ఔషధ విక్రయాల్లో అక్రమాలను అరికట్టాలి | Sakshi
Sakshi News home page

ఔషధ విక్రయాల్లో అక్రమాలను అరికట్టాలి

Published Fri, Jun 16 2023 5:22 AM

Irregularities in drug sales should be stopped - Sakshi

సాక్షి, అమరావతి: ఔషధాల క్రయవిక్రయాల్లో అవకతవకలు, నకిలీ, నాణ్యత లేని మందుల చెలా­మణి, మెడికల్‌ షాపుల్లో అక్రమాలను అరికట్ట­డానికి డీజీ స్థాయిలో తనిఖీలు చేయాల్సిన అవస­రం ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి  విడ­ద­ల రజిని పేర్కొన్నారు. ఔషధ నియంత్రణా విభాగంపై గురువారం మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఔషధ నియంత్రణా విభాగం మరింత సమర్థంగా పనిచేయా­లని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థా­యిలో వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఇతర సిబ్బంది ఖాళీల భర్తీకి నివేదిక తయారుచేయాలని చెప్పారు.

కేంద్ర ఔషధ నియంత్రణ శాఖకు సంబంధించిన ప్రాంతీయ కా­ర్యాలయాన్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులకు లేఖ రాయాలన్నారు. సీఆర్‌యూ ఫిర్యాదుల వ్యవస్థను మరింత బలో­పేతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో వైద్యశాఖ ప్రత్యేక, ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఔషధ నియంత్రణ డీజీ కొల్లి రఘురామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement