Fact Check: వెలిగొండంత అక్కసు.. | Sakshi
Sakshi News home page

Fact Check: వెలిగొండంత అక్కసు..

Published Fri, Mar 8 2024 4:26 AM

Eenadu fake news on Veligonda Project - Sakshi

నీ బాబువల్ల కానిది జగన్‌ చేశాడనేగా నీ ఏడుపు రామోజీ?

వెలిగొండ ప్రాజెక్టుకు వ్యయం చేసిన నిధులను మింగేసిన చంద్రబాబు

పనులు చేయకుండానే కాంట్రాక్టర్లకు రూ.630.57 కోట్లు చంద్రబాబు దోచిపెట్టారని తేల్చిన కాగ్‌

కానీ, ప్రతి పైసాను సద్వినియోగం చేసుకుని సొరంగాలను పూర్తిచేసిన సీఎం వైఎస్‌ జగన్‌

వాటిని జాతికి అంకితం చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్న రామోజీ

ఆయకట్టుకు నీళ్లిచ్చే ఆస్కారమేలేదంటూ విషం చిమ్మిన ఈనాడు

సాక్షి, అమరావతి: ఏ రోగానికైనా మందు ఉంటుందేమోగానీ ఈనాడు రామోజీని పీడిస్తున్న ‘కడుపు­మంట’కు మాత్రం మందులేదు. నిత్యం ఆయన్ను దహించివేస్తున్న ఆ వ్యాధి రోజురోజుకూ ముదిరి­పోతోంది. దాని నుంచి విముక్తి లభిస్తుందన్న ఆశ కూడా కనుచూపు మేరలో కనిపించడంలేదు. ఫలితంగా ఆయన రోజూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. దీంతో.. కొంతలో కొంతనైనా ఉపశమ­నంగా  ఉంటుందని ఆయన రోజూ తన క్షుద్ర పత్రిక ఈనాడులో సీఎం వైఎస్‌ జగన్, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒక అశుద్ధ కథ­నాన్ని వండివారుస్తూ ఉదయం తనివితీరా చూసు­కుని తన బాధను చల్లార్చుకుంటున్నారు.

తాజాగా.. వెలిగొండ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన జంట సొరంగాలను పూర్తిచేసిన సీఎం వైఎస్‌ జగన్‌ బుధ­వారం వాటిని జాతికి అంకితం చేయడాన్ని రామోజీ­రావు తట్టుకోలేకపో­తున్నారు. చాలా పనులు మిగిలే ఉన్నాయని.. ఆయకట్టుకు నీళ్లిచ్చే ఆస్కారమే లేదంటూ ‘వెలికొండంత పెండింగ్‌’ శీర్షికన తన ఆక్రోశాన్ని, కడుపులో పేరుకు­పోయిన విషాన్ని గురు­వారం ఎప్పటిలాగే కక్కే­శారు.

నిజానికి.. వెలిగొండ ప్రాజెక్టును సీఎం వైఎస్‌ జగన్‌ వడివడిగా పూర్తిచేస్తుండటంతో ప్రకా­శం, నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంత రైతుల దశాబ్దాల కల సాకారమవుతోంది. దాంతో ఆ ప్రాంత రైతుల్లో సీఎం జగన్‌పై ఆదరణ మరింతగా పెరిగింది. ఇది చంద్రబాబు రాజకీయ ఉనికికే ప్రమాదకరంగా మారడంతో రామోజీ­రావుకు నిద్రపట్టడంలేదు. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు కనికట్టు చేసి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆయనిలా నానా అవస్థలు పడుతున్నారు.

వెలిగొండను పిండేసిన బాబు..
వాస్తవానికి.. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లా­ల్లోని 30 మండలాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.25 లక్షల మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా 2004, అక్టోబరు 27న వెలిగొండ ప్రాజెక్టుకు మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. తన హయాంలోనే రూ.3,610.38 కోట్లు ఖర్చు­చేసి.. 37.587 కిమీల పొడవైన జంట సొరంగాల్లో 20.333 కి.మీ.ల పనులు.. ఆ ప్రాజెక్టు­లోనే అంతర్భాగమైన నల్లమలసాగర్‌ను పూర్తి­చేశారు.

ఇక 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. 2014–19మధ్య ఈ ప్రాజెక్టుకు రూ.1,385.81 కోట్లు వ్యయంచేసినా కేవలం 6.686 కి.మీ.ల మేర మాత్రమే జంట సొరంగాల పనులు చేశారు. కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.630.57 కోట్లు దోచిపెట్టడాన్ని ఇటీవల కాగ్‌ (కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) నివేదిక బయటపెట్టింది. వెలిగొండకు ఖర్చుచేసిన నిధులను చంద్రబాబు మింగేయ­డం­వల్లే ఎక్కడి పనులు అక్కడే మిగిలిపోయాయి.

యుద్ధప్రాతిపదికన సొరంగాలు పూర్తి
ఇక సీఎం వైఎస్‌ జగన్‌ రూ.978.02 కోట్లు ఖర్చుచేసి.. అందులో ప్రతి పైసాను సద్విని­యోగం చేసుకుని వెలిగొండ జంట సొరంగాల్లో మిగిలిన 10.568 కి.మీ.ల పనులు యుద్ధప్రాతి­పదికన పూర్తిచేసి, జాతికి అంకితం చేశారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి.. రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక రెండు మూడు నెలల్లోనే నల్లమలసాగర్‌కు కృష్ణాజలాలను తరలిస్తామని ఆయన చెప్పారు. వచ్చే జూలై, ఆగస్టులలో నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను తరలించేలోగా రూ.1,200 కోట్లతో నిర్వాసితు­లకు పునరావాసం కల్పిస్తామని స్పష్టంచేశారు.

తొలిదశ కింద ఆయకట్టుకు నీళ్లందించడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. అలాగే, ప్రాజెక్టును మొత్తం ఒకేసారి పూర్తిచేసి ఆయకట్టు మొత్తానికి ఒకేసారి నీళ్లందించిన దాఖలాలు చరిత్రలో ఎక్కడాలేవు. ఎక్కడైనా ప్రాజెక్టును దశలవారీగా పూర్తిచేస్తూ అయకట్టుకు నీళ్లందిస్తారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులే అందుకు నిదర్శనం. వెలిగొండ ప్రాజెక్టులో కూడా మిగతా పనులను పూర్తిచేసి దశలవారీగా మొత్తం ఆయకట్టుకు నీళ్లందిస్తారు.

అసలు వెలిగొండ ఒక్కటే కాదు.. 2022 సెప్టెంబరు 6న నెల్లూరు, సంగం బ్యారేజ్‌లు.. 2023 సెప్టెంబరు 19న హంద్రీ–­నీవాలో అంతర్భాగమైనమైన లక్కసాగరం ఎత్తి­పోతల.. 2023 నవంబరు 30న గాలేరు–­నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌.. 2024 ఫిబ్రవరి 26న హంద్రీ–నీవాలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తిచేసి, జాతికి అంకితం చేసిన­ప్పుడు కూడా రాజగురువు ఇలాగే విషం చిమ్మారు.

Advertisement
Advertisement