గుంటూరులో కోవిడ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌

26 Nov, 2020 04:28 IST|Sakshi
వ్యాక్సిన్‌ను మీడియాకు చూపిస్తున్న కలెక్టర్‌

గుంటూరు మెడికల్‌:  కోవిడ్‌–నివారణకు భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ బుధవారం గుంటూరు ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రిలో ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్‌ ఐ.శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ మాట్లాడుతూ ఐసీఎంఆర్‌ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రిలో వ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నామన్నారు.

రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ హైదరాబాద్‌లోని నిమ్స్‌లో 715 మందిపై చేసినట్లు వెల్లడించారు. గుంటూరులో 1,000 మందికి క్లినికల్‌ ట్రయల్స్‌ చేసేలా వ్యాక్సిన్‌ సిద్ధం చేశామన్నారు. నెల రోజుల్లో వెయ్యి మందికి వ్యాక్సిన్‌ వేసి పరిశోధనలు చేస్తామన్నారు. నిబంధనలను చదివి అంగీకార పత్రం ఇచి్చన తర్వాతే వలంటీర్లకు వ్యాక్సిన్‌ వేస్తామన్నారు. వ్యాక్సిన్‌ చేయించుకునేవారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్‌ వేయించుకోవాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తలు