శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం

28 Apr, 2022 05:28 IST|Sakshi
తిరుమల శ్రీవారి ఆలయం వద్ద భక్తుల రద్దీ

తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ కాస్త పెరిగింది. శ్రీవారిని మంగళవారం అర్ధరాత్రి వరకు 67,681 మంది దర్శించుకున్నారు. 31,738 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.4.54 కోట్లు వేశారు. ఎలాంటి టికెట్‌ లేకపోయినా భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. 20 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. 

మరిన్ని వార్తలు