Sakshi News home page

61.37 లక్షల మందికి రూ.1,847.85 కోట్లు 

Published Sat, Apr 6 2024 3:06 AM

Disbursement of Pension at Village Secretariats - Sakshi

93.42% పింఛన్ల పంపిణీ పూర్తి 

చిత్తూరు, ఏలూరు, విశాఖ జిల్లాల్లో 95 శాతానికిపైగా పంపిణీ పూర్తి  

నేడూ కొనసాగనున్న పంపిణీ   

సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు.. వలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయించి తీవ్ర అవాంతరాలు సృష్టించాలని చూసినా ప్రభుత్వం ఠంఛన్‌గా పింఛన్‌ పంపిణీ చేసింది. కేవలం రెండున్నర రోజుల వ్యవధిలోనే 61,37,464 మంది లబ్ధిదారులకు రూ.1,847.85 కోట్లను అందించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ సచివాలయాల వద్ద బుధవారం మధ్యాహ్నం నుంచి పంపిణీ ప్రారంభించి, శుక్రవారం సాయంత్రానికి 93.42 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తి చేసింది.

ప్రభుత్వ ఆదేశాలతో ఎక్కువ అనారోగ్య సమస్యలు ఉన్న వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇళ్ల వద్దే సచివాలయాల ఉద్యోగులు పింఛన్లు పంపిణీ చేశారు. చిత్తూరు, ఏలూరు, విశాఖపట్నం జిల్లాల్లో 95 శాతం మందికి పైగా పంపిణీ పూర్తయినట్టు అధికారులు తెలిపారు. శనివారం కూడా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సచివాలయాల వద్ద పంపిణీ కొనసాగుతుంది. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement