వైభవంగా 7 ఆలయాల్లో విగ్రహ, కలశ ప్రతిష్ట | Sakshi
Sakshi News home page

వైభవంగా 7 ఆలయాల్లో విగ్రహ, కలశ ప్రతిష్ట

Published Fri, Mar 1 2024 5:46 AM

Demolition of seven temples in Bejawada during chandrababu ruling - Sakshi

బాబు హయాంలో బెజవాడలో ఏడు ఆలయాల కూల్చివేత

వాటిని పునర్నిర్మించిన సీఎం జగన్‌ 

ఉదయం 11.24 గంటలకు ఆలయాల్లో విగ్రహ, కలశ ప్రతిష్ట 

కార్యక్రమాల్లో పాల్గొన్న దేవదాయ శాఖ మంత్రి దంపతులు 

భగవంతుడిపై సీఎం జగన్‌కు అచంచలమైన విశ్వాసం ఉంది 

బాబుకు దేవుడిపై విశ్వాసమే లేదు 

దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): పుష్కరాల పేరుతో 2016లో అప్పటి సీఎం చంద్రబాబు కూల్చివేసిన విజయవాడలోని 7 ఆలయాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పునరి్నర్మించారు. వాటి విగ్రహ, కలశ ప్రతిష్ట వైభవంగా జరిగింది. మంగళవారం ప్రత్యేక పూజలతో ప్రారంభమైన ఈ కార్యక్రమాలు గురువారం ముగిశాయి. గురువారం ఉదయం 11.24 గంటలకు ఒకే సుముహూర్తంలో ఏడు ఆలయాల విగ్రహ, కలశ ప్రతిష్ట కార్యక్రమాలు వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తం గా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు పాల్గొన్నారు.

తొలుత సీతమ్మ వారి పాదాలు, దక్షిణ ముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద కలశ స్థాపన, విగ్రహ ప్రతిష్టను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని పాత మెట్ల మార్గం వద్ద నిర్మించిన వినాయక, ఆంజనేయ స్వామి వారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్నారు. కనకదుర్గ ఆలయ స్థానాచార్య శివప్రసాద్‌ శర్మ, వైదిక కమిటీ సభ్యులు యజ్ఞనారాయణ శర్మ, రఘునాథ శర్మతో పాటు ఇతర ఆలయ అర్చకులు పూజలు చేశారు. అనంతరం యాగశాలలో ఆలయ అర్చకులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తం గా జరిపించారు.

పూజా కార్యక్రమాల అనంతరం మంత్రి దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు  జరిపించుకున్నారు. విగ్రహ, కలశ ప్రతిష్ట అనంతరం గణపతి ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగింది. ఈ మహోత్సవంలో దుర్గగుడి చైర్మన్‌ కర్నాటి రాంబాబు, ఈవో కేఎస్‌ రామారావు, దేవదాయ శాఖ కమిషనర్‌ సత్యనారాయణ, దుర్గగుడి ఈఈలు కోటేశ్వరరావు, ఎల్‌.రమాదేవి, ఎఈవో ఎన్‌. రమే‹Ùబాబు, డీఈ వెంకటేశ్వరరావు, ఎఈ కుటుంబరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

జగన్‌ అందించిన ప్రతి సంక్షేమ పథకానికి దేవుడి ఆశీర్వాదం 
మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి భగవంతుడిపై అచంచలమైన విశ్వాసం ఉందని, ఆయన ప్రవేశపెట్టిన ప్రతి పథకం అమలు వెనుక దేవుడి ఆశీ­ర్వాదాలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే దేవుడికి ఎటువంటి అపచారం జరగకూడదన్నది సీఎం జగన్‌ భావన అని, అందుకే చంద్రబాబు కూల్చివేసిన ఆలయాలను తిరిగి పునర్నిర్మించారని తెలిపారు.

చంద్రబాబుకు దేవుడిపై విశ్వాసం లేనందునే విజయవాడ నడి»ొడ్డున ఉన్న పురాతన ఆలయాలను చంద్రబాబు నిర్దాక్షిణ్యంగా కూల్చి­వేయడమే కాకుండా దేవతామూర్తులను చెత్త వాహనాల్లో తరలించారని తెలిపారు. భగవంతుడికి అవమానం చేశాననే విచారం కూడా ఆయనకు లేదన్నారు. ఆయన అకృత్యాల కారణంగానే ఆయన పాలనలో రాష్ట్రంలో దుర్బిక్షం, కరువు రాజ్యమేలాయన్నారు.

సీఎం జగన్‌ పథకాలు అమలు చేయాలంటే దేశ బడ్జెట్‌ కూడా సరిపోదని చంద్రబాబు, పవన్‌ విమర్శించారని, అయి­నా దేవుడి అండతో ఐదేళ్లూ వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని సీఎం జగన్‌ అమలు చేశారని తెలిపారు. చంద్రబాబు నోరు మూతపడేలా సీఎం జగన్‌ ప్రజలకు సంక్షేమం అందించారన్నారు.

Advertisement
Advertisement