ఏపీ, తమిళనాడుకు వర్షసూచన | Sakshi
Sakshi News home page

ఏపీ, తమిళనాడుకు వర్షసూచన

Published Sat, Jan 6 2024 8:54 AM

IMD Says Rain Forecast for AP And Tamil Nadu - Sakshi

సాక్షి, అల్లూరి/విశాఖపట్నం: ఏపీలోని రాయలసీమ, దక్షిణకోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి బంగాళాఖాతం మీదుగా ద్రోణి కొనసాగుతోంది. ద్రోణికి అనుబంధంగా సముద్ర మట్టంపై 1.5 మీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతున్నట్టు ఐఎండీ పేర్కొంది. వీటి ప్రభావం ఉన్న తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. 

ఇక.. ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అల్లూరి జిల్లాలోని లంబసింగిలో ఏకంగా ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక, చింతపల్లిలో ఎనిమిది డిగ్రీలు, అరకు లోయలో పది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయినట్టు అధికారులు తెలిపారు. 

అలాగే, 
పాడేరు అ‍మ్మవారి పాదాలు వద్ద 8.2,
మినుములూరు వద్ద 9.1,
పాడేరులో 10 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. 

Advertisement
Advertisement