Weather Forecast Andhra Pradesh: Heavy Rainfall For The North Andhra Says Department Of Meteorology - Sakshi
Sakshi News home page

బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం

Published Thu, Jun 10 2021 3:31 PM

Heavy Rainfall For The North Andhra Says Department Of Meteorology - Sakshi

విశాఖ: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ వాయవ్య దిశగా ఒడిశావైపు అల్పపీడనం కదులుతోంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రకు రెండ్రోజులపాటు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇక దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో విశాఖపట్టణం తీరం వెంబడి గంటకు 45-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ సందర్భంగా సముద్రంలో చేపల వేటకు మత్య్సకారులు ఎవరూ వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement