నిరుద్యోగంపై దగా కథ | Sakshi
Sakshi News home page

నిరుద్యోగంపై దగా కథ

Published Wed, Feb 21 2024 5:43 AM

Eenadu false articles against Jagans government - Sakshi

సాక్షి, అమరావతి: బాబు వస్తేనే జాబు అంటూ నిరుద్యోగులను నిలుపునా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్ర కారం సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలల్లోనే 1.25 లక్షల  గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలను కొత్తగా సృష్టించి మరీ భర్తీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. ఇవే కాదు.. వైద్య రంగంతో సహా పలు రంగాల్లో వేలాది ఉద్యోగాలు ఇచ్చారు. బాబు దిగిపోయే 2019 మే నాటికి.. అంటే  ఈ 75 ఏళ్లలో రాష్ట్రంలో ఉద్యోగాల సంఖ్య 3,97,128. ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 6,38,087. ఈ ఒక్కటి చాలు ఈ నాలుగున్నరేళ్లలో సీఎం వైఎస్‌ జగన్‌ ఏ విధంగా ఉద్యోగాలిచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించారో చెప్ప డానికి.

‘దగా క్యాలెండర్‌’ అంటూ సీఎం జగన్‌ సర్కారుపై రామోజీ కక్కిన అక్కసు పచ్చి అబద్ధమనడానికి. ఐదేళ్లలో  ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వమూ ఇవ్వలేనన్ని ఉద్యోగాలు సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చారని చెప్పడానికి. సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా 2.21 లక్షల ఉద్యోగాలను రెగ్యులర్‌ చేశారు. 43,923 కాంట్రాక్టు ఉద్యోగాలు ఇచ్చారు. 3.73 లక్షల ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలిచ్చారు. ఒక్క వైద్య ఆరోగ్య శాఖలోనే ఏకంగా 53,446 పోస్టులను వైఎస్‌.జగన్‌ సర్కారు భర్తీ చేసింది. అంతే కాదు.. వైద్య ఆరోగ్య శాఖలో ఎన్నడూ లేని విధంగా పోస్టులు ఖాళీ వెంటనే భర్తీ చేసేలా జగన్‌ సర్కారు ఉత్త ర్వులు జారీ చేసింది.

 ప్రైవేటు రంగంలోనూ పరిశ్రమలను ప్రోత్సహిస్తూ జగన్‌ సర్కారు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తోంది.  ఇవన్నీ కళ్ల ముందు కనిపించే నిజాలు. అయినా, ఈనాడు రామో జీ మాత్రం కళ్లుండీ చూడలేని కబోదిలా జగన్‌ సర్కారుపై అక్కసు వెళ్లగక్కుతున్నారు.  వాస్తవానికి రాష్ట్రంలో నిరుద్యోగులను నిలువునా మోసం చేసింది చంద్రబాబే. జాబు రావాలంటే బాబు రావాలని, జాబ్‌ ఇవ్వకపోతే ప్రతి ఇంటికి నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానంటూ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువత నోట్లో మట్టి కొట్టారు.

బాబు హయాంలో ఐదేళ్లలో ఇచ్చింది 34,108 ఉద్యోగాలు మాత్రమే. చంద్రబాబు నిర్వాకంపై రామోజీ ఒక్క మాటా రాయరు. చంద్రబాబు సర్కా­రు ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్‌ను పట్టించుకోకపోతే ఇచ్చిన మాట మేరకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ చేస్తా­నని బాబు మాట ఇచ్చి గాలికి వదిలేస్తే, వైఎస్‌ జగన్‌ సర్కారు నెరవేర్చింది. సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరిగినట్లు ఇటీవల కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

2018–19లో 44.85 లక్షల ఈపీఎఫ్‌ ఖాతాలుంటే 2022–23 నాటికి ఈపీఎఫ్‌ ఖాతాల సంఖ్య 60.73 లక్షలకు పెరిగినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంటే 35 శాతం మేర ఈపీఎఫ్‌ ఖాతాలు పెరిగాయి. అంటే ఆమేరకు ఉద్యోగావకాశాలు పెరిగినట్టే. అత్యధిక ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న రాష్ట్రాల్లో దేశంలోనే ఏపీ నాలుగో స్థానంలో ఉందని 2023 స్కిల్‌ రిపోర్ట్‌ వెల్లడించింది. బాబు హయాంలో నిరుద్యోగ రేటు 5.3 శాతం ఉండగా, వైఎస్‌ జగన్‌ హయాంలో 4.1 శాతానికి తగ్గిపోయింది. 

బాబు హయాంలో ఉద్యోగుల వివరాలు 
2014–19 మధ్య బాబు హయాంలో ఉద్యోగాల భర్తీ 34,108 
బాబు దిగిపోయిన మే 2019 నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,97,128 

2019 జూన్‌ నుంచి వైఎస్‌ జగన్‌ సర్కారులో ఉద్యోగాల వివరాలు 
శాశ్వత ఉద్యోగుల సంఖ్య 2,21,003 
కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య 43,923 
ఔట్‌ సోర్సింగ్, ఇతర ఉద్యోగుల సంఖ్య 3,73,161 
మొత్తంఉద్యోగాల సంఖ్య 6,38,087 

Advertisement
Advertisement