అధికార బీజేపీ వ్యతిరేకించడంతో బిల్లు పెండింగ్‌లో ఉందన్నారు.  చివరకు పార్లమెంట్‌లో బీసీ పార్టీలుగా చెప్పుకుంటున్న డీఎంకే, అన్నాడీఎంకే, పీఎంకే, ఆర్‌జేడీ, సమాజ్‌వాద్‌ పార్టీ, బీఎస్పీ, ఆప్నాదళ్, జనతాదళ్‌ వంటి పాలు కూడా బీసీ బిల్లు పెట్టలేదన్నారు.  

50 శాతం నామినేటెడ్‌ పోస్టులు బీసీలకే..  
ఏపీలో 50 శాతం నామినేటెడ్‌ పోస్టులు వెనుకబడిన వర్గాలకు ఇవ్వడమే గాక, కాంట్రాక్టు పనుల్లో 50 శాతం కోటా ఇస్తూ అసెంబ్లీలో చట్టం చేసి దేశంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ ముఖ్యమంత్రులకు జగన్‌ సవాల్‌ విసిరారని కృష్ణయ్య చెప్పారు. 56 బీసీ కులాల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు 56 చైర్మన్లు, 672 మంది డైరెక్టర్లను నియమించారన్నారు. 193 కార్పొరేషన్లకు సంబంధించి 109 కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు దక్కడం చూసి ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు దిమ్మతిరిగిందన్నారు.

మంత్రివర్గంలో ఏకంగా 17 పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అవకాశం కల్పించడం ద్వారా సరికొత్త సామాజిక మహావిప్లవాన్ని సీఎం ఆవిష్కరించారని చెప్పారు. ఐదుగురు డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే..నాలుగు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనాలకే అవకాశం కల్పించారన్నారు. రాజ్యసభలో 9 మంది వైఎస్సార్‌ సీపీ సభ్యులుంటే..అందులో ఐదుగురు బీసీలేనని పేర్కొన్నారు. కాగా, చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్‌ అమలు చేయాలంటూ ఈ నెల 29, 30 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించనున్నట్టు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement