ప్రజల భద్రతపైనా బురద రాతలేనా?  | Sakshi
Sakshi News home page

ప్రజల భద్రతపైనా బురద రాతలేనా? 

Published Sat, Dec 23 2023 5:05 AM

Eenadu false news on CC cameras - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు భద్రత కల్పించడం కూడా రామోజీకి తప్పుగా కనిపిస్తోంది. ప్రజల రక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి తీసుకుంటున్న చర్యలపైనా బురద జల్లుతూ ‘ఈనాడు’ మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కింది.

‘సీసీ కెమెరాల పేరుతో మరో అప్పు’ అంటూ శుక్రవారం ప్రచురించిన కథనాన్ని ఏపీ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌­(ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.మధుసూ­దన్‌రెడ్డి ఖండించారు. అప్పు కోసం హడావుడిగా నిర్ణయం తీసుకున్నారని.. ఆ అప్పును తీర్చడానికి జరిమా­నాలు విధిస్తున్నారంటూ ప్రజలను భయ­పెట్టే విధంగా కథనం రాశారంటూ తప్పుపట్టారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే..

పటిష్ట భద్రత కోసం సుదీర్ఘ కసరత్తు తర్వాతే నిర్ణయం..
రాష్ట్ర ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని అనేక అంశాలను పరిశీలించిన తర్వాత.. దీర్ఘకాలం ఉండే విధంగా రాష్ట్రంలో పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఆర్థికంగా సాధ్యాసాధ్యాలు, సర్వైలెన్స్‌ మౌలిక వసతులు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని సుదీర్ఘ కసరత్తు అనంతరం నిర్ణయం తీసుకోవడం జరిగింది.

రాష్ట్ర ప్రజల భద్రత కోసం ప్రస్తుతం ఉన్న వ్యవస్థను వినియోగించుకుంటూ కొత్తగా మౌలిక సదుపా­యాలను అభివృద్ధి చేయడమే దీని ప్రధాన లక్ష్యం. ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ నుంచి అభ్యర్థన వచ్చిన 10 రో­జు­ల్లో­నే రుణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిదంటూ ఈనా­డు రాసిన కథనంలో వాస్తవం ఏమాత్రం లేదు. తుది నిర్ణ­యం తీసుకునే ముందు ఆలోచ­నాత్మకంగా సుదీర్ఘంగా జరిగిన చర్చ.. ఇందుకు పట్టిన సమయాన్ని ‘ఈనాడు’ ఉద్దేశపూర్వకంగానే పరిగణనలోకి తీసుకోలేదు. 

రుణానికి, జరిమానాలకు లింకేంటి?
ఎక్కడా కూడా ఒక ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడానికి జరిమానాలపై ఆధారపడటం అనేది ఉండదు. ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాల నుంచి పొందిన లీజు అద్దెల వంటి ఆదాయాల ద్వారా మాత్రమే రుణాలు తిరిగి చెల్లిస్తాం. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించిన జరిమానాల ద్వారా వచ్చిన మొత్తాన్ని ప్రజల భద్రతా చర్యలకు వినియోగిస్తాం. అంతేగానీ జరిమానాల సొమ్మును రుణాలకు చెల్లిస్తారనే ఆరోపణ పూర్తిగా అవాస్తవం.

ఏపీని టాప్‌లో నిలబెట్టిన బీబీఎన్‌ఎల్‌..
ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ మొదటి నుంచీ ఈ ప్రాజెక్ట్‌ అమలు నిర్వహణ ఏజెన్సీగా కొనసాగుతోంది. అందులో భాగంగానే ఈ ప్రాజెక్టును హోం శాఖ కూడా వినియోగించుకుంటోంది. అలాగే రూ.300 కోట్ల రుణం అనేది బీబీఎన్‌ఎల్‌ మొత్తం ప్రాజెక్టు వ్యయంలో కేవలం 50 శాత­మేనన్న విషయాన్ని గమనించాలి. ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ, బీబీఎన్‌ఎల్‌ ప్రాజెక్టు­ను విజయవంతంగా అమలు చేశాం. అంతేకాదు దేశంలో భారత్‌ నెట్‌ మిషన్‌ లక్ష్యాలను సాధించిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను బీబీఎన్‌ఎల్‌ నిలబెట్టింది. బీబీఎన్‌ఎల్‌ ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణంలో పురోగతి లేదనే ఆరోపణ పూర్తిగా నిరాధారమైనది. 

Advertisement
Advertisement