This Fish Is A Bit Different Compared To Normal Fish - Sakshi
Sakshi News home page

ఇదో రాకాసి మీనం: వలను చించేస్తూ..  భూమిని చీలుస్తూ!

Published Thu, Jul 20 2023 12:06 PM

This fish is a bit different compared to normal fish - Sakshi

చిత్రంలో మీరు చూస్తున్నది చేపే. కానీ ఇది కొంచెం వైల్డ్‌. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రచెరువులో బుధవారం దర్శనమిచ్చింది. మామూలు చేపలతో పోలిస్తే విభిన్నంగా కనిపించడంతో ప్రజలు దీనిని చూసేందుకు ఆసక్తి చూపారు. ఈ చేప కోసం పరిశోధకుల్ని సంప్రదిస్తే వారు బోలెడు విషయాల్ని వివరించారు.   
– కాశీబుగ్గ

ఇదీ చేప కథ..  

  • శాస్త్రీయ నామం: టెరిగో ఫ్లిక్తీస్‌ పరదాలిస్‌  
  • వ్యవహారిక నామం: అమెజాన్‌ అంటుబిల్ల.. సెయిల్‌ ఫిన్‌ క్యాట్‌ ఫిష్‌ 
  • నీటి అడుగు భాగంలో బొరియలు చేస్తాయి. తద్వారా జీవవైవిధ్యం దెబ్బతింటుంది.  
  • మత్స్యకారుల వలలను తమ శరీర భాగాలతో చించేస్తాయి.  
  • ఈ చేపల్ని పక్షులు ఆరగిస్తే వాటి ఆహార నాళం చిరిగిపోయి మరణిస్తాయి. 
  • ఇది విదేశాలకు చెందినది. అక్వేరియంలో పెంచేందుకు దీనిని గతంలో భారత్‌కు తీసుకొచ్చారు. అక్వేరియంలో ఉండే నాచు పదార్థాన్ని తిని శుభ్రపరచడం దీని ప్రత్యేకత. 
  • నీరు లేకపోయినా ఎక్కువ సేపు బయట బతకగలగడం మరో ప్రత్యేకత. 
  • మన దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, వెస్ట్‌బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఇవి కనిపిస్తాయని జీవ వైవిధ్య శాస్త్రవేత డాక్టర్‌ కర్రిరామారావు ‘సాక్షి’కి వివరించారు. 2014లో దీనిని తెలంగాణలో తొలిసారి గుర్తించినట్లు ఆయన తెలిపారు.  

Advertisement
Advertisement