వైఎస్సార్‌ అమర్‌రహే | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ అమర్‌రహే

Published Sun, Jul 9 2023 4:45 AM

Grand YSR Jayanti celebrations - Sakshi

సాక్షి, అమరావతి: పరిపాలనలో మానవత్వాన్ని జోడించి ప్రజల హృదయాల్లో చెరగని జ్ఞాపకంగా నిలిచి, పాలకుడంటే ఎలా ఉండాలో చాటిచెప్పిన దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 74వ జయంతి సందర్భంగా ప్రజలు, అభిమానులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు శనివారం ఘనంగా నివాళులు అర్పించారు. ‘జోహార్‌ వైఎస్సార్‌.. వైఎస్సార్‌ అమర్‌రహే’’ అంటూ వాడవాడనా నినదించారు. ప్రజలు మహానేత అందించిన పథకాలను గుర్తుచేసుకున్నారు.

గ్రామగ్రామాన కేక్‌లు కట్‌ చేసి.. పేదలకు వస్త్ర, అన్నదానం చేశారు. భారీ ఎత్తున రక్తదానం చేసి మహానేతపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాలు, 175 నియోజక­వర్గాల్లో వైఎస్‌ జయంతి వేడుకలను వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పండుగలా నిర్వహించారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సహా దేశంలో పలు రాష్ట్రాల్లో అభిమానులు, ప్రజలు మహానేతకు ఘనంగా నివాళులు అర్పించారు. 

మీ పథకాలు మరువలేనివి 
వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఘనంగా నిర్వహించారు.  విజయవాడ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ వద్ద ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యేలు పూల మాల వేసి నివాళులర్పించారు. జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లో జరిగిన కార్యక్రమాల్లో అభిమానులు కేక్‌ కట్‌ చేశారు. పెడన, గుడివాడ పట్టణాల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు జోగి రమేశ్, విడదల రజిని పాల్గొన్నారు.

ఏలూరు జిల్లా గుండుగొలనులోని మెగా జగనన్న హౌసింగ్‌ కాలనీ ద్వారం వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల అన్నదానాలు నిర్వహించారు. ఒంగోలు, సంతనూతలపాడు, మార్కా­­పురం, గిద్దలూరు, చీరాల, యర్రగొండపాలెం, దర్శి, అద్దంకి నియోజకవర్గాల్లో పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి జయంతి వేడుకలు ఉమ్మడి గుంటూరు జిల్లా­లో ఘనంగా జరిగాయి.

పల్నాడులో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు విడదల రజిని, అంబటి రాంబాబు, బాప­ట్లలో మేరుగ నాగార్జున పాల్గొ­న్నారు. నెల్లూరు జిల్లాలో ఊరూరా వైఎస్సార్‌ విగ్ర­హా­లకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జల­యజ్ఞం, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ,, రైతులకు ఉచిత విద్యుత్, తదితర సంక్షేమ పథకా­లను అమలు చేసి తమ మనసుల్లో వైఎస్సార్‌ గుర్తుండిపోయారని ప్రజలు, అభిమానులు కొనియా­డారు.  

గుండెల్లో కొలువైన నేతకు జన నీరాజనం 
ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్సార్‌ జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పలువురు ఎమ్మెల్యేలు, నేతల ఆధ్వర్యంలో పేదలకు చీరలు పంపిణీచేశారు. రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఆసుపత్రుల్లో పండ్లు, రొట్టెలు పంపిణీచేశారు. తమ గుండెల్లో కొలువైన జననేత వైఎస్సార్‌ జయంతి వేడుకలను ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. పార్వతీపురంలో వైఎస్సార్‌ విగ్రహానికి వేలాది మంది పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మంత్రి పీడిక రాజన్నదొర సాలూరులో, విజయనగరంలో వైఎస్సార్‌ విగ్రహాలకు మంత్రి బొత్స సత్యనారాయణ, శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం  నిర్వహించారు.

కోరుకొండలో రక్తదానశిబిరాన్ని నిర్వహించారు. కాకినాడ సిటీ బులుసు సాంబమూర్తి పాఠశాలలో పార్టీ, నాయకులు, కార్యకర్తలు, అన్న, వస్త్రదానం చేశారు. అమలాపురం ఏరియా ఆస్పత్రిలో వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు రక్తదాన శిబిరం నిర్వహించారు. వైఎస్సార్‌  జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

విదేశాల్లో వైఎస్సార్‌కు ఘనంగా నివాళులు.. 
ప్రపంచ వ్యాప్తంగా విదేశాల్లో ఎన్నారైలు, ప్రవాసాంధ్రులు మహానేత వైఎస్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. అమెరికా, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, కెనడా, యూకే, జర్మనీ, దక్షిణాఫ్రికా, సింగపూర్, మలేసియా, ఒమన్, యూఏఈ, సౌదీ అరేబియా తదితర 17 దేశాల్లో ప్రవాసాంధ్రులు, భారతీయులు మహానేత వైఎస్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్రానికి, దేశానికి మహానేత వైఎస్‌ చేసిన సేవలను స్మరించుకున్నారు.

సేవా మార్గంలో జయంతి వేడుకలు..
దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలను ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అన్నదానం, రక్తదానం, వస్త్రదానం తదితర సేవామార్గాల్లో నిర్వ­హించారు. గంగాధరనెల్లూరు మండలం వెజు­్జపల్లెలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆధ్వర్యంలో, నగరి మండలంలోని బుగ్గ అగ్రహారంలో మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. చిత్తూ­రు, పూతలపట్టు, కుప్పం, పలమనేరు, పుంగనూరు­లో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు.

తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి గుమ్మనూరు జయరాం ఆలూరు నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొ­న్నారు. కర్నూలు, ఆదోని, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగనూరు, నంద్యాల, నందికొట్కూరు, బనగానపల్లె, పాణ్యం, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించారు.

వైఎస్సార్‌ జయంతి ఉత్సవాలు ఆయన సొంత జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. కడపలో హెడ్‌ పోసా­్టఫీసు వద్దనున్న వైఎస్సార్‌ విగ్రహానికి డిప్యూటీ సీఎం అంజద్‌బాషా క్షీరాభిషేకం చేశారు. పులివెందులలో వైఎస్సార్‌ విగ్రహానికి ఎంపీ వైఎస్‌ అవినా‹Ùరెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేల్, జమ్మలమడుగు, కమలాపురం, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement