19న అంబేడ్కర్‌ స్మృతివనం ప్రారంభోత్సవం | Sakshi
Sakshi News home page

19న అంబేడ్కర్‌ స్మృతివనం ప్రారంభోత్సవం

Published Fri, Jan 12 2024 5:04 AM

Inauguration of Ambedkar Memorial on 19th - Sakshi

సాక్షి, అమరావతి: విజయవాడ స్వరాజ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ స్మృతివవాన్ని ఈ నెల 19న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీ­లక్ష్మి తెలిపారు. స్మృతివనం పనులను శ్రీలక్ష్మి గురువారం వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. 18.81 ఎక­రాల స్థలంలో రూ.400 కోట్లతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అంబేడ్కర్‌ స్మృతివనం, కాంస్య విగ్రహ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నా­యని చెప్పారు. అంబేడ్కర్‌ విగ్రహం ఎత్తు 125 అడు­గులు కాగా, పాదపీఠం ఎత్తు 85 అడు­గులు అని, దీంతో మొత్తం విగ్రహం ఎత్తు 210 అడుగులు ఉంటుందన్నారు.

ప్రపంచంలో ఇదే అత్య­ంత ఎత్తయిన అంబేడ్కర్‌ విగ్రహం అని తెలిపారు. స్మృతివనంలోని అంబేడ్కర్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్, కన్వెన్షన్‌ సెంటర్, మినీ థియేటర్, ఫుడ్‌ కోర్టు, చిన్నారులకు ప్లే ఏరియా, గార్డెన్లు, మ్యూజిక్‌ ఫౌంటెయిన్, వాటర్‌ ఫౌంటెయిన్‌లు కూడా సీఎం జగన్‌ ప్రారంభి­స్తారని వివరించారు. స్మృతివనం ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర పండుగలా నిర్వహిస్తామన్నారు.  

ప్రపంచంలోనే అద్భుతమైన కళాఖండం 
ప్రపంచంలోనే అద్భుతమైన కళాఖండంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్మృతివనాన్ని తీర్చిదిద్దారని ఏపీ ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ మారుమూడి విక్టర్‌ ప్రసాద్‌ అన్నారు. అంబేడ్కర్‌ స్మృతివనాన్ని గురువారం ఆయ­న పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లా­డుతూ.. విజయవాడకే సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచిన అంబేడ్కర్‌ విగ్రహ ప్రారం¿ోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివస్తారని చెప్పారు.

Advertisement
Advertisement