Sakshi News home page

గౌతమ బుద్ధుడి విగ్రహావిష్కరణ

Published Tue, Jul 12 2022 10:54 PM

Gautama Buddha Statue Inauguration In Madanapalle - Sakshi

మదనపల్లె : మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లె వద్ద బుద్ధునికొండపై  అంబేడ్కర్‌ సమాజ్, భారతీయ అంబేడ్కర్‌ సేవ ఆధ్వర్యంలో మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఆది, సోమవారాల్లో రెండు రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నవాజ్‌బాషా పాల్గొన్నారు. ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులు, బౌద్ధ ఉపాసకులతో కలిసి తథాగతుడు గౌతమబుద్ధుని విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ హితం కోసం సర్వ సుఖాలను త్యాగం చేసిన మహోన్నతుడు గౌతమ బుద్ధుడని కొనియాడారు. మానవ వికాసానికి హేతుబద్ధమైన గొప్ప జీవన మార్గాన్ని ఆయన ప్రపంచానికి అందించారని కీర్తించారు.

ధార్మికసేవ పురస్కారాలు
బాస్‌ సంస్థల వ్యవస్థాపకుడు పీటీఎం శివప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన ధర్మపునరుద్ధరణ సభలో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న పలువురికి ధార్మిక సేవా పురస్కారాలు అందజేశారు. ఈ పురస్కారాలు అందుకున్న వారిలో విజయ భారతి హైస్కూల్‌ కరస్పాండెంట్‌ డాక్టర్‌ సేతు, సీనియర్‌ మున్సిపల్‌ కౌన్సిలర్‌ మార్పురి నాగార్జున బాబు అలియాస్‌ గాంధీ, ఫోర్డు సంస్థ చైర్మన్‌ లలితమ్మ, హెల్పింగ్‌ మైండ్స్‌ వ్యవస్థాపకుడు అబూబకర్, గ్రామజ్యోతి సంస్థ అధ్యక్షురాలు సుభద్ర, హెడ్‌కానిస్టేబుల్‌ రామ్మూర్తి,

కుబా సంస్థ అధ్యక్షుడు రోషన్, ధౌత్రి ఫౌండేషన్‌ అధ్యక్షురాలు స్వామి, ఏపీయూఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు ప్రణయ్, సేదా సంస్థ అధ్యక్షుడు పఠాన్‌ ఖాదర్‌ఖాన్‌ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బుద్ధ అంబేడ్కర్‌ సమాజ్‌ ప్రతినిధులు చాట్ల బయన్న, సోనగంటి రెడ్డెప్ప, నీరుగొట్టి రమణ, భారతీయ అంబేడ్కర్‌ సేన నాయకులు శ్రీచందు, రమణ, గణపతి, మోహన్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement