Fact Check: ‘ఆరోగ్య సురక్ష’పైనా అక్కసే..  | Sakshi
Sakshi News home page

Fact Check: ‘ఆరోగ్య సురక్ష’పైనా అక్కసే.. 

Published Mon, Oct 2 2023 3:48 AM

Eenadu false writings on jagananna arogya suraksha - Sakshi

పద్నాలుగేళ్లపాటు రాష్ట్రాన్ని ఏలిన రామోజీ ఆత్మబంధువు  చంద్రబాబుకు ఏనాడు వైఎస్‌ జగన్‌ మాదిరిగా ప్రజలకు సేవ చేయాలని ఆలోచన కూడా రాలేదు. పైగా..  ఈ చేతగానితనాన్ని సమర్థించుకుంటూ ఈనాడు ఒక్కోరోజు ఒక్కో  రకంగా అడ్డగోలు వాదన చేస్తోంది.

తాజాగా ఆ వాదన దేనిమీదో తెలుసా.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై.. గత టీడీపీ ప్రభుత్వంలో  సంచార వైద్య సేవల కార్యక్రమమే ఇదని సిగ్గూఎగ్గూ లేకుండా రాసిపారేస్తోంది. నిజానికి..  ఈ రెండు కార్యక్రమాలను పోల్చిచూస్తే నక్కకు నాక లోకానికి ఉన్నంత తేడా ఉంది.

 సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వివిధ ఆరోగ్య సమస్య­లతో బాధపడుతూ వైద్యానికి ఏ ఒక్కరూ దూరం కావడానికి వీల్లేకుండా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్ర­మానికి తాజాగా శని­వారం శ్రీకారం చుట్టింది. 1.67 కోట్ల గృహాలకు వైద్య సిబ్బందిని పంపి ప్రజల సమ­స్యలు గుర్తించి వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటోంది. దేశంలో ఎక్కడా­లేని విధంగా ప్రజలకు ఎంతో ఉపయో­గ­పడే ఈ కార్యక్రమంపై రామోజీరావు ఎక్కడలేని అక్కసు వెళ్లగక్కారు.

ఈనాడులో ఆదివారం ‘వైకాపా వారి వైద్య శిబిరాలు’ అంటూ విషపు రాతలు రాసుకొచ్చారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభించిన తొలిరోజే రాష్ట్రవ్యాప్తంగా 620 వైద్య శిబిరాలను నిర్వహించి సొంత ఊళ్లలోనే 1.54 లక్షల మందికి పైగా ప్రజలకు ప్రభుత్వం ఉచిత వైద్య సేవలు అందించింది. అయితే, ఈ విషయాన్ని ఎక్కడా తన కథనంలో ప్రస్తావించని రామోజీ ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వంపై విషం కక్కింది.

రూపాయి ఖర్చులేకుండా..
గ్రామీణ ప్రాంతాల్లోని వివిధ అనారోగ్య సమస్యలున్న ప్రజలు స్పెషలిస్ట్‌ వైద్య సేవలు పొందాలంటే వ్యయ, ప్రయాసలకోర్చి ఆస్పత్రులకు వెళ్లాలి. ఈ ఇబ్బందులకు తావులేకుండా సొంత ఊరిలోనే పూర్తి ఉచితంగా స్పెషలిస్ట్‌ వైద్య సేవల కల్పనకు వైఎస్సార్‌సీపీ ప్రభు­త్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అమలు­చేస్తోంది. వైద్య శిబిరాల్లో 14 రకాల వైద్య పరీక్షలు, 172 రకాల మం­దులను అందుబాటులో ఉంచడంతో పాటు, వృద్ధు­లకు కంటి పరీక్షలు, కళ్లద్దాలు, హెల్త్‌ ప్రొఫైల్‌ మ్యాపింగ్‌ చేపడుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఆరోగ్యశ్రీ పథకంలో భాగమైన వైద్య శిబిరాలనే ఆరోగ్య సురక్ష శిబిరాలుగా నిర్వహిస్తున్నారని రామోజీరావు వింత వాదన చేస్తు­న్నారు. ప్రజలకు గతంలో ఎన్నడూలేని విధంగా మేలు చేస్తుంటే కడుపు మంటతో వాస్తవ దూరమైన రాతలు రాస్తుండటం రామోజీరావు దిగజా­రుడుతనానికి నిదర్శ­నంగా ఉంటోందని వైద్య రంగ నిపుణులు అంటున్నారు. 

రామోజీరావు డూప్‌ రాతలు..
ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసిన గత టీడీపీ పాలనలోని కార్యక్రమాలతో ప్రస్తుత ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలను పోల్చి రామోజీరావు డూప్‌ రాతలు రాయడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. గత ప్రభుత్వంలోని సంచార వైద్య సేవల కార్యక్రమాన్నే ఫ్యామిలీ డాక్టర్‌గా అమలుచేస్తున్నారని ఆయన ఆరోపించడం హాస్యాస్పదంగా ఉంది. కేవలం 292 డొక్కు 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్స్‌ (ఎంఎంయూ)తో మొక్కుబడిగా సంచార వైద్య సేవలను అప్పట్లో అమలుచేసేవారు. మందులు, వైద్య పరీక్షలు సరిగా అందుబాటులో ఉండేవి కాదు.

కానీ, ప్రస్తుతం సీఎం జగన్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో గ్రామాలకు నెలలో రెండుసార్లు ప్రభుత్వ వైద్యులు వెళ్తున్నారు. మంచానికి పరిమితమైన రోగుల ఇళ్లకు వెళ్లి వైద్యం చేస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం ఏకంగా 936 ఎంఎంయూ వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. అంతేకాక.. 105 రకాల మందులు, 14 రకాల వైద్య పరీక్షలు సొంత గ్రామంలో అందిస్తోంది.

ఈ లెక్కన పరిశీలిస్తే.. టీడీపీ ప్రభుత్వంలో అమలుచేసిన సంచార వైద్య సేవలు, ప్రస్తుత ఫ్యామిలీ డాక్టర్‌ విధా­నానికి మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. దీన్ని కప్పిపుచ్చి ప్రభుత్వం చేస్తున్న మంచి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేలా రామోజీరావు దురుద్దేశ్యంతో రోత రాతలు రాసుకొచ్చారు.

Advertisement
Advertisement