Darsi Ex MLA Sanikommu Pitchi Reddy Passes Away - Sakshi
Sakshi News home page

దర్శి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

Published Thu, Oct 14 2021 9:16 AM

Darsi Former MLA Sanikommu Pitchi Reddy Passes Away - Sakshi

సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా వైఎస్సార్‌సీపీ నాయకులు, దర్శి మాజీ శాసనసభ్యులు సానికొమ్ము పిచ్చిరెడ్డి కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో ఒంగోలులో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి రెండు​ పర్యాయాలు 1989, 1999లలో దర్శి నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. పిచ్చిరెడ్డి మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. శుక్రవారం సాయంత్రం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పిచ్చిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

చదవండి: (ఎప్పటికప్పుడు జనన, మరణాల ధ్రువీకరణ)

Advertisement
Advertisement