నాకు తెలిసిన వైఎస్సార్...|

7 Jul, 2023 19:10 IST|Sakshi

నాకు తెలిసిన వైఎస్సార్...|

ప్రజలకు సేవకుడు
పేదలకు  దేవుడు
రాజకీయాలకు రాజనీతిజ్నుడు
తెలుగునేలకు   యుగపురుషుడు
అన్నదాతలకు  ఆపద్భాంధవుడు

అక్కాచెల్లెమ్మలకు తోడబుట్టినవాడు
బీళ్లలో నీళ్లు నింపిన భగీరథుడు
కష్టాల్లో ఉన్నవారి కన్నీళ్లు తుడిచిన కారణజన్ముడు
కష్టకాలంలో వెంటున్నవారికి కాపాడుకున్న నాయకుడు

తరతరాలకు  ఆదర్శప్రాయుడు
నడకలో నవతరానికి మార్గదర్శకుడు
నడతలో దార్శనికుడు
సంక్షేమ రాజ్యం సైనికుడు
అభివృద్ధి కాముకుడు

నేను చూసిన వైఎస్సార్...|

నిలువెత్తు సంస్కారం, విలువెత్తు ఆకారం
గుడిలేని దైవం, గుండె గుండెను కదిలించే గుణం
ఆదర్శమైన వ్యక్తిత్వం, పేదలంటే మమకారం
నడిచొచ్చే నమ్మకం, పడిలేచిన కెరటం
పంచెకట్టిన పోరాటం, రాజీపడని రాజసం
తలెత్తుకు తిరిగే తెలుగు తేజం, తలదించడం తెలియని ధైర్యం
మట్టిని ప్రేమించే మానవత్వం, మరణం లేని రూపం
మరపురాని అభిమాన శిల్పం


నేను మరవని  వైఎస్సార్..| 

ఆకలిలేని ఆంధ్రను ఆవిష్కరించారు
అక్షర జ్ఞానం అందరికీ అందించారు
కరువు నేలపై వరుణుడిని కురిపించారు
కర్షకుల కళ్లల్లో నీళ్లు తుడిచారు
ఆరోగ్యశ్రీతో ప్రాణం పోశారు
అభాగ్యులకు ఆరోగ్య భరోశానిచ్చారు
పసిగుండెలను పదిలంగా కాపాడారు
పాడిపంటలను పరవశింపజేశారు
పరిపాలనలో కీర్తి శిఖరమై నిలిచారు
గుండెతో పాలించారు
పాలనతో ప్రతి గుండెను చేరారు
చెమటజీవుల చీకట్లలో వెలుగు నింపారు
బడుగు జీవుల పాలిట వేగుచుక్కలా నిలిచారు
పావలా వడ్డీతో పరపతిని పెంచారు
ఉపాధి హామీతో ఊతమై నిలిచారు
నిలువనీడలేని నిరుపేదలకు నీడనిచ్చారు
నాలాంటివారెందరికో జీవితాన్నిచ్చారు
ఆకాశమంత ఎత్తుకి ఎదిగారు
ఆకాశ మార్గాన మాయమైపోయారు
ఆశయాన్ని వారసునికి వదిలారు
కర్తవ్యాన్ని కార్యసాధకునికి విడిచారు

ఆంధ్రుల గుండెల్లో..
తెలుగు ప్రజల ఆలోచనల్లో..
తెలుగునేల చరిత్ర పుటల్లో

వెయ్యేళ్లు వర్థిళ్లు రాజన్నా....|

ఇట్లు..
YSR అభిమాని నిద్దాన సతీష్

మరిన్ని వార్తలు