కడప నుంచి ఇండిగో విమాన సర్వీసులు

1 Feb, 2022 05:17 IST|Sakshi

మార్చి 27 నుంచి చెన్నైకి, విజయవాడకు

సాక్షి, అమరావతి: కడప నుంచి విజయవాడ, చెన్నైలకు ఇండిగో విమాన సర్వీసులు నడిపేందుకు ఆ సంస్థ ఏపీ ఎయిర్‌పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీడీసీఎల్‌)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటివరకు ఈ మార్గాల్లో విమానాలు నడిపిన ట్రూజెట్‌ సంస్థ తాము సర్వీసులు నడపలేమని ఒప్పదం రద్దుచేసుకోవడంతో ఇండిగోకు అవకాశం కల్పించారు.

ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థకు వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ (వీజీఎఫ్‌) కింద రూ.20 కోట్లు చెల్లించనుంది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇండిగో సంస్థ మార్చి 27 నుంచి వారానికి నాలుగు విమానాలను చెన్నై–కడప, విజయవాడ–కడప మధ్య నడపనుంది. 

మరిన్ని వార్తలు